గ్రాఫిక్ నావెల్స్

By | March 12, 2012 Leave a Comment

వందల సంవత్సరాల క్రితం...
హైదరాబాద్‌లోని పంజాగుట్ట అడవి ప్రాంతం..
అనగనగా ఒకరోజు.. సర్‌పెర్సీ అనే వేటగాడు వేటకు వెళ్తాడు. దగ్గరలోని నదిలో ఏదో కొట్టుకు వస్తున్నట్లు పెర్సీ గమనిస్తాడు. అది తీరానికి సమీపించాక తెలుస్తుంది.. అదో పెద్ద రాక్షసబల్లి అని. దాని నుంచి తప్పించుకునేందుకు పరుగు మొదపూడతాడు పెర్సీ. ఆ డైనోసార్ వెంట పడుతుంది. పరుగు తీస్తున్న పెర్సీకి ఒక ఆటో ఎదురౌతుంది.


‘త్వరగా పోనీయ్.. నన్ను ఇరవై ఒకటో శతాబ్దానికి తీసుకెళ్లూ..’ అంటూ పరుగున ఆటో ఎక్కాడు పెర్సీ.

‘ఎంతిస్తావ్.. మీటర్ మీద ఎక్స్‌ట్రా ఇస్తావా?’ అని బేరం మొదపూట్టాడు ఆ ఆటోవాలా.
పెర్సీకి ఆటోవాడి మీద కోపం కంటే డైనోసార్ మీద భయమే ఎక్కువ. అందుకే ఆటోవాడ్ని ‘జల్దీ.. జల్దీ..’ అని బలిమిలాడాడు. ఆటో కదిలింది.. ఇరవై ఒకటో శతాబ్దానికి. అదొక ‘టైమ్ మిషిన్’ ఆటో. దాని చక్రాల కదలికలో కాలగమం.. హైదరాబాద్ పరిణామ క్రమం.. కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇది విఠాలాచార్య సినిమాకాదు. స్పిల్‌బర్గ్ జూరాసిక్ పార్క్‌కు హైదరాబాద్ వెర్షన్ అంతకన్నా కాదు. హైదరాబాద్ చారిత్రక నేపథ్యంగా వస్తున్న తొలి గ్రాఫిక్ నవలలోని మొదటి ఎపిసోడ్. ‘యుగంతర్’ సంస్థ ‘ఆర్కైవ్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్’లో భాగంగా ‘హైదరాబాద్ గ్రాఫిక్ నవల’ని రూపొందిస్తోంది. దీనికోసం జయదీప్, జస్‌రామన్ అనే ఇద్దరు కుర్రాళ్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ నవలకు సంబంధించిన కొన్ని ఎపీసోడ్లు వారు పూర్తి చేశారు కూడా.

త్రీ యాపిల్స్ ఈ ప్రపంచ గమనాన్నే మార్చివేశాయి.
ఒకటి ఈవ్ తిన్న యాపిల్.
రెండు న్యూటన్ తలపై పడ్డ యాపిల్.
మూడు.. స్టీవ్ జాబ్స్ క్రియేట్ చేసిన యాపిల్.

5580 talangana patrika telangana culture telangana politics telangana cinema


అప్పుడూ ఇప్పుడూ ఎ ఫర్ యాపిలే. కాకపోతే ఈ జనరేషన్‌కి యాపిల్ కంటే యాపిల్ కంపెనీ గురించే ఎక్కువ తెలుసు. అందుకే స్టీవ్ జాబ్స్ జీవితం ఒక చదువుకోవాల్సిన పాఠం. అది గ్రహించే స్టీవ్ జీవితాన్ని గ్రాఫిక్స్‌లోకి మారుస్తున్నారు. ‘ద జెన్ ఆఫ్ స్టీవ్ జాబ్స్’ పేరుతో 0 పేజీల పుస్తకం ఫోర్బ్స్ రూపొందిస్తోంది. స్టీవ్ జీవితానికి అద్దం పట్టే సంఘటనలు, అతని ఆధ్యాత్మిక గురువు కొబున్ చీనోతో అనుబంధాన్ని ఇందులో క్రియేటివ్ ఆర్ట్స్‌తో వివరిస్తున్నారు. కొబున్ ఒక బుద్ధిస్ట్. 1970లో జపాన్ నుంచి అమెరికాకు వచ్చాడు. అప్పటి నుంచి స్టీవ్ జాబ్స్‌తో అనుబంధం ఏర్పడింది. 2011 వరకు వారి మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ పుస్తకాన్ని అచ్చువేస్తున్నారు. ఇందులో నిజాలు, కల్పితాలు ఉంటాయి. దీనిలోని బొమ్మల్ని జెస్స్3 అనే క్రియేటివ్ ఏజెన్సీ డిజైన్ చేస్తోంది.

1950లోబెంగాల్‌కు చెందిన ఒక యువకుడు పరిశోధన మొదపూడతాడు. పాతతరం పహిల్మాన్ల ఆహారనియమాలు, శరీర ధృడత్వం మీద పీహెచ్‌డీ చేయాలనుకుంటాడు. అలాంటి సమయంలో అతనికి గమా పహిల్మాన్ గురించి తెలుస్తుంది. 12లో అమృత్‌సర్‌లో పుట్టిన గమా పహిల్మాన్ అసలు పేరు గులామ్ మహ్మద్ బక్స్. ప్రపంచం గర్వించదగ్గ రెజ్లర్‌గా ఎదుగుతాడు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తనతో రెజ్లింగ్ చేసి గెలవొచ్చని ప్రపంచానికి ఛాలెంజ్ విసిరిన మొనగాడు. కానీ జీవితం చివరి దశలో కేవలం 300 రూపాయల పెన్షన్‌తో బతుకుతాడు. తినడానికి తిండి లేక హీనమైన స్థితిలో మంచాన పడితే ప్రముఖ పారిక్షిశామికవేత్త 1200 రూపాయల చెక్ పంపుతాడు. అది చూసి గమా కన్నీళ్లు పెట్టుకుంటాడు. గమా 1960లో మరణించాడు. ఆయన జీవితం ఆధారంగా ప్రముఖ గ్రాఫిక్ నావెలిస్ట్ సర్‌నాథ్ బెనర్జీ ఇప్పుడొక గ్రాఫిక్ నావెల్ రాస్తున్నాడు. గమనమః (ద స్టోరీ ఆఫ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్) అనే పేరుతో రూపొందుతోంది ఈ పుస్తకం. సర్‌నాథ్ గతంలో హరప్పా ఫైల్స్, బార్న్ ఓల్స్ వండ్రస్ కేపర్స్, కారిడార్ లాంటి గ్రాఫిక్ నవలలు రాశాడు. కారిడార్ భారతదేశపు తొలి గ్రాఫిక్ నావెల్‌గా పేర్కొంటారు.

ఇవి ప్రస్తుతానికి ట్రెండ్ సృష్టిస్తున్న గ్రాఫిక్ నవలలు. ప్రపంచవ్యాప్తంగా గ్రాఫిక్ నవలలకు ఆదరణ పెరుగుతోంది. గడిచిన పద్దెనిమిది నెలల్లోనే ఊహించని రీతిలో పెరిగిందంటున్నారు నిపుణులు. అందుకే యుకెకి చెందిన హర్పర్ కోలిన్స్, మ్యాక్‌మిలాన్‌లాంటి పెద్ద పెద్ద పబ్లిషర్లు కూడా వీటిపై దృష్టి పెట్టారు. బుక్ స్టోర్స్ కూడా వీటికోసం ప్రత్యేక వార్డ్‌రోబ్‌లను ఓపెన్ చేస్తున్నాయి. టెక్ట్స్‌ని చదవడం బోర్ కొట్టేవారికి, విజువల్స్ హెల్ప్ చేస్తాయి. చదివేందుకు ఆసక్తి కలిగిస్తాయి. అందుకే వీటికి మార్కెట్ పెరుగుతోంది అని విశ్లేషిస్తున్నారు విమర్శకులు. హాలీవుడ్‌లో కామిక్స్ నుంచి సినిమాలు, సినిమాల నుంచి కామిక్స్ ఎన్నో రూపొందాయి. ఎంజిలీనా జోలీ నటించిన వాంటెడ్ సినిమా కూడా తాజాగా గ్రాఫిక్ నవల రూపంలో వచ్చింది.

‘నేను రాసినదాన్ని గతంలో ఎవరైనా రాశారేమో’ అన్నాడొక రచయిత. నిజమే రాసి ఉండొచ్చు. కానీ రాసిన దాన్ని కూడా కొత్తగా రాసేందుకు.. గీసేందుకు గ్రాఫిక్ నవలలు ఉపయోగపడతాయి. అందుకే పాతతరం అందించిన గొప్ప సాహిత్యాన్ని ‘గ్రాఫిక్’ల రూపంలోకి మారిస్తే యంగ్ జనరేషన్‌కి రీడబుల్‌గా... చూడబుల్‌గా ఉంటుంది.

0 comments: