The world is a book and those who do not travel read only one page.
- St. Augustine
(ఈ ప్రపంచం ఒక పుస్తకం. ప్రయాణం చేయని వారు ఒక పేజీ మాత్రమే చదవగలరు)
అందుకే.. వీలైనప్పుడల్లా ఏదో ఒక ప్రదేశాన్ని చూస్తుండాలి...
కుదిరినప్పుడల్లా ఒక టూర్‌కి వెళ్తుండాలి...
అందుకు ఈ వేసవి మంచి అవకాశం...
డబ్బులు ఖర్చవుతాయని బాధపడేవారి
కోసం ఒక ‘మీటప్’ ప్యాకేజీ ట్రెండ్ ఉంది...
కలిసి వెళ్తే.. కలదు లాభం!!
హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ ఫ్యామిలీ టూర్ వెళ్లాలనుకున్నారు. ఎంత ఖర్చవుతుంది? మీరు, మీ భార్యా పిల్లలతో కలిపి నలుగురైదుగురు అనుకుందాం. ఏసీ కారు అయితే ఎనిమిది గంటలకు పదిహేను వందల రూపాయలు.. వెళ్లి రావడానికి జర్నీ.. నాలుగు గంటలు.. అక్కడ ఉండేది నాలుగు గంటలు... సరిపోతుంది. కానీ ఒకవేళ లేటయితే కిలోమీటర్‌కి ఏడు రూపాయలు ఎక్స్‌ట్రా పే చేయాల్సిందే. లంచ్.. స్నాక్స్.. టికెట్లు.. బోటింగ్ ఖర్చు... మొత్తం కలిపి సింపుల్‌గా రెండు వేల రూపాయలు ఖర్చవుతుంది. మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో రెండు వేలంటే పెద్ద ఫిగరే. ఇదే బడ్జెట్‌లో నాలుగు ఫ్యామిలీలు అదే సాగర్‌కు వెళ్లొచ్చే బంపర్ ఆఫర్ ఉంది.
జస్ట్ ఫర్ ఛేంజ్

షేర్ అండ్ టూర్
ఒక ఫ్యామిలీనే వెళ్తే ఖర్చు ఎక్కువే అవుతుంది మరి. అదే నాలుగైదు ఫ్యామిలీస్ కలిసి వెళ్తే?.. ఖర్చు తప్పకుండా తగ్గుతుంది. ఖర్చులను షేర్ చేసుకోవడం వల్ల డెఫినెట్‌గా బడ్జెట్ తగ్గుతుంది. కానీ నాలుగైదు ఫ్యామిలీలు దొరికేదెలా? ఫ్రెండ్స్‌తో, నైబర్స్‌తో కలిసి వెళ్దామంటే.. మనకు కుదిరినప్పుడు వారికి కుదురొద్దా? ఇలాంటి మిడిల్ క్లాస్ మ్యూజింగ్స్ నుంచి పుట్టిందే బడ్జెట్ హాలిడేస్ ఇండియా మీటప్ గ్రూప్. హైదరాబాద్ నగరానికి చెందిన పర్యాటక ప్రేమికులు ఒక సంవత్సరం క్రితం ఈ మీటప్ గ్రూప్‌ని ప్రారంభించారు.
ఏంటీ గ్రూప్?

ఒకరోజు టూర్‌తో మొదలై...
‘మార్చి 21, 2011న ప్రారంభమైన ఈ గ్రూప్‌లో మొదట చాలామంది ఒక్కరోజులో వెళ్లి వచ్చేలా టూర్‌ను అరేంజ్ చేయమని కోరేవారు. ఇంకొందరు రెండు మూడు రోజులు ఆయా ప్రాంతాల్లో గడిపేలా టూర్‌లు అరేంజ్ చేయమనేవారు. అలా నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి కేరళ, ఊటీ వరకు టూర్‌లు మొదలయ్యాయి. ఇప్పుడు నెలకు నాలుగు నుంచి ఐదు టూర్ల వరకు ప్లాన్ చేస్తున్నామ’ని చెప్తున్నారు కో-ఆర్గనైజర్ ప్రణీల్. ‘త్వరలో మరో టూర్ కూడా ఉంది. మే 24న కేరళకు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు రాము.
కొత్త స్నేహాలకు టూర్...
ఈ మీటప్ గ్రూప్‌లో కేవలం ఫ్యామిలీస్‌కు మాత్రమే ప్రవేశం ఉంటుంది. చిన్న పిల్లలున్నవారికి మొదటి ప్రయారిటీ. ఎందుకని అడిగితే ‘పిల్లలు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనకంటే ఎక్కువగా ఆనందిస్తారు. త్వరగా ఇతరులతో కలిసిపోతారు. వారి ద్వారా పెద్దలు కూడా స్నేహితులయ్యే అవకాశం ఉంది. ఈ మీటప్స్ ద్వారా కొత్త పరిచయాలు, స్నేహాలు ఎన్నో కలుగుతాయ’ని చెప్పారు రాము.
ఖర్చు తగ్గించాలనే..
చాలామందికి టూర్‌లకు వెళ్లాలని ఉంటుంది. కానీ డబ్బు సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు మా గ్రూప్‌లో చేరి ఖర్చును తగ్గించుకోవచ్చు. మేం ఆయా ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్లు, క్యాబ్స్, టూరిస్ట్ బస్ ఆర్గనైజర్స్ అందరితో మాట్లాడి వీలైనంత వరకు ఖర్చుని తగ్గిస్తాం. ఎంత వరకు వారు తగ్గించగలరో అంత వరకు మేం బేరమాడుతూనే ఉంటాం. కేవలం 499 రూపాయలతో టూర్ ప్లాన్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.
- రాము కల్లేపల్లి, బడ్జెట్ హాలిడేస్ ఇండియా మీడిప్ గ్రూప్ ఫౌండర్
ఫోన్ నెంబర్ : 040-23205444
వెబ్‌సైట్ : meetup.travelspice.com
టాప్ బడ్జెట్ టూర్స్
1. కొల్లూరు, పాపికొండలు
1 నైట్ / 2 డేస్
ప్యాకేజ్ : రూ. 1,999
2. గోవా ట్రిప్
3 నైట్స్ / 4 డేస్
ప్యాకేజ్ : రూ. 3,999
3. గోల్డెన్ ట్రయాంగిల్
4 నైట్స్ / 5 డేస్
ప్యాకేజ్ : రూ. 9,499
4. కర్ణాటక, ఊటీ
4 నైట్స్ / 5 డేస్
ప్యాకేజ్ : రూ. 9,999
5. కేరళ, మున్నార్
3 నైట్స్ / 4 డేస్
ప్యాకేజ్ : రూ. 9,999
6. చార్మింగ్ మనాలి
3 నైట్స్ / 4 డేస్
ప్యాకేజ్ : రూ. 9,999
Comments