అర్బన్ సైక్లింగ్

By | March 05, 2012 Leave a Comment


మోడల్ : ట్రెక్ ఎలైట్ 9.9 ఎస్‌ఎస్‌ఎల్
బ్రాండ్ : ఫైర్‌ఫాక్స్
బరువు : 10 కేజీలు
స్పెషాలిటీ : సింగిల్ ఫ్రేమ్, 20 స్పీడ్ గేర్స్, హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్
మేడ్ విత్ : కార్బన్ ఫైబర్
ధర : 4.25 లక్షలు 

శివ సినిమా గుర్తుందా?
మీరు సైకిల్ తొక్కి ఎన్ని రోజులయింది?
కారు, బంగళా ఉన్నవారెవరైనా సైకిల్ తొక్కడం మీరు చూశారా?
వాకింగ్‌కు వెళ్లాలని ఉన్నా వెళ్లలేకపోతున్నారా?
సరే.. ఇవన్నీ వదిలేయండి..
ఈ కింది కథనం చదవండి.


శివ సినిమా టైమ్‌లో సైకిల్ అంటే కుర్రాళ్లకి క్రేజ్ ఉండేదేమో. కానీ ఈ జనరేషన్‌కి మాత్రం.. వందల సీసీల బైక్ అంటేనే మోజు. సైకిల్ అంటే వారికి పూర్ మేన్ వెహికిల్. నిజమేనా?! సైకిల్ కేవలం పేదవాళ్ల సవారీ మాత్రమేనా? కానే కాదు. ఇండియాలో అత్యంత ఖరీదైన సైకిల్ ధర ఎంతో తెలుసుకుంటే ఈ మాటకు మరింత బలం వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ సైకిల్ ధర రెండు కార్ల వెల కంటే ఎక్కువే. అబ్బ ఛా! నిజామా? అని బ్రేక్ వేయకండి. కచ్చితంగా ఇది నిజం. ఇంతలా కన్ఫర్మేషన్ ఇచ్చామంటే ఇన్ఫర్మేషన్ ఉందనేగా. అలాంటప్పుడు సైకిల్ ఇంకా రూరల్ పీపుల్‌దే అంటే ఎలా? అర్బన్‌లో సైక్లింగ్ ఇప్పుడొక ఫ్యాషన్.

ఒక ట్రెండ్.‘ఫైర్’ బ్రాండ్
పోయిన సంవత్సరం ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఫైర్‌ఫాక్స్ అనే సైకిళ్ల తయారీ కంపెనీ ఒక ఖరీదైన సైకిల్‌ని విడుదల చేసింది. ట్రెక్ ఈక్వినాక్స్ అనే ఆ సైకిల్ ధర అక్షరాల 2.45 లక్షల రూపాయలు. అప్పట్లో ఇది ఇండియాలో అత్యంత ఖరీదైన సైకిల్. అదే కంపెనీ ఈ సంవత్సరం జరిగిన ఎక్స్‌పోలో ట్రెక్ ఎలైట్ 9.9 ఎస్‌ఎస్‌ఎల్ అనే బైస్కిల్‌ని డిస్‌ప్లేలో పెట్టింది. ఇప్పుడిదే ఇండియాలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ బైస్కిల్. దీని ధర ఎంతో తెలుసా? 4.25 లక్షల రూపాయలు. అంటే రెండు నానో కార్ల కంటే ఎక్కువన్నమా అంత డబ్బు పెట్టినా ఇది అషామాషీగా దొరకదు మరి. ‘ఆర్డర్లపై సప్లయి చేయబడును’ టైప్ అన్నమాట.

‘హీరో’ సైకిల్
mancycle talangana patrika telangana culture telangana politics telangana cinemaహీరో సైకిల్ గురించి మీకు చెప్పడమంటే పిల్లలకు చాక్లెట్ గురించి... అమ్మాయిలకు హెయిర్ బ్యాండ్ గురించి చెప్పడం లాంటిదే. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా హీరో సైకిల్ కనిపిస్తోంది. తక్కువ ధరలో హీరో సైకిళ్లు అందుబాటులో ఉండడమే దీనికి కారణం. కానీ ‘హీరో’ కూడా ఇప్పుడు ప్రీమియం సైకిళ్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరిలో రెడ్‌డాట్ పేరుతో హీరో సైకిల్‌ని విడుదల చేసింది. దీని ధర 43 వేల రూపాయలు. కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన దీని బరువు 12.9 కేజీలు. ఎఫ్1 రేస్ కార్లను, విమానాలను ఈ ఫైబర్‌తోనే తయారు చేస్తారు. ఇది తుప్పు పట్టదు. పటిష్టంగా ఉంటుంది. అయినప్పటికీ తేలికగానే ఉంటుంది.

వై దిస్ లగ్జరీ?
అర్బన్ ట్రయల్ పేరుతో కంపెనీలు లగ్జరీ సైకిళ్లను రూపొందిస్తున్నాయంటే కారణం ఏంటి? నగరాల్లో కూడా సైకిళ్లు ఎక్కువగానే కొంటున్నారనేగా?! కొంటున్నారు సరే. ఎందుకనేదాని మీదే ఇక్కడ ఆసక్తి ఎక్కువ. అర్బన్‌లో సైక్లింగ్ పెరగడానికి కారణాలు.. ఒకటి హెల్త్ కాన్సియస్. రెండు పర్యావరణ పరిరక్షణ.. ఎనర్జీ సేవింగ్.. ఇంకా చాలా ఉన్నాయి.

లాభాలు
- ప్రతి రోజూ గంటకు 12 నుంచి 13 మీటర్ల దూరం సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో 544 కేలరీలు కరుగుతాయి. స్పీడ్ 16 మీటర్లకు పెంచితే ఈ శక్తి 00లకు చేరుతుంది.
- సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. రక్తవూపసరణ పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనివల్ల హృదయ సంబంధ వ్యాధులను 50 నుంచి 60 శాతం వరకు దూరం కావొచ్చు.
- కొంచెం పనిచేసినా అలిసిపోయే వారికి సైక్లింగ్ మంచి వ్యాయామం. రోజూ సైక్లింగ్ చేయడం వల్ల సహనశక్తి, శరీర దృఢత్వం పెరుగుతుంది.
- సైక్లింగ్ వల్ల మీ కండరాలు బలపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 
నేను ఒకటిన్నర సంవత్సరాలుగా సైక్లింగ్ అలవాటు చేసుకున్నాను. బైస్కిల్ తొక్కడం మంచి ఫిజికల్ ఎక్సర్‌సైజ్. రోజూ గంటసేపు సైకిల్ తొక్కితే 600 కేలరీల శక్తి బర్న్ అవుతుంది. అదే వాకింగ్ వల్ల 400 నుంచి 450 మాత్రం అవుతుంది. అంటే వాకింగ్ కంటే సైక్లింగ్ వల్లే ఎక్కువ లాభం అన్నమాట. సైకిల్ తొక్కడం వల్ల జాయింట్ల ప్రాబ్లమ్ వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ఆరోగ్యం బాగుండాలంటే శరీరానికి పౌష్టిక ఆహారం అవసరం. ఆరోగ్యానికి ఇది 50 శాతం ఉపయోగపడుతుంది. మైండ్ మీద ప్రభావం 25 శాతం ఉంటుంది. అంటే ఒత్తిడి, నెగెటివ్ థింకింగ్, మానసిక సంక్షోభం.. వీటి ప్రభావమన్నమాట. మిగిలిన 25 శాతం బాడీ మూవ్‌మెంట్స్‌ని బట్టే ఉంటుంది. ఇది సైక్లింగ్ ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను. నేను మాత్రమే కాదు. చాలా సర్వేల్లో కూడా ఇదే నిజమని తేలింది. అందుకే అర్బన్‌లో సైక్లింగ్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది.
- మహర్షి, హెల్త్ ఎక్స్‌పర్ట్

0 comments: