Skip to main content

అద్బుతమైన వాచీలు... కొనకపోయినా ఒకసారి చూడాల్సిందే!

వరంగల్లో డిగ్రీ పరీక్షలు రాస్తున్న కుర్రాడు హైటెక్ కాపీ కొట్టి లిటరల్‌గా దొరికిపోయాడు. ఇందుకు అతడు ఉపయోగించిన టెక్నాలజీ.. ఐప్యాడ్ వాచ్. ల్యాప్‌టాప్‌లు ‘స్లిమ్’ అయ్యాయి. సెల్‌ఫోన్‌లు ‘స్మార్ట్’ అయ్యాయి. ఇప్పుడు వాచీలు కూడా. నిన్నటి వరకు వాచీలు టైము, డేటు మాత్రమే చూపించేవి. కానీ వాటితో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తో చేసే అన్ని పనులూ చేయొచ్చు. హై టెక్నాలజీకి సమాంతరంగా హైఫై ‘గుడ్’తో పాటు హై ఓల్టేజ్ ‘బ్యాడూ’ ఉంది. 

1. మోటోయాక్టివ్
దీన్ని మోటోరోలా కంపెనీ తయారుచేసింది. మ్యూజిక్‌ప్లేయర్, ఫిట్‌నెట్ ఇన్‌స్ట్రక్టర్, జీపీఎస్ నావిగేటర్, ఎఫ్‌ఎంరేడియోలాంటి చాలా రకాల ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మోటోరోలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లతో బ్లూటూత్ ఆధారంగా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ధర : సుమారు 12, 500 రూపాయలు 
2. ఐపాడ్ నానో
దీన్ని యాపిల్ కంపెనీ రూపొందించింది. ఐపాడ్ అంటే మ్యూజిక్ ప్లేయర్. సంగీతం వినడానికి అనువుగా ఈ నానో ఐపాడ్ వాచీ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే డివైజ్ ఇది. టచ్ స్క్రీన్‌గా పనిచేసే ఈ వాచీలో రకరకాల డిజిటల్ ఫార్మాట్లు.. అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటాయి. ఒక సింపుల్ రాకింగ్ మ్యూజిక్ ప్లేయర్ అన్నమాట.
ధర : సుమారు 6,500 రూపాయలు
3. సోనీ స్మార్ట్‌వాచ్
మల్టీమీడియా ప్లేయర్లలో సోనీ కంపెనీది అందెవేసిన చెయ్యి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ సోనీ స్మార్ట్‌వాచ్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసి ఎక్స్‌టెన్షన్‌గా వాడుకోవచ్చు. టచ్‌స్క్రీన్‌గా పనిచేసే ఈ డివైజ్‌పై ఇంటర్‌నెట్‌ని కూడా బ్రౌజ్ చేయొచ్చు. అంటే మీ చేతి మీదే ప్రపంచం ఉంటుందన్నమాట.
ధర : సుమారు 7,500 రూపాయలు
  
4. విమ్ వన్
విమ్ (Wimm) కంపెనీ వన్ పేరుతో తయారుచేసిన ఈ స్మార్ట్ వాచీ మొబిలిటీలో ఒక కొత్త ట్రెండ్‌ని సృష్టించనుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా మైక్రో అప్లికేషన్లకు అనువైనది. యాపిల్ స్టోర్ నుంచి మైక్రోయాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. స్మార్ట్ ఫోన్‌కి ధీటుగా ఇది రూపొందడం చెప్పుకోదగ్గ విషయం.
ధర : సుమారు 10 వేల రూపాయలు 
5. ఐయామ్ వాచ్
బెస్ట్ క్వాలిటీతో రూపొందిన ఈ ఐయామ్ వాచ్‌తో యూజర్లు ఎంజాయ్ చేయడానికి చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి. 1.54 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉండే ఈ వాచీ ద్వారా క్వాలిటీ ఇమేజ్‌లను, వీడియోలను 240x240 చూడొచ్చు. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, స్యామ్‌సంగ్, ఐఓఎస్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్లతో దీన్ని అనుసంధానం చేయొచ్చు.
ధర : సుమారు 16, 500 రూపాయలు
6. మెటా వాచ్
ఇదొక గ్రేట్ స్టైల్ ప్రొడక్ట్. వెబ్ డెవలపర్లు దీనికోసం రకరకాల అప్లికేషన్లను రూపొందిస్తున్నారు. అందుకే అనువైన ఫ్లాట్‌ఫామ్ కూడా ఇందులో ఉంది. ఎంఎస్‌పి ఆల్ట్రాలో పవర్ మైక్రో కంట్రోలర్‌తో పనిచేసే ఈ వాచీలో సిసి2560 బ్లూటూత్ ఫెసిలిటీ ఉంది. సో.. దీంతో ఏ బ్లూటూత్ డివైజ్‌నైనా కనెక్ట్ అవ్వొచ్చన్నమాట. మిగిలిన స్మార్ట్ వాచీలతో పోలిస్తే దీని బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది.
ధర : సుమారు 10 వేల రూపాయలు 
7. ఎస్‌వ్యాప్ యాక్టివ్
స్మార్ట్ ఫోన్‌కి గట్టి పోటీదారు ఇది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్‌తో చేసే దాదాపు అన్ని పనులూ ఈ వాచీతో చేయొచ్చు. అంటే అన్ని రకాల ఫీచర్లు ఇందులో ఉన్నాయన్నమాట. టెలీఫోన్, వీడియోప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్, ఈబుక్ రీడర్, ఎఫ్‌ఎంరేడియో... వీటితో పాటు ఇన్‌బిల్డ్ వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో మెమరీని జీబీ వరకు పెంచుకోవచ్చు.
ధర : సుమారు 15, 500 రూపాయలు

8. ఇన్‌పల్స్ స్మార్ట్‌వాచ్
ఇన్‌పల్స్ స్మార్ట్ వాచీల తయారీలో సంచలనం సృష్టిస్తోంది. బ్లూటూత్ ద్వారా ఈ వాచీని అన్ని రకాల డివైజ్‌ల(కంప్యూటర్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ పీసీ, స్మార్ట్‌ఫోన్)తో అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఇందులో ఫోన్‌కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు ఈమెయిల్స్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు. విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, లైనెక్స్ ఓఎస్‌లతో కనెక్ట్ అవుతుంది. దీన్ని రిమోట్ కంట్రోల్‌గా కూడా వాడుకునే వీలుంది.
ధర : సుమారు 7,500 రూపాయలు






Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...