టీవీ ఏదైనా.. అందులో వచ్చే సీరియళ్లు.. సినిమాలు ఒకటే. మరి ఈ ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, ప్లాస్మా.. ఏంటి? అసలు టీవీలు ఎన్నిరకాలు? హెచ్‌డీ టీవీ అంటే? స్క్రీన్ సైజు ఎంత పెద్దగా ఉంటే బావుంటుంది? కొనేముందు ఏయే విషయాలు గుర్తుపెట్టుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ స్టోరీ.
టీవీలకు సంబంధించి ఈ మధ్య రకరకాల కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటి గురించి అందరికీ తెలియకపోవచ్చు. అలాంటి కొన్ని పదాలే ఇవి.
స్క్రీన్ సైజు : స్క్రీన్ సైజు అంటే చాలామంది పొడువు అనుకుంటారు. 32 ఇంచెస్ టీవీ అంటే ఎడమ నుంచి కుడికి గానీ, కుడి నుంచి ఎడమకు గానీ 32 అంగుళాలు ఉంటుందనుకుంటారు కానీ ఒక మూల నుంచి ఇంకో మూలకు ఉండే పొడవే స్క్రీన్ సైజు.
ఎస్‌డీటీవీ (స్టాండర్డ్ డెఫినేషన్) : ఇదో రకమైన డిజిటల్ టెలివిజన్ పిక్చర్ ప్రొడక్షన్. 480 ఇంటర్‌లేస్డ్ స్కాన్డ్ లైన్స్ గల ఇమేజ్‌ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే 480i అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఐ అంటే ఇంటర్‌లేస్డ్.. వీడియో ఫ్రేమ్‌రేట్‌కి సంబంధించిన విషయం.
ఈడీటీవీ (ఎన్‌హాన్స్‌డ్ డెఫినేషన్) : ఇది స్టాండర్డ్ డెఫినేషన్ లాంటిదే. కాకపోతే అందులో ఇంటర్‌లేస్డ్ బదులు ఇక్కడ ప్రోగ్రెసివ్ స్కాన్డ్ లైన్స్ ఉంటాయి. దీన్నే 480P గా పిలుస్తారు.
హెచ్‌డీటీవీ ( హై డెఫినేషన్) : ఇదీ కూడా ఒకరకమైన డిజిటల్ టెలివిజన మోడ్. 720 లేదా 1080 ప్రోగ్రెసివ్ స్కాన్డ్ లైన్స్‌గానీ.. 1080 ఇంటర్‌లేస్డ్ స్కాన్డ్ లైన్స్‌గానీ ఉంటాయి. వీటిని 720P, 1080i లేదా 1080pగా సూచిస్తారు.
16:9 (వైడ్ స్క్రీన్) : సినిమా థియేటర్ స్క్రీన్ ఉండాల్సిన నిష్పత్తి అన్నమాట. దీన్నే పెద్ద టీవీ స్క్రీన్‌లకు వాడతారు. ప్లాస్మా, డీఎల్‌పీ టీవీల్లో స్క్రీన్ వెడల్పు ఈ నిష్పత్తి ప్రకారమే ఉంటుంది. దీన్నే వైడ్ స్క్రీన్ అని, లెటర్ బాక్స్ అని అంటారు.
ఈడీ రెడీ / హెచ్‌డీ రెడీ : ప్లాస్మా టీవీకి సంబంధించి ఎక్కువగా వాడతారు. ఎన్‌హాన్స్‌డ్ డెఫినేషనా? లేక హై డెఫినేషనా? అని తెలియజెప్పేందుకు దీన్ని వాడతారు.
బిల్ట్-ఇన్ ట్యూనర్ : ఛానల్స్‌ని రిసీవ్ చేసుకునేందుకు ఎక్స్‌టర్నల్‌గా రిసీవర్‌ని వాడకుండా బిల్ట్-ఇన్ ట్యూనర్‌ని వాడతారు. హెచ్‌డీ ప్రోగ్రామింగ్‌కి సంబంధించిన ఎయిర్ స్టేషన్లని ఇది రిసీవ్ చేసుకుంటుంది.
కంపోనెంట్ వీడియో ఇన్‌పుట్స్ : డీవీడీ ప్లేయర్ నుంచి గానీ, హెచ్‌డీ ప్రోగ్రామింగ్ నుంచి గానీ సిగ్నల్స్‌ని అందుకోవడానికి ఉపయోగపడే కేబుల్ ఇన్‌పుట్స్. రెడ్, బ్లూ, గ్రీన్ రంగులో ఉంటాయి ఈ కేబుల్స్.
కంపోజిట్ వీడియో ఇన్‌పుట్స్ : పసుపు రంగులో ఉండే ఆర్‌సీ జాక్ ఇది. వీడియో సిగ్నల్స్‌ని మాత్రమే ఇది ఒక సోర్స్ నుంచి ఇంకో సోర్స్‌కి తీసుకెళ్తుంది. ఆడియో కోసం సపరేట్ కనెక్షన్‌ను తీసుకోవాల్సిందే.
ఎస్-వీడియో : కంపోజిట్ వీడియో ఇన్‌పుట్‌లాంటిదే. కాకపోతే దానికంటే బెటర్‌గా ఉంటుంది. ఆడియో వినాలంటే సపరేట్ కనెక్షన్ ఉండాలి.
స్టీరియో ఆడియో : ఇన్‌పుట్ అవుట్‌పుట్‌లు ఆర్‌సీఏ జాక్‌తో ఎరుపు, తెలుపు రంగులో ఉంటాయి. ఇవి కంపోజిట్, డీవీఐ, ఎస్-వీడియో ఇన్‌పుట్స్‌కి సపోర్ట్‌గా ఉపయోగపడతాయి.
డీవీఐ : మీ టీవీకీ మరో డివైజ్‌ని కనెక్ట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చాలా మంది కంప్యూటర్‌ని మానిటర్‌గా వాడేందుకు దీన్నేవాడతారు. డీవీఐ వీడియోకి సంబంధించిన కేబుల్ మాత్రమే ఆడియో కోసం స్టీరియో ఆడియోని వాడాలి.
హెచ్‌డీఎంఐ : అన్ని రకాల డిజిటల్ కనెక్షన్ల కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇది వీడియోతో పాటు ఆడియోని కూడా అందించేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఒక కేబుల్ వైరు ఉంటే సరిపోతుందన్నమాట.
టీవీలు-రకాలు

వీటినే డైరెక్ట్ వ్యూ టీవీలని కూడా అంటారు. మనం చిన్నప్పటి నుంచీ చూస్తున్న టీవీలు ఇవే. టీవీలో పిక్చర్ ట్యూబ్ ఉంటుందంటారు కదా అదే సీఆర్‌టీ అన్నమాట. 1930 నుంచి ఈ టీవీలు అందుబాటులో ఉన్నాయి. రకరకాల సైజుల్లో, మరెన్నో రకాల ఆకారాల్లో ఇవి దొరుకుతున్నాయి. 40 అంగుళాల పొడవైన టీవీలు మార్కెట్‌లో ఉన్నాయి. మిగిలిన టీవీలతో పోలిస్తే వీటి ధర తక్కువ, పిక్చర్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది.

ఐపీఎల్ మ్యాచ్‌లప్పుడు అక్కడక్కడా భారీ స్క్రీన్‌లు కనిపిస్తుంటాయి చూశారా..అవే ఇవి. వీటినే ప్రొజెక్టర్ టీవీలు అని కూడా అంటారు. డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ పద్ధతిని 1987లో టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ కనిపెట్టింది. డిజిటల్ మైక్రోమిపూరర్ డివైజ్ (డీఎండీ చిప్) అనే ఆప్టికల్ సెమీ కండక్టర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. 50కి పైగా టెలివిజన్ తయారీ కంపెనీలు డీఎల్‌పీ టీవీలను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి. రేర్, ఫ్రంట్ అనే రెండు రకాల ప్రొజెక్షన్‌లు ఉన్నాయి.
రేర్ ప్రొజెక్షన్ : వీటికి అంతగా పాపులారిటీ లేదు. ఈ స్క్రీన్‌లు మామూలు టీవీలకంటే పెద్దగా ఉంటాయి. అంటే 50 నుంచి 73 ఇంచుల వరకు అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్ వెనుక నుంచి పిక్చర్ ప్రొజెక్ట్ అవుతుంది.
ఫ్రంట్ ప్రొజెక్షన్ : ఇవి హైలీ పాపులర్ ప్రొజెక్టర్‌లు. స్క్రీన్ ఎదురుగా కాస్త దూరంగా ఉండే ప్రొజెక్షన్ నుంచి పిక్చర్ లైట్ వస్తుంది. డిమ్ లైట్ ఉన్న రూమ్‌లో ఈ పిక్చర్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 100 అంగుళాల స్క్రీన్ సైజు గల ప్రొజెక్షన్‌లు మార్కెట్‌లో లభిస్తున్నాయి.

ప్రస్తుతం మోస్ట్ పాపులర్ టీవీ ఇది. లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే టెలివిజన్లు ఫ్లాట్ ప్యానెల్‌తో పలుచగా తక్కువ బరువులో ఉంటాయి. చాలా మంది ఇళ్లలో సీఆర్‌టీ టీవీల ప్లేస్‌లో ఇప్పుడు ఇవే ఎక్కువగా రీప్లేస్ అవుతున్నాయి. టీవీలుగానే కాకుండా కంప్యూటర్ మానీటర్లుగా కూడావీటిని వాడుకోవచ్చు. 2009 నుంచి ఇవి బాగా పాపులర్ అయ్యాయి. 15 అంగుళాల నుంచి 55 అంగుళాల ఎల్‌సీడీలు మార్కెట్‌లో లభిస్తున్నాయి.

ఇవి కూడా ఎల్‌సీడీ టీవీలే కాకపోతే ఇందులో కోల్డ్ కాథోడ్ ఫ్లోరోసెంట్ (సీసీఎఫ్‌ఎల్)లకు బదులు ఎల్‌ఈడీ బ్యాక్‌లైటింగ్‌ని వాడతారు. దీని వల్ల ఎల్‌సీడీల సైజు ఇంకాస్త తగ్గడమే కాకుండా పిక్చర్ బ్రైట్‌నెస్ పెరుగుతుంది. ఎలక్ట్రిసిటీ వినియోగం కూడాతగ్గుతుంది.

అన్ని టీవీల కంటే ఈ టైప్ టీవీలే బెటర్ అని ఇప్పుడు ప్రచారంలో ఉంది. ప్లాస్మా డిస్‌ప్లే ప్యానల్స్ అన్నీ ఫ్లాట్‌గానే ఉంటాయి. 40 నుంచి 56 అంగుళాల స్క్రీన్ సైజు టీవీలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ సైజులో కావాలంటే దొరకవు. వీటి బరువు ఎల్‌సీడీ టీవీల కంటే ఎక్కువగానే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కూడా ఎల్‌సీడీల కంటే బావుంటుంది. కాకపోతే కరెంటు బిల్లు మాత్రం ఎల్‌సీడీకంటే ఎక్కువే వస్తుంది.

ఇప్పుడు క్రేజీ టీవీలు ఇవే. త్రీ డైమెన్షన్‌లో రియలిస్టిక్ అనుభూతినివ్వడానికి మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి స్టిరియోస్కోపిక్ డిస్‌ప్లే, మల్టీవ్యూ డిస్‌ప్లే, 2డీ ప్లస్ డెప్త్, 3డీ డిస్‌ప్లేతో ఇవి ఆకట్టుకుంటున్నాయి. ఈ టీవీలను చూడాలంటే ప్రత్యేకంగా లెన్స్‌లను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆటో 3డీ పేరుతో లెన్స్ లేకుండానే త్రీడీ అనుభూతిని పొందే టీవీలు కూడా వస్తున్నాయి.
కొనేముందు..
ఎల్‌సీడీ..ప్లాస్మా.. ఎల్‌ఈడీ? : అసలు టీవీలు రెండు రకాలే.. ఎల్‌సీడీ.. ప్లాస్మా. ఎల్‌ఈడీ ఎల్‌సీడీకి చెందిందే. కాకపోతే కాస్త సన్నగా.. ఇంకా క్వాలిటీగా ఉంటుంది. ప్లాస్మా అయితే గదిలో ఏ మూలన కూర్చున్నా పిక్చర్ కరెక్ట్ యాంగిల్‌లో కనిపిస్తుంది.
సైజ్ : టీవీ సైజు రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి టీవీ ఉంచే హాలు సైజు, రెండు బడ్జెట్. టీవీ పొడవు విషయంలో ఒక రూల్ ఉంది. .3x నుంచి .6x మధ్యనే ఉండాలి. ఇక్కడ x అంటే మీకు టీవీకి మధ్య దూరం. మీ గది ఆరు అడుగుల పొడవుంటే 24 నుంచి 48 అంగుళాల టీవీ కొనుక్కోవచ్చు.
ఇన్‌పుట్ పోర్ట్స్ : ఇప్పుడు వస్తున్న టీవీలన్నింటికీ హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు వస్తున్నాయి. అవి టీవీకి ముందు ఉన్నాయో, వెనక ఉన్నాయో చూసుకోవాలి. వెనక ఉంటే మీరు టీవీ ఉంటే ప్రదేశంలో కంఫర్ట్‌గా ఉంటుందో లేదో చూసుకోవాలి.
స్క్రీన్ రిజెల్యూషన్ : 1080p అయితే అన్ని రకాలుగా బావుంటుంది.
2డీ.. 3డీ? : జాయింట్ ఫ్యామిలీలో అందరూ కలిసి టీవీ చూస్తారు. అలాంటప్పుడు 3డీ టీవీ కొంటే అందిరికీ గ్లాసెస్ కూడా కొనాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మనదేశంలో ప్రాంతీయ ఛానెళ్లు 3డీ కంటెంట్‌ని పెద్దగా ప్రసారం చేయడం లేదు. కాబట్టి 2డీనే బెటర్.
నెట్‌వర్క్ కనెక్టివిటీ : ఇన్‌బిల్డ్ వైఫై ఉన్న టీవీని సెలెక్ట్ చేసుకుంటే యూట్యూబ్‌లాంటి వెబ్ కంటెంట్‌ని కూడా చూడొచ్చు. ఇందుకోసం టీవీ తయారీ కంపెనీలు ప్రత్యేక యాప్స్‌ని కూడా రూపొందిస్తున్నాయి.
Comments