ఫిబ్రవరి 7న కర్నాటక శాసనసభలో ఏం జరిగింది? సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ ముగ్గురు మంత్రులు.. ! ఒక ‘నగ్న’ సత్యానికి ఇదొక మచ్చుతునక మాత్రమే...సెల్‌ఫోన్ మెమరీ కార్డుల్లో... ఇంటర్‌నెట్ యుఆర్‌ఎల్‌లల్లో... అశ్లీలం ఆనవాళ్లు అనంతం అన్నది ఆఫ్ ది రికార్డ్. గూగుల్ ట్రెండ్స్ చెబుతున్న పచ్చినిజాలివి. గమనిక : మీకు పద్దెనిమిదేళ్లు నిండితేనే ఇది చదవండి.ఇంటర్‌నెట్ పుట్టి ఇరవై ముప్పై ఏళ్లవుతోంది. ఆన్‌లైన్‌లో అశ్లీలం ఆనాటి నుంచీ ఉంది. ఇంటర్‌నెట్‌లో ‘అందుకోసం’ వెతికేవారి సంఖ్య ఈ రెండేళ్లలోనే రెట్టింపయింది. సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ చెబుతున్న లెక్క ఇది. మనదేశంలో ‘పోర్న్’ కోసం ఈ రెండేళ్లలో అంతలా వెతికారని గూగుల్ ట్రెండ్స్ రిపోర్ట్‌లో ఉంది.
‘‘నేను బిగ్‌బాస్‌లో కనిపించిన పుణ్యాన లైంగికత గురించి బహిరంగంగా మాట్లాడే ధైర్యాన్ని చాలామంది భారతీయులు పుణికి పుచ్చుకున్నారు.’’
- సన్నీ లియోన్
కరేన్ మల్హోత్రా అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, సన్నీ లియోన్ అంటే గుర్తుప చాలామందే ఉన్నారు. భారతదేశాన్ని కొంతమేరకు నీలిమయం చేసిన ఘనత ఆమెదే. ఇంటర్‌నెట్‌లో ఆమెకోసం పడిచస్తున్న వారిలో 60 శాతం మంది మన దేశం వారే. ట్విట్టర్‌లో ఆమెకు లక్షన్నర మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతర్జాతీయ ‘బ్లూ’ స్టార్‌గా పేరొందిన ఆమె భారతీయ సంతతి నుంచి రావడం, భారతీయ టెలివిజన్‌లో కనిపించడం ఈ మార్పులకు సంకేతం. 30 ఏళ్ల సన్నీ లియోన్ కెనడియన్ భారతీయురాలు. బిగ్ బాస్ 5 టీవీ షో, జిస్మ్ 2 సినిమాలతో ఆమె ఈ మధ్య వార్తల్లోకెక్కింది. అమెరికాలో వినోద పరిక్షిశమ వేల కోట్ల మేర సాగుతోంది. ఈ పరిక్షిశమకు చెందిన లియోన్ దాపరికం లేకుండా ఫోటోలు దిగింది. అవన్నీ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో ఉచితంగా లభిస్తున్నాయి. టొరెంట్ లింకులతో వీడియోలు క్షణాల్లో డౌన్‌లోడ్ అవుతున్నాయి.
పిచ్చి పీక్స్‌కి వెళ్లిపోయింది...
వరల్డ్ వైడ్ వెబ్‌లో అశ్లీలం పిచ్చి పీక్స్‌కి వెళ్లిపోయింది. ఎంఐఎల్‌ఎఫ్ పేరుతో వెలుస్తున్న వెబ్‌సైట్లను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎంఐఎల్‌ఎఫ్ అంటే ఏంటో తెలిస్తే గుండెలు బాదుకోవాల్సిందే. దానికి సంబంధించి 4 కోట్ల 6 లక్షల వెబ్‌సైట్లు ఉన్నాయంటే ఎలాంటి పిచ్చి పట్టిందో తెలుసుకోవచ్చు. ఆసక్తికరమైన మాటలతో.. అందమైన బొమ్మలతో.. ఆకర్షణీయమైన వీడియోలతో వెబ్‌సైట్‌లు ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. వెబ్ ప్రపంచంలో కొత్త ధోరణులు సృష్టిస్తున్నాయి. చికాన్ పోర్న్, బుక్కాకే, షీమేల్, పుటమారీ, యానిమ్, మాంగా, కార్పోరేట్, కాంటెంపరరీ పేరుతో విదేశీ విశృంఖల అశ్లీల్లాన్ని దిగుమతి చేస్తున్నాయి.
టీనేజ్‌కి ఎర
ఈ ఆన్‌లైన్ అశ్లీలం యువతకు ఎర వేస్తుండంతో నైతిక విలువలు దెబ్బతింటున్నాయి. టీనేజ్ వారిని తమకు పరిచయంలేని ఓ కొత్త లోకంలోకి లాక్కుపోతున్నాయి. మన విలువల్ని దెబ్బతీసే సంస్కృతిని అవి ప్రవేశపెడుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద నీలి చిత్రాల కోసం ఎగబడుతున్న టాప్ టెన్ నగరాలలో భారతీయ నగరాలు ఏడు ఉన్నాయి. విద్యార్థుల్లో అబ్బాయిలు 47 శాతం మంది.. అమ్మాయిలు 29 శాతం మంది ఇంటర్‌నెట్‌లో పోర్న్ వెబ్‌సైట్లు చూసి తోటివారితో చర్చిస్తున్నారట. ఢిల్లీకి చెందిన మ్యాక్స్ హెల్త్‌కేర్ ఆస్పత్రి వెయ్యిమందితో జరిపిన సర్వేలో తేలింది. అక్కడి ప్రధాన మనస్తత్వ వైద్యులు డాక్టర్ సమీర్ పారిఖ్ ఈ పరిణామాన్ని ‘ప్రమాదకర వ్యసనం’గా చెబుతున్నారు. ‘లైంగిక అంశాల మీద అవగాహన పొందడం తప్పేం కాదు. కానీ ఇంటర్‌నెట్‌లో లభించే వీడియోలు కల్పితం. అవాస్తవం. వాటితో పెద్ద ప్రమాదమే ఉంది. అలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచడం చాలా అవసరం’ అంటున్నారు ఆయన.
నో స్మార్ట్
స్మార్ట్ ఫోన్‌ల రాకతో మనదేశంలో అశ్లీల ప్రపంచం మరింత విస్తరించింది. బ్లూటూత్ ఆన్ చేస్తే ఒక ఫోన్‌లోంచి ఇంకో ఫోన్‌లోకి ఎంఎంఎస్‌లు, వీడియోలు బదిలీ అవుతున్నాయి. 4 జీబీ.. 16 జీబీ మెమరీ కార్డుల నిండా బ్లూ బైట్స్ పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇలాంటి పరిణామాలకు కారణం. సాంకేతిక పరిజ్ఞానం అవసరానికే కానీ.. అనర్థాలకు దారితీయకూడదు. అలా జరిగితే ఆ తప్పు పిల్లలది మాత్రమే కాదు. అందుకే వారు వాడుతున్న టెక్నికల్ డివైజ్‌ల పట్ల పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సైన్స్ ఇంటర్‌నెట్‌లో కూడా దొరుకుతుంది. సంస్కారం మాత్రం పెద్దలే నేర్పాలి.
పోర్న్ ఫ్యాక్ట్స్
- గూగుల్ సెర్చ్‌లో 2010-12 మధ్యలో ‘పోర్న్’ అనే పదాన్ని వెతకడం అంతకుముందు కంటే డబుల్ అయింది.
- ఆన్‌లైన్‌లో అశ్లీలం కోసం అన్వేషించే టాప్ టెన్ మహానగరాల్లో ఏడు మనదేశానికి చెందినవే అన్నది నిజం.
- మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు, 3జీ సదుపాయం కలిగిన ఫోన్‌లో ఎడల్ట్ కంటెంట్‌ని చూస్తున్నారని ఐఎమ్‌ఆర్‌బి సర్వే-2011 చెబుతోంది.
- విద్యార్థుల్లో 47 శాతం మంది ప్రతిరోజూ పోర్న్ గురించి చర్చించుకుంటున్నట్లు ఢిల్లీ మ్యాక్స్ హాస్పిటల్ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది.
చైల్డ్ కంట్రోల్
ఇంటర్‌నెట్‌లో పిల్లలకు ‘అలాంటి’ కంటెంట్ దొరకకుండా కంట్రోల్ చేసేందుకు కొన్ని చైల్డ్ కంట్రోల్ ఫెసిలిటీలున్నాయి.
-మీ పిల్లలు చూసిన వెబ్‌సైట్ల వివరాలు, ఈమెయిళ్ల నుంచి డౌన్‌లోడ్ల దాకా సమాచారం మొత్తాన్నీ పట్టుకునేలా స్పై వేర్, సర్ఫ్ కంట్రోల్ లాంటి సాధానాల్ని వాడుకోవాలి.
- కంప్యూటర్లను స్వయంగా పర్యవేక్షించడం ద్వారా మీ పిల్లలు ఎలాంటి కంటెంట్‌ని చూస్తున్నారో తెలుసుకోవాలి.
- ట్రాఫిక్‌ను వడపోయడానికి ఫైర్‌వాల్‌ను ఏర్పాటు చేయాలి. వెబ్‌ఫిల్టర్లని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఇంటర్‌నెట్ సేవలందించే భీమ్ ఫైబర్‌లాంటి కొన్ని సంస్థలు ఇలాంటి సదుపాయాన్ని అందిస్తున్నాయి.
24 భారతదేశంలోని 500 అగ్రశ్రేణి వెబ్‌సైట్లలో అశ్లీలానికి అంకితమైన వెబ్‌సైట్ల సంఖ్య ఇది.
0% సన్నీ లియోన్ చిత్రాల వీక్షకులు భారతదేశానికి చెందినవారే!
50%నెట్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు వెబ్‌ను చూడగలగుతున్నారు.
60,000కోట్ల రూపాయలు.. అమెరికాలో అశ్లీల చిత్ర పరిశ్రమ తాలూకు పరిమాణం అంచనా
Comments