Skip to main content

ఇష్టమైన గాడ్జెట్స్‌లా కేకులు















‘‘కాలం గడుస్తున్నాకొద్దీ... ఫ్యాషన్ మారుతోంది.. స్టైల్స్ మారుతున్నాయి... ఆటలు.. పాటలు.. అన్నీ మారుతున్నాయి. బర్త్‌డే కేక్ మీద ఐసింగ్ ఫ్లేవర్లు కూడా మారుతున్నాయి. కానీ కేక్ మాత్రం మారడం లేదు’’ అంటాడు అమెరికన్ రాక్‌స్టార్ జాన్ ఓట్స్. ఆయన బతికుంటే ఆ మాట మార్చుకునేవారు. ఎందుకో మీరే చదవండి.

నీరజ తన కొడుకు పుట్టినరోజు వేడుకని కాస్త సినిమాటిక్‌గా జరపాలనుకుంది. ఆమె కొడుకు గౌతమ్ సూపర్‌మ్యాన్‌ని, హ్యారీపోటర్‌ని లైక్ చేసే వయసు ఎప్పుడో దాటేశాడు. ఇప్పుడు అతని వయసుకు సూట్ అయ్యేలా ఏదైనా ప్లాన్ చేయాలనుకుంది నీరజ. గౌతమ్ వైపు తదేకంగా చూసింది. అతడు తన ఐప్యాడ్‌లో సంగీతం వింటున్నాడు. అది చూసి ఆమె మనసులో ఒక ఫ్లాష్‌లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే బేకరీకి వెళ్లి రెండు కిలోల చాక్లెట్ కేక్ ఆర్డర్ ఇచ్చింది. పుట్టినరోజు నాడు గౌతమ్ ఆ కేక్‌ని చూసి చాలా సంతోషించాడు. ఎందుకంటే అది అతనికి ఇష్టమైన ఐప్యాడ్‌ని అచ్చుతీసినట్లుగా ఉంది. ‘16 జీబీ ఐప్యాడ్ క్లాసిక్. హ్యాపీబర్త్‌డే గౌతమ్’.. అని దానిపైన రాసి ఉంది. గౌతమ్ వయసు 16 సంవత్సరాలు. తల్లి మనసులో గౌతమ్ పట్ల 16 గిగాబైట్ల స్వీట్ మెమరీస్ దాగున్నాయి. అదే సింబాలిక్ అండ్ సినిమాటిక్. 12 వందల రూపాయల కేక్ అది. డబ్బు గురించి కాదు.. గౌతమ్ మొహంలో కనిపించిన సంతోషం ఆమె ఖర్చు పెట్టిన ప్రతి పైసాకీ దక్కింది.

బర్త్‌డే కేకుల తయారీ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుంది. ఫ్లేవర్లు.. డిజైన్‌లు ఎన్ని ఉన్నా షేపులు మాత్రం చాలా తక్కువగానే ఉంటాయి. కానీ ఇప్పుడు అవి కూడా మారిపోతున్నాయి. ఇష్టమైన గాడ్జెట్స్‌లా కేకులు తయారుచేయించుకోవడం ఇప్పటి ట్రెండ్. అంటే ఐఫోన్.. ఐప్యాడ్‌లా.. ఐకేక్స్ అన్నమాట. ఇది విదేశీయులకి కొత్తేం కాదు. మనదేశంలో మాత్రం ఈ ట్రెండ్‌కి ఈ మధ్యే రిబ్బన్ కత్తిరించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తాలాంటి నగరాల్లో ఈ ట్రెండ్ ఆల్రెడీ పాపులర్ అయింది. హైదరాబాద్ కేక్ మేకర్స్ ఇప్పుడిప్పుడే అటువైపు చూస్తున్నారు. ముంబైలోని హోమ్ చెఫ్ కేక్ స్టూడియో ఫేస్‌బుక్ అకౌంట్ చూస్తే ఇలాంటి కేకులు చాలా కనిపిస్తాయి. ‘‘ఇప్పుడు మేం తయారు చేస్తున్న కేక్స్‌లో గాడ్జెట్స్‌కి మంచి పాపులరిటీ ఉంది. ఐప్యాడ్‌లు, ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు.. ఇలా ఇందులో చాలా వెరైటీలు అడుగుతున్నారు వినియోగదారులు. వారానికి రెండుమూడైనా ఇలాంటి ఆర్డర్లు వస్తున్నాయి. పోయిన నెలలో ఒకాయన ప్రింటర్‌లాంటి కేక్‌ని ఆర్డర్ ఇచ్చాడు’’ అని చెబుతున్నారు హోమ్ చెఫ్ ఓనర్స్ అదితి కామత్, నిఖితా రామ్‌పాల్.

ఇంగ్లీష్ టీవీ ఛానెల్ ద్వారా పాపులర్ అయిన కేక్ మేకర్ ఇప్సితా చక్రధర్.. కేక్ మేకింగ్‌లో 14 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఈ మధ్యే ఆ అకేషన్‌ని సెలవూబేట్ చేసుకునేందుకు ఒక డిఫంట్ థీమ్ కేక్‌ని తయారు చేసుకుంది. డ్రెస్సింగ్ చిన్న అద్దం, కుర్చీ, హెయిర్ బ్రష్, జువెలరీ బాక్స్.. ఇలా అన్నీ ఉండేలా డిజైన్ చేసుకుంది. ఆమె తల్లి ‘ఐప్యాడ్ కూడా పెట్టూ, ఎప్పుడూ పట్టుకుని తిరుగుతావ్ కదా!’ అని సలహా ఇవ్వడంతో దాన్ని కూడా యాడ్ చేసింది. దాని గురించి తెలుసుకున్న ఒకావిడ ఫోటోక్షిగఫీ అంటే ఫ్యాషన్ ఉన్న తన బోయ్‌వూఫెండ్‌కి ఎలాంటి కేక్ ఇస్తే బాగుంటుందని ఇప్సితాని అడిగిందట. అందుకు ఇప్సితా ఇచ్చిన సమాధానం.. క్యానన్ 5డి కెమెరా కేక్. కిలోన్నర కెమెరా కేక్‌ని తయారుచేయడానికి ఇప్సితాకి ఎనిమిది గంటలు పట్టిందట.

ఢిల్లీకి చెందిన పాపులర్ బేకరీ ఏంజిల్స్ ఇన్ ది కిచెన్ కూడా ఇలాంటి ఐకేక్‌లను తయారు చేస్తోంది. స్యామ్‌సంగ్ గెలాక్సీ టాబ్లెట్ పీసీని పోలిన కేక్‌ని ఒకాయన ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇచ్చింది. ఆయనకు 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా కేక్‌మీద ‘టర్నింగ్ థర్టీ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్’ అని రాశారు. ఇలాంటి కస్టమైస్డ్ థీమ్ కేక్ ఆర్డర్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని చెబుతున్నారు ఏంజిల్స్ బేకరీ డైరెక్టర్ బిజాయ్ మజీ. యాంగ్రీ బర్డ్స్‌లాంటి వీడియో గేమ్‌లు.. ఐఫోన్ అప్లికేషన్లు కూడా ఫేవట్ కేక్ థీమ్స్ అయ్యాయి. బిబిఎమ్ ఎమోటికన్స్‌ని యంగ్ జనరేషన్ ఎక్కువగా ఇష్టపడుతోంది. ఒక అమ్మాయి తన పద్దెనిమిదో పుట్టిన రోజుకి 1 కప్ కేక్స్‌ని తయారు చేయించుకుంది. ప్రతి కప్‌లో ఒక్కో ఎమోటికన్ ఉండేలా ప్లాన్ చేసుకుంది. హౌ.. ఇన్నోవేటివ్ కదా!

థీమ్ కేకుల్ని తయారు చేయాలంటే అనుభవం ఉన్న కేక్ మేకర్స్‌తోనే అవుతుంది. కస్టమర్లు అడిగిన దాన్ని అర్థం చేసుకుని వారికి నచ్చేలా డిజైన్ చేయాలంటే కష్టమైన పనే. ఆర్ట్‌వర్క్ తెలిసుండాలి. కలర్ కాంబినేషన్ ఐడియా ఉండాలి. టెక్-నిక్ ఉపయోగించాలి. శిల్పం చెక్కినట్లు అందంగా కేక్‌ని అచ్చుపోయాలి. షుగర్ క్రాఫ్టింగ్, మార్జిపాన్, గమ్ పేస్ట్, రాయల్ ఐసింగ్.. ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కొన్ని బేకరీలు ఎడిబిల్ (తినదగిన) ప్రింటెండ్ బొమ్మల్ని కూడా కేకుల మీద వేస్తున్నాయి. కాకపోతే ఈ ఫుడ్ కలర్స్‌కి కాస్త ఖర్చు ఎక్కువే. మూడు గ్రాముల ఎడిబుల్ గోల్డ్ డస్ట్‌కి 900 నుంచి 12 వందల రూపాయల ధర ఉంటుంది. మొత్తానికి ఒక కిలో థీమ్ కేక్ ధర 12 వందల రూపాయల నుంచి మొదలవుతుంది.

రకరకాల సౌండ్లు.. ఆకర్షణీయమైన లైట్లతో.. 4డీ కేకులను కూడా తయారు చేస్తున్నారు. పొగలు కక్కే... ఆవిర్లు చిమ్మే కేక్‌లు కూడా వస్తాయంటున్నారు కేక్‌మేకర్స్.

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...