Skip to main content

వెబ్‌కామ్ వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!


వెబ్‌కెమెరాతో ఏం చేస్తాం? స్కైప్‌లో వీడియో చాటింగ్. అంతేనా కేవలం చాటింగ్ కోసమేనా ఇంకా దేనికీ వాడుకోలేమా? వాడుకోవచ్చు.. రకరకాలుగా. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. అదెలాగో తెలుసుకోండి. 

వెబ్‌కామ్... డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు ఎక్స్‌టర్నల్‌గా ఉంటుంది. ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు, టాబ్లెట్‌లలో ఇన్‌బిల్డ్‌గా ఉంటుంది. శివుడికి మూడో కన్ను ఉందో లేదో తెలియదు కానీ.. మన పీసీకి వెబ్‌కామ్ ఉంటే మనకు మూడో కన్ను ఉన్నట్లే.. ఎందుకంటే ఈ ప్రపంచాన్నే ఆ కంటితో చూసేయొచ్చు. విఠాలాచార్య సినిమాల్లో దూరదర్శినిలా పనిచేస్తూ.. దేశవిదేశాల్లో ఉన్న మన వారిని సింగిల్ క్లిక్‌తో మన కళ్ల ముందు ఉంచుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ వెబ్‌కామ్ ఇప్పుడు కేవలం వీడియో చాటింగ్ కోసం మాత్రమే కాదు.. చాలా అవసరాలకు ఉపయోగించొచ్చని చాలామందికి తెలియని విషయం. దీనికి అదనపు సౌకర్యాలను అనుసంధానం చేయొచ్చు. అద్భుతాలను సృష్టించొచ్చు. ఇందుకు కొన్ని అరుదైన సాఫ్ట్‌వేర్‌లు, ఆన్‌లైన్ సర్వీస్‌లను వారధిగా వాడుకుంటే చాలు. మీ ఇంటికి రక్షణ కవచంగా.. బార్‌కోడ్ రీడర్‌గా.. మీ కంప్యూటర్‌కి లాగిన్ పాస్‌వర్డ్‌గా ఇలా ఎన్నో రకాలుగా వెబ్‌కామ్‌ని ఉపయోగించుకోవచ్చు.

నిఘా యంత్రం
మీ దగ్గర వెబ్‌కామ్ ఉంటే మీ ఇంటికి, ఆఫీస్‌కి చిన్నపాటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన YawCam అనే సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. దీన్ని ఇంటర్‌నెట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇది పనిచేస్తుంది. ఒక్కసారి కెమెరాని సాఫ్ట్‌వేర్‌తో సెట్ చేశాక నిరంతరంగా ఇది పనిచేస్తూనే ఉంటుంది. కెమెరా రన్ అవుతున్నప్పుడు దీని పరిధిలోకి ఎవరైనా వస్తే మోషన్ కాప్చర్ టెక్నాలజీతో ఫోటోలు తీస్తుంది. లోకల్ ఫైల్‌గా సిస్టమ్ హార్డ్‌డ్రైవ్‌లో వాటిని సేవ్ చేస్తుంది.

ప్రత్యేక ఇన్‌బిల్డ్ వెబ్‌సర్వర్‌తో ఆ ఫోటోలను ఆన్‌లైన్‌లో కూడా చూడొచ్చు. ఇంట్లో ఏదైనా ప్రమాదాన్ని గుర్తించగానే మనల్ని అలర్ట్ చేస్తుంది. దీన్ని www.yawcam.com/downlad.php అనే లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ViaminD అనేది కూడా ఇలాంటి సేవల్ని అందించే మరొక సాఫ్ట్‌వేర్. దీన్ని పీసీలోనే కాకుండా మ్యాక్‌లో కంప్యూటర్‌లో కూడా వాడుకోవచ్చు. యూఎస్‌బీ కెమెరాలు, నెట్‌వర్క్ కెమెరాల్ని కూడా సపోర్ట్ చేస్తుంది. నిర్ణీత సమయంలో దాని పరిధిలోకి ఎవరైనా వస్తే రియల్ టైం అలర్ట్‌తో మనల్ని అప్రమత్తం చేస్తుంది. దీన్ని www.vitamindinc.com/downloads.php లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కోడ్ రీడర్
సూపర్ మార్కెట్‌లో వస్తువులని కొన్నప్పుడు వాటి బిల్‌ని కౌంట్ చేసేందుకు లేబుల్‌పై ఉండే నల్లని గీతలపై ఒక లైట్ వేయగానే ఆ బిల్ యాడ్ అయిపోవడం ఎప్పుడైనా గమనించారా? అదే బార్‌కోడ్.. మాల్స్‌లో బార్‌కోడ్‌లను రీడ్ చేసేందుకు ప్రత్యేక గాడ్జెట్స్‌ని ఉపయోగిస్తారు. కానీ మనం మన వెబ్‌కామ్‌ను కూడా అలాంటి గాడ్జెట్‌గా ఉపయోగించుకోవచ్చు. సిస్టమ్, ల్యాప్‌ట్యాప్‌లలో ఆ పని చేయడం కోసం bcWebCam అనే అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీన్ని మీ సిస్టమ్ / ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ల్యాప్‌ట్యాప్‌లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. బార్‌కోడ్, QR Code లను రీడ్ చేయడానికి ఇప్పుడొస్తున్న స్మార్ట్ ఫోన్ల కోసం ఉచిత అప్లికేషన్లు చాలానే అందుబాటులో ఉన్నాయి.

ఫేస్ పాస్‌వర్డ్
వెబ్‌కామ్‌ని ఫేస్ రికగ్నేషన్‌గా ఉపయోగించుకోవచ్చు. మీ పర్సనల్ కంప్యూటర్‌కి టెక్ట్స్ పాస్‌వర్డ్ కాకుండా మీ ఫేస్‌ని పాస్‌వర్డ్ పెట్టాలనుకుంటే ఈ వెబ్ కెమెరాతో సాధ్యమవుతుంది. ఇందుకు Luxand Blink సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దీని ద్వారా మీ ముఖాన్ని సిస్టమ్ పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకోవచ్చు. జుట్టు లేకపోయినా, కళ్లజోడు పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఈ సాఫ్ట్‌వేర్ కేవలం ముఖంలోని కొన్ని ప్రత్యేక పాయింట్‌లను మాత్రమే ఇన్‌పుట్‌గా తీసుకుంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ని www.luxand.com/blink లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటిదే బనానా స్క్రీన్ అనే మరో సాఫ్ట్‌వేర్ ఉంది. దాన్ని http://bananascreen.en. softonic.com ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జస్ట్ ఫర్ ఫన్
చాటింగ్ చేస్తున్నప్పుడు ఆకట్టుకునే బ్యాక్‌క్షిగౌండ్స్‌తో మీ ఫ్రెండ్స్‌ని ఆకట్టుకోవాలంటే VideoSkinలోకి లాగిన్ అయిపోండి. లింక్ : http://videoskin.net. ఇలాంటిదే మరోటి WebcamMax. చాలా ఎఫెక్ట్‌లను వీడియో చాటింగ్‌కి అప్లై చేయొచ్చు. దీని లింక్ : www.webcammax.com/download.html
నవ్వుపుట్టించే ఎఫెక్ట్‌లకోసం.. www.cameroid.com
www.seenly.com
గేమ్స్ ఆడాలంటే...
www.newgrounds.com
www.shiningmorning.com http://neave.com/webcom


- మొదటిసారిగా వెబ్‌క్యామ్‌ని 1991 కనుగొన్నారు.
- ఇప్పటికీ పనిచేస్తోన్న పాత వెబ్‌క్యామ్ సాన్ ఫ్రాన్‌సిస్కో స్టేట్ యూనివర్సిటీలో ఉంది. ఇది 1994 నుంచి పనిచేస్తోంది.
- 1994లో తొలిసారిగా వెబ్‌క్యామ్‌ని క్విక్‌క్యామ్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చింది. అది 320 / 240 పిక్సెల్స్‌తో సెకనుకు 60 గ్రేస్కేల్ ఇమేజ్‌లను క్యాప్చర్ చేసేది.

   

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...