
మీ దగ్గర ఐప్యాడ్ ఉందా? కనీసం ఐఫోన్? మీరు ఏ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఓకే.. ఓకే.. లివ్ ఇట్. లారీ పేజ్ తెలుసా మీకు? పోనీ.. సెర్జీ బ్రిన్? వీరిద్దరూ సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ వ్యవస్థాపకులు. వీరి ఆస్తి ఎంతో గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. చెరో 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఉంటుంది. ‘ఫోర్బ్స్’ ప్రకటించిన మల్టీ బిలియనేర్స్ లిస్ట్‌లో వీరిది 24వ స్థానం. ఇలాంటి వారు ఆ లిస్ట్‌లో 12 వందల మంది ఉన్నారు. మరి మిలియనీర్స్ అయితే లక్షల్లో ఉంటారు. వారికి డబ్బు అసలు సమస్యే కానే కాదు. మరి వారు ఏ మొబైల్ ఫోన్ వాడతారు? ల్యాప్‌టాప్.. టీవీ.. హెడ్‌ఫోన్స్.. బైనాకులర్స్.. ఏవి కొంటారు? హ్యావ్ ఏ లుక్!
స్మార్ట్‌ఫోన్ : చైర్మన్ వేవ్
ధర : 12,000 - 50,000 డాలర్లు
(రూపాయల్లో : 6,13,320 నుంచి 25,55,500)
యూలిస్ నార్డిన్ కంపెనీ తయారు చేసిన చైర్మన్ వేవ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మెగా పిక్సెల్ కెమెరా, 3జీ కేపబిలిటీస్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3.2 అంగుళాల టచ్ స్క్రీన్.. దీని ఫీచర్లు. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా? ఇది 300 భాగాల హ్యాండ్ మేడ్ ఫోన్. ఎరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం, మెరైన్‌క్షిగేడ్ స్టెయిన్‌పూస్ స్టీల్, రోడియం ప్లేట్స్, కార్బన్ ఫైబర్, - క్యారెట్ల రోజ్ గోల్డ్ కేసింగ్, 22 క్యారెట్ల గోల్డ్ రోటార్స్, సాపైర్ క్రిస్టల్‌లాంటి విలువైన లోహాలతో దీన్ని తయారు చేస్తారు. మైక్రోఫోన్, ఛార్జర్, బ్లూటూత్ కూడా హ్యాండ్ క్రాఫ్టెడే.
- లారీ పేజ్, సెర్జీ బ్రిన్ వాడుతున్నది ఈ మొబైల్స్‌నే. సంవత్సరంలో రెండు సార్లు సర్వీసింగ్, పాలిషింగ్, సాఫ్ట్‌వేర్ అప్‌క్షిగేడ్ కోసం యూలిస్ నార్డిన్ కంపెనీకి వాటిని పంపిస్తుంటారు.
ఊపర్స్ : ఐన్యూక్ బూమ్
ధర : 30,000 డాలర్లు
(రూపాయల్లో : 15,33,300 )
ఇదో పేద్ద.. ఊపర్ బాక్స్. మీ డబుల్ కాట్ బెడ్ కంటే పెద్దగా ఉంటుంది. 1 అడుగుల పొడవు.. 300 కేజీల బరువుతో ఉండే ఈ బెహ్‌రింగర్ ఐన్యూక్ 10 వేల వాట్స్ ఆడియో సౌండ్‌ని అందిస్తుంది. ఫుల్ సౌండ్ పెడితే గోడలు పగిలిపోతాయా? బిల్డింగ్ కూలిపోతుందా? అన్నట్లు ఉంటుందన్నమాట.

ధర : 2,000 డాలర్లు
(రూపాయల్లో : 1, 02,220 )
ఇదో డిజిటల్ బైనాకులర్. సోనీ కంపెనీ డేవ్5 పేరుతో దీన్ని తయారు చేసింది. హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌తో వచ్చిన తొలి డిజిటల్ బైనాకులర్ ఇదే. 100 పిక్సెల్స్ హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్ దీని సొంతం. సెకనుకు 24 నుంచి 60 ఫ్రేమ్‌ల వరకు క్యాప్చర్ చేస్తుంది. 3డీ స్టిల్ ఇమేజ్‌లతో పాటు 3డీ వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. జూమ్, ఆటోఫోకస్, స్లడీ షాట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది క్యాప్చర్ చేసిన 30722304 పిక్సెల్స్ ఇమేజ్‌లను 300 డిపిఐలో 26x20 సెం.మీ. సైజులో ప్రింట్ వేసుకోవచ్చు.

ధర : 7,500 డాలర్ల నుంచి..
(రూపాయల్లో : 3,3, 325 నుంచి ..)
ఎలియన్‌వేర్ ఎం1ఎక్స్.. ఫెంటాస్టిక్.. అసోమ్.. అండ్ ఎక్స్‌ట్రార్డినరీ ల్యాప్‌టాప్. ఇంటెల్ కోర్ ఐ72.5 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్, 32 జీబీ డిడిఆర్3 ర్యామ్, 512 ఎంబీ డ్యుయల్ సాలిడ్ స్టేట్ డ్రైవర్స్, స్లాట్ లోడింగ్ బ్లూరే డిస్క్ డ్రైవ్, సౌండ్ బ్లాస్టర్ ఎక్స్-ఫై హైడెఫినేషన్ ఆడియో సౌండ్ కార్డ్, 2జీబీ ఎన్‌వీడియా జీఫోర్స్ జీటీఎక్స్ 50ఎం గ్రాఫిక్‌కార్డులు రెండు, 1.4 అంగుళాల డబ్ల్యూఎల్‌ఈడీ స్క్రీన్ దీని సొంతం. ఈ హై కాన్ఫిగరేషన్ కూడా మీకు సరిపోకపోతే మరింత పెంచుకోవచ్చు. కాకపోతే ఇంకొన్ని వేల/లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట.

ధర : 12,900 డాలర్లు
(రూపాయల్లో : 6,59,319)
ఈ హెడ్‌ఫోన్స్‌కి హేవ్ 90 పేరుతో స్పెషల్ ట్యూబ్ యాంప్లిఫైయర్ ఉంటుంది. ఆప్టికల్ (టాస్‌లింక్), కోయాక్సిల్ (ఎస్/పిడిఐఎఫ్) రెండు డిజిటల్ ఇన్‌పుట్స్ ఉంటాయి. రెండు రకాల హెడ్‌ఫోన్ జాక్స్ కూడా ఉంటాయి. 13 కేజీల బరువుండే ఈ సెట్‌లో అల్యూమియంతో చేసిన ఆరు వ్యాక్యూమ్ ట్యూబ్‌లుంటాయి. గ్లాసు, బంగారం, స్టెయిన్‌పూస్ స్టీల్ వాడకాన్ని బట్టి దీని ధర మారుతూ ఉంటుంది. 11డిబీల మ్యాగ్జిమమ్ అవుట్‌పుట్‌ని ఈ హెడ్‌ఫోన్స్ అందిస్తాయి.

ధర : 42,000 డాలర్లు
(రూపాయల్లో : 21,46,620)
నైకాన్ కెమెరాలే బెటర్ అనుకునేవారు ఈ హస్సెల్‌బ్లాడ్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. హస్సెల్‌బ్లాడ్ హెచ్4డీ-200ఎంఎస్ ఎక్స్‌వూటీమ్‌గా ఫోటోలు తీయాలనుకునే రిచ్ కిడ్స్ కోరే కెమెరా. కచ్చితమైన కలర్ ఇన్ఫర్మేషన్, అద్భుతమైన ఇమేజ్ క్యాప్చరింగ్‌ని ఈ కెమెరా కలిగి ఉంటుంది. దీని పేటెంటెడ్ టెక్నాలజీ ఆధారంగా 50ఎంపీ సెన్సార్లు సిక్స్ షాట్స్‌ని తీసి 200 ఎంపీ పిక్చర్ రెజల్యూషన్‌తో అల్టిమేట్ ఫోటోస్ అందిస్తాయి. దాన్ని 600 ఎంబీ ఫోటోలుగా కూడా ప్రింట్ వేయించుకోవచ్చు. ఆల్ట్రా షార్ప్, 300డిపిఐ, 4.5x3.5 అడుగుల ఫోటో క్వాలిటీ ఈ కెమెరా ప్రత్యేకతలు. వీడియో రికార్డింగ్ కూడా ఇంతే అద్భుతంగా ఉంటుంది.

ధర : 1,40,000 డాలర్లు
(రూపాయల్లో : 71,55,400)
నో డౌట్.. ఇది మల్టీ బిలియనేర్స్ బిగ్ టీవీ. అల్యూమినియం ట్రిమ్మింగ్‌తో.. డైమండ్ కట్ జాయింట్స్‌తో దీన్ని తయారుచేస్తారు. దీని టెక్నాలజీ ఇతర ఏ టీవీల్లోనూ ఉండదు. 103 అంగుళాల స్క్రీన్ ఉండే ఈ టీవీ సెట్‌లో ఆటోమెటిక్ కలర్ మేనేజ్‌మెంట్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇన్‌బిల్డ్‌గా ఉండే చిన్న కెమెరా ప్రతి 100 గంటలకొకసారి కలర్‌ని చెక్‌చేసి సెట్ చేస్తుంది. మల్టీ స్పీకర్లు.. మల్టీపుల్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఎలవేటర్ ఆధారంగా రిమోట్‌తో ఆపరేట్ చేస్తూ కూర్చున్న చోటు నుంచే టీవీని మీకు అనుగుణంగా జరుపుకోవచ్చు.
Comments