పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిచే టాబ్లెట్

By | February 20, 2012 5 comments
టాబ్లెట్ పీసీల గురించి మనం చాలా విన్నాం. కానీ పిల్లల కోసం ప్రత్యేకంగా తయారైన టాబ్లెట్‌ల గురించి చాలామందికి తెలియదు. వీటిని టాబ్లెట్ పీసీలతో కంపేర్ చేయలేం. కాకపోతే పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిస్తాయి. 


నాబీ Nabi 
ఉపయోగం : పుస్తకాలు, వీడియోలు, గేమ్స్, డ్రాయింగ్స్ ఎన్నో ఇందులో ఉంటాయి. ఇది పిల్లలు ఆడుతూ నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. 
ఫీచర్స్ : 7 అంగుళాల డిస్‌ప్లే, 1.1 జిహెచ్‌జెడ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్
ఎక్కడ దొరుకుతుంది?: www.buyatabletpc.net


లీప్ ప్యాడ్ Leap Pad 
ఉపయోగం : పిల్లల ఊహాశక్తిని పెంచేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మ్యాథ్స్, స్పెల్లింగ్ గేమ్స్ చాలా ఉన్నాయి. 
ఫీచర్స్ : 5 అంగుళాల స్క్రీన్, 2జీబీ మెమరీ, 400 ఎంహెచ్‌జెడ్ ప్రాసెసర్
ఎక్కడ దొరుకుతుంది? : www.leapfrog.com


కిండెల్ ఫైర్ Kindle Fire 
ఉపయోగం : ఇది పిల్లలకు బాగా ఉపయోగపడే టాబ్లెట్. సినిమాలు, టీవీ షోలు, సంగీతం.. పుస్తకాలు ఇందులో లభిస్తాయి. 
ఫీచర్స్ : డ్యూయల్ కోర్ ప్రాసెసర్, టచ్ స్క్రీన్ 
ఎక్కడ దొరుకుతుంది?: www.amazon.com


బూగీ బోర్డ్ Boogi Board 
ఉపయోగం : 10 రకాల మోడల్స్ లభిస్తున్నాయి. ఇది పేపర్‌కి ప్రత్యామ్నాయం. భవిష్యత్తు కాగితాలు ఇవే అవుతాయి. 
ఫీచర్స్ : .5 అంగుళాల స్క్రీన్, అన్ని టాబ్లెట్‌ల మాదిరి ఫీచర్లు ఇందులో ఉండవు. 
ఎక్కడ దొరుకుతుంది?: www.boogieboard.org


యుబిఐ స్లేట్ Ubi Slate 
ఉపయోగం : నెంబర్ వన్ ఇండియన్ టాబ్లెట్ ఇది. ఇంటర్‌నెట్, వీడియో కాల్స్, వై-ఫై, జీపీఆర్‌ఎస్ ఉపయోగించుకోవచ్చు. పుస్తకాలు చదువుకోవచ్చు. 
ఫీచర్స్ : 7 అంగుళాల స్క్రీన్, కోర్‌టెక్స్ ప్రాసెసర్, హెచ్‌డీ వీడియో, 2 జీబీ ఇంటర్నల్ మెమరీ, మైక్రో ఎస్‌డీ కార్డ్
ఎక్కడ దొరుకుతుంది?: www.ubislate.com


విన్సీ ట్యాబ్ Vinci Tab 
ఉపయోగం : దీనితో ఆడుతుంటే ఫార్ములా వన్ కారు నడుపుతున్నట్లు ఉంటుంది. చాలా రకాల అప్లికేషన్లు యాడ్ చేసుకోవచ్చు. 
ఫీచర్స్ : 7 అంగుళాల స్క్రీన్, 3 ఎంపీ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, కోర్‌టెక్స మైక్రో ప్రాసెసర్
ఎక్కడ దొరుకుతుంది?: www.vincigenius.com


ఇన్నోట్యాబ్ InnoTad 
ఉపయోగం : ఇందులో చాలా ఎడ్యుకేషన్ యాప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ-బుక్స్ చదువుకోవచ్చు. పాటలు వినొచ్చు. వీడియోలు చూడొచ్చు. 
ఫీచర్స్ : 5 అంగుళాల టచ్ స్క్రీన్, 64 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, 16 జీబీ మెమరీకార్డ్
ఎక్కడ దొరుకుతుంది? : www.vtechkids.com


ఇంటెక్స్ అవతార్ 3డి 
కంప్యూటర్ విడిభాగాలు, మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ మరో కొత్త ఫోన్‌ని విడుదల చేసింది. ఇంటెక్స్ అవతార్ పేరుతో లభిస్తున్న ఈ ఫోన్ ప్రత్యేకత త్రీడీ ఫెసిలిటీ. దీని ద్వారా 2డీ ఇమేజ్‌లను డెడికేటెడ్ బటన్‌తో 3డీలోకి మార్చుకోవచ్చు. డ్యుయల్ సిమ్, టచ్ స్క్రీన్, 2 ఎంపీ కెమెరా, 2. ఇంచెస్ స్క్రీన్, 16జీబీ ఎక్స్‌పెండబుల్ మెమరీ, బ్లూటూత్, ఎఫ్‌ఎమ్, టార్చ్‌లైట్‌లు కామన్ ఫీచర్లు. డౌన్‌లోడ్ చేసి ఇస్తారు, అలాగే 3డి గ్లాసెస్ కూడా ఇస్తారు.దీనిలో క్రేజీబర్డ్స్, ఫ్రూట్‌నింజా, పెంటాచెస్, కాల్ ఆఫ్ అట్లాంటిస్‌లాంటి అప్లికేషన్లు.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు ఇందులో ఉన్న మరికొన్ని ఫీచర్లు. ఇంటెక్స్ జోన్, ఆన్సరింగ్ మిషిన్, మొబైల్ ట్రాకర్, ఆటో కాల్ రికార్డ్ సదుపాయాలు సరికొత్త ఫీచర్లు. 10 3డీ సినిమాలు, 3డీ గ్లాసెస్ ఈ ఫోన్‌తో పాటు ఉచితం. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర్ 3690 రూపాయలు. 


ఐబెర్రీ ‘ఆక్సెస్’ 
మనదేశానికి చెందిన హాంకాంగ్ బేస్ట్ ఐబెర్రీ కంపెనీ తక్కువ ధరలో టాబ్లెట్ పీసీని వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఆక్సెస్ ఎఎక్స్02 పేరుతో లభించే ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 4. 0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఏడు అంగుళాల స్క్రీన్, 00 / 400 రెజల్యూషన్, 1 జీబీ డిడిఆర్2 ర్యామ్, 1 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్, మల్టీటచ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, మినీ యుఎస్‌బి, 3జీ యుఎస్‌బి మోడమ్ దీనిలో ఉండే ఫీచర్స్. దీని ధర 10 వేల రూపాయలు ఉంటుందని అంచనా. 


ఆర్కోస్ ఆర్నోవా Archos Arnova 
ఉపయోగం : వెరీ స్లైలిష్ టాబ్లెట్. ఇంటర్‌నెట్, వీడియోలు దీని ప్రత్యేకం. అప్లికేషన్లను నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
ఫీచర్స్ : 10.1 స్క్రీన్, కోర్‌టెక్స్ ప్రాసెసర్ 
ఎక్కడ దొరుకుతుంది?: store.archos.com


ప్లేబేస్ PlayBase 
ఉపయోగం : పిల్లల ఐప్యాడ్ అన్నమాట. టాబ్లెట్ పీసీకి దగ్గరగా ఉంటుంది. గీతలు పడవు. వాటర్ ఫ్రూఫ్ కూడా. అప్లికేషన్లు యాడ్ చేసుకోవచ్చు. 
ఫీచర్స్ : 7 అంగుళాల స్క్రీన్, 1.2 జిహెచ్‌జెడ్ ప్రాసెసర్, వై-ఫై, ఎక్స్‌టెన్సిబుల్ మెమరీ
ఎక్కడ దొరుకుతుంది?: www.play-base.com


నూక్ కలర్ Nook Color 
ఉపయోగం : దీన్ని లెర్నింగ్ డివైజ్‌గా కంటే ప్లే డివైజ్‌గానే చెప్పుకోవచ్చు. నూక్ కామిక్స్, వీడియోలు దీని ప్రత్యేకం. పిల్లల కోసం చాలా పుస్తకాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. 
ఎక్కడ దొరుకుతుంది?: www.barnesandnoble.com

5 comments:

murari said...

Usefull Collection Reddy,

naa said...

thank u mr. land of my dreams...

murari said...

reddy this is srikanth from pazzur. did u recognize me

naa said...

ya srikanth, i remember you man...

murari said...

how are you doing? where are working??