గూగుల్ డాట్ కామ్ హోమ్‌పేజీలో google అనే రంగు రంగుల అక్షరాలు ఒక్కోసారి ఒక్కోరకంగా కనిపిస్తుంటాయి. పండగలు, ఉత్సవాలు, ప్రముఖుల పుట్టిన రోజులు.. ఇలా సందర్భాన్ని బట్టి వాటికి అనుగుణంగా అక్షరాలను మారుస్తుంది google. వాటినే డూడుల్స్ అంటారు. దీనికి గూగుల్ ఇచ్చిన తెలుగు అనువాదం ‘మనసును ఎక్కడో పెట్టుకుని గీతలతో గెలికే చిత్రం’ అని. కానీ గూగుల్ మనసు ఎక్కడో పెట్టుకుని గీయదు. దాన్ని సృష్టించడానికి పక్కా ప్లాన్ ఉంది. వండర్‌ఫుల్ టీమ్ ఉంది. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ + ఫన్... ఇదీ గూగుల్ డూడుల్ స్టయిల్. అందుకే డూడుల్ ఇప్పుడొక మానియా అయ్యింది.
గూగుల్ వ్యవస్థాపకులలో ఒకరైన సెర్జీ బ్రిన్ 199లో గూగుల్ లోగోని డిజైన్ చేశాడు. గింప్ అనే గ్రాఫిక్ ప్రోగ్రామ్ ఆధారంగా ఈ లోగో తయారు చేశాడు. దీని చివరలో ఆశ్చర్యార్థకం ఉండేది. ఇది అచ్చం యాహూ లోగో మాదిరిగానే ఉందన్న విమర్శలొచ్చాయి. రెండేళ్ల తర్వాత చీఫ్ డిజైనర్ రూత్ కేడర్ మరో కొత్త లోగోని సృష్టించాడు. ఇప్పుడున్న లోగోని డిజైన్ చేసింది ఆయనే.
సాధారణంగా ఒకే రంగు అక్షరాలతో లోగోని డిజైన్ చేస్తుంటారు. గూగుల్ ఆరు అక్షరాల్లో నాలుగు రంగులు కనిపిస్తాయి. వాడితే అన్నీ ఒకే రకమైన రంగులు వాడాలి.. లేదంటే ఆరు వేర్వేరు వాడాలి.. కానీ గూగుల్ లోగో అందుకు భిన్నంగా ఉంటుంది. బికాజ్.. గూగుల్ ఎప్పుడూ రూల్స్‌ని ఫాలో అవ్వదు.. ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుంది, అంతే.

పాతకు పాతర.. కొత్తకు జాతర..
ప్రస్తుతం ఇంటర్‌నెట్ వాడకందారుల్లో ఎనభై ఎనిమిది శాతం మంది గూగుల్ వీరాభిమానులే. రాత్రికి రాత్రే గూగుల్ ఇంతటి అభిమానాన్ని సంపాదించుకోలేదు. అత్యాధునిక టెక్నాలజీ, అంకితభావం ఉన్న సిబ్బంది.. సమర్థ నాయకత్వం గూగుల్‌ని ఆ స్థానంలో నిలబెట్టాయి. దీని వెనక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌లు గూగుల్ వ్యవస్థాపకులు. మొదట్లో బద్ధ శత్రువులు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు. చదువుకునే రోజుల్లో ప్రాజెక్టులో భాగంగా సెర్చ్ ఇంజిన్ మీద అధ్యయనం చేశారు. మెల్ల మెల్లగా వారి మధ్య అపార్థాలు తొలగిపోయాయి. ఒకరి సమర్థత ఒకరికి అర్థమైంది. పదిహేనేళ్ల క్రితం అందుబాటులో ఉన్న సెర్చ్ ఇంజిన్లు అంత సమర్థంగా పనిచేసేవి కావు. వేగం మరీ తక్కువగా ఉండేది. వాటిని అధిగమించాలన్నది వారి తపన. ఆ ప్రయత్నంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అనుకున్నది సాధించారు.

ఇద్దరివీ మధ్య తరగతి కుటుంబాలే. ప్రత్యేకంగా ఆఫీసు తెరిచేంత స్థోమత లేదు. వేల డాలర్లు పెట్టుబడి పెట్టే పరిస్థితి అసలే లేదు. లారీ తన ఇంటిని డేటా సెంటర్‌గా మార్చుకున్నాడు. సెర్జీ పడకగది కార్పొరేట్ ఆఫీసు అయ్యింది. తమ దగ్గరున్న సెర్చ్ టెక్నాలజీ.. ఉత్తమమైందని ఆ మిత్రులకు తెలుసు. కానీ మరిన్ని సర్వర్లు లేకపోతే పని ముందుకు సాగదు. మరేం చేయాలి? యాహూ వ్యవస్థాపకుడు డేవిడ్ ఫిలోను కలిశారు. ‘మీరే ఎందుకు ఓ కంపెనీ ప్రారంభించకూడదు’ అని ఆయన సహాయానికి బదులు సలహా ఇచ్చాడు. నిజమే ప్రారంభించవచ్చు కానీ, పాత అప్పులే చాలా ఉన్నాయి. మళ్లీ కొత్త అప్పులు ఎవరిస్తారు? ఆ విషయం స్టాన్‌ఫర్డ్ ప్రొఫెసర్ల చెవిన పడింది. ఆ కుర్రాళ్లను సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన యాండీకి పరిచయం చేశారు. ఆ ప్రజెం చూడగానే ఆయనకి దిమ్మదిరిగి మైండ్ బ్లాకయింది. వెంటనే చెక్కు మీద సంతకం చేశాడు. లక్ష డాలర్లు.. గూగుల్ పేరు మీద వచ్చిన మొట్టమొదటి చెక్కు అది.
కాలిఫోర్నియాలోని ఓ మిత్రుడి గ్యారేజీ గూగుల్ ప్రధాన కార్యాలయంగా మారింది. గూగుల్ కచ్చితత్వం, వేగం ప్రజలకు బాగా నచ్చాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు గులామైపోయింది ప్రపంచం. నెటిజన్ ఏది వెతికితే అది అందివ్వడానికి గూగుల్ కట్టుబడి ఉంది. ఆ ప్రయత్నంలో కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను సృష్టిస్తుంది. గూగుల్ దృష్టిలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు.

ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్, లియోనార్డ్ డావిన్సీ, రవీంవూదనాథ్ ఠాగూర్, లూయిస్ బ్రెయిలీ.. ఇలా దేశ విదేశాలకు చెందిన ప్రముఖుల పుట్టిన రోజుల సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన డూడుల్స్‌ని తయారు చేస్తుంది. వాలెంటైన్స్‌డే, విమెన్స్ డే, చిల్డ్రన్స్ డే... ఇలాంటి ముఖ్య దినాలు.. హోలీ, దసరాలాంటి పర్వదినాలప్పుడు కూడా డూడుల్స్‌ని డిస్‌ప్లే చేస్తోంది. కొన్నిసార్లు అన్ని దేశాల్లో ఒకో రకమైన లోగోని ఉంచితే.. మరికొన్నిసార్లు ఒకే దేశానికి ఒక్కో విధంగా డూడుల్‌ని రూపొందిస్తుంటుంది. గూగుల్ ఇప్పటి వరకు అలాంటివి వెయ్యికి పైగా డూడుల్స్‌ని రూపొందించింది.
డూడుల్ 4 గూగుల్
ఇది పిల్లల కోసం ప్రత్యేకం. ఒక సృజనాత్మకమైన పోటీ. ఆయా దేశాల్లో పిల్లల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా గూగుల్ ఒక కాంపి పెడుతుంది. పదో తరగతి లోపు పిల్లలు గూగుల్ ఇచ్చిన సబ్జెక్ట్‌ని బట్టి డూడుల్‌ని డిజైన్ చేయాలి. వెబ్‌సైట్ ద్వారా ఓటింగ్ పెట్టి విజేతను ప్రకటిస్తుంది. ఆ లోగో చిల్డ్రన్స్ డే రోజు 24 గంటల పాటు ఆ దేశానికి చెందిన హోమ్ పేజీలో కనిపిస్తుంది. మొదట అమెరికాలో మొదలైన ఈ ట్రెండ్‌ని 2009లో మన దేశానికి కూడా పరిచయం చేసింది. నవంబర్ 14న ఇండియన్ గూగుల్ హోమ్ పేజీలో ఈ లోగోని మనం చూడొచ్చు. పోయిన సంవత్సరం జరిగిన డూడుల్స్ పోటీల్లో లక్షమంది విద్యార్థులు పాల్గొన్నారు.
సంవత్సరం ----థీమ్----------------------విజేత
2009--------మై ఇండియా ---------పురూ ప్రతాప్ సింగ్, గుర్గాన్
201-----మై డ్రీమ్ ఆఫ్ ఇండియా-----------అక్షయ్, మంగళూరు
2011 -------ఇండియాస్ గిఫ్ట్ టు ది వరల్డ్--------------------వర్షా గుప్త, నోయిడా
2012 కాంపి త్వరలో ప్రారంభం కానుంది. దీనికి ఎంట్రీలు పంపాలనుకునే పాఠశాలల విద్యార్థులు proposals@google.com కి ఈ మెయిల్ చేయొచ్చు.
- ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ గూగుల్ అన్న మాటను క్రియాపదంగా గుర్తించింది. ‘వెతకడం’ అని అర్థం వచ్చేలా నిర్వచించింది.
- నిమిషానికి ఒక పేజీ చెప్పున గూగుల్‌లో ఉన్న సమాచారమంతా చదవాలంటే 40 వేల సంవత్సరాలు పడుతుంది. అదే గూగుల్‌కు అరసెకను పని.
- మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 9, 2009న గూగుల్ తొలిసారి గాంధీ డూడుల్‌ని డిజైన్ చేయించింది.
- మే 21, 2010న ప్యాక్ మ్యాన్ 30వ జయంతి సందర్భంగా రూపొందించిన డూడుల్ ప్రపంచంలోనే మొదటి ప్లేయబుల్ లోగో.
- చార్లీ చాప్లిన్ 122వ పుట్టిన రోజు నాడు (ఏవూపిల్ 15, 2011) గూగుల్ తొలి వీడియో డూడుల్‌ని పెట్టింది.
- జిమ్ హెన్సన్ 75వ పుట్టిన రోజున (సెప్టెంబర్ 22, 2011) ఆరు మప్పెట్స్‌తో ఏర్పాటు చేసిన డూడుల్ మౌస్‌తో క్లిక్ చేస్తే కదిలేలా డూడుల్‌ని డిజైన్ చేయించింది.
Comments