Skip to main content

మొబైల్ ఫోన్ పోయిందా డోంట్ వర్రీ

గడిచిన కాలం.. వదిలిన బాణం..

ఆడిన మాట..

పోయిందేదీ తిరిగిరాదు..

కానీ సెల్‌ఫోన్.. టాబ్లెట్.. ల్యాప్‌టాప్.. ఇలాంటివి పోతే తిరిగి రాబట్టు కోవచ్చు.

పోయిన వాటిని రికవరీ చేసే పోలీసుల్లా పనిచేసే కొన్ని టెక్నికల్ అప్లికేషన్స్

గురించి..

గాడ్జెట్స్ అంటే టెక్ సావీలకు చాలా ఇష్టం. వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి ఇష్టమైన వాటిని సొంతం చేసుకుంటుంటారు. కానీ అవి ఎక్కడైనా పోతే? ఎవరైనా దొంగిలిస్తే? డబ్బుల గురించే కాదు.. అందులో ఉన్న డేటా గురించి కూడా బాధపడాల్సిందే. కాదు.. కాదు.. ఇప్పుడు అంత సీన్ లేదు. ఒకే ఒక్క క్లిక్‌తో దాని ఆచూకీ కనిపెట్టొచ్చు. అదెలాగో చూడండి.

మొబైల్ ఫోన్

ఆండ్రాయిడ్ ఫోన్
Avast_Free talangana patrika telangana culture telangana politics telangana cinema
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ఆచూకీ కనిపెట్టడానికి అవస్త్ ఫ్రీ మొబైల్ సెక్యూరిటీ (avast free mobile security) ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ ఫెసిలిటీ కేవలం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే మొబైళ్లలో మాత్రమే ఉంటుంది. అవస్త్ అందించే యాంటీ తెఫ్ట్ సెక్యూరిటీని ఎనేబుల్ చేయగానే ఇన్‌విజిబుల్‌గా అప్లికేషన్ పనిచేస్తుంది. దొంగిలించిన వాళ్లు దీన్ని డిజేసేబుల్ చేయడం సాధ్యం కాదు. పెద్ద సౌండ్‌తో సైరన్ మోగే ఫెసిలిటీ కూడా ఉంది. పీజీఎస్ సర్వీసుతో మొబైల్‌ని ట్రాక్ చేయొచ్చు. గూగుల్‌ప్లే స్టోర్ నుంచి దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

యాంటీడ్రాయిడ్ తెఫ్ట్ (antidroidtheft) : ఇది జీపీఎస్ సర్వీసుతో పోయిన మొబైల్ ఫోన్‌ని ట్రాక్ చేస్తుంది. మొబైల్ కెమెరాని యాక్టివేట్ చేసి ప్రస్తుతం దాన్ని ఎవరు వాడుతున్నారో వారి ఫోటోలు తీసి పంపుతుంది. దీన్ని కూడా గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ మార్కెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సిమ్ వాచర్ ప్రో (sim watcher pro) : ఎవరికైనా ఫోన్ దొరకగానే ఏం చేస్తారు? సిమ్‌కార్డ్ తీసేసి వాడుకుంటారు. అలా సిమ్‌కార్డ్ మార్చే వీలు లేకుండా సిమ్ వాచర్‌ప్రో ఉపయోగపడుతుంది. మార్చిన సిమ్ నెంబర్‌ని మీరు ఎంచుకున్న మొబైల్ నెంబర్‌కి ఆటోమాటిక్‌గా మెసేజ్ చేస్తుంది. దీన్ని కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందొచ్చు.
SIM-W talangana patrika telangana culture telangana politics telangana cinema
బ్లాక్‌బెర్రీ ఫోన్
బ్లాక్ బెర్రీ వాడేవాళ్లు బ్లాక్‌బెర్రీ ప్రొటెక్ట్‌ని వాడుకోవచ్చు. ఇది మీ ఫోన్ ఏ లొకేషన్‌లో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పోయిన మొబైల్ ఫోన్‌లో మీ డేటాని ఆన్‌లైన్ క్లౌడ్ స్టోరేజీలోకి బ్యాక్‌అప్ చేసిపెడుతుంది కూడా. దీనికోసం బ్లాక్ బెర్రీ వెబ్‌సైట్‌ని సందర్శించండి.
(http://m.blackberry.com/protect)

విండోస్ ఫోన్
విండోస్ మొబైల్ వాడేవాళ్లు ఫోన్ సెట్టింగ్స్‌లోని ఫైండ్ మై ఫోన్‌లోకి వెళ్లి సేవ్ మై లొకేషన్ ఎవ్రీ ఫ్యూ అవర్స్ (Find My Phone-> Save my Location Every few hours) అనేది ఎంచుకొని ఉంచాలి. అది మొబైల్ పోయినప్పుడు ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
దీన్ని www.windowsphone.comలో అప్‌డేట్ చేయాలి. మీ ఫోన్ పోయినప్పుడు లాగిన్ అయ్యి My phone-> Find My Phone లో మ్యాప్‌పై లోకేషన్‌ను చూడొచ్చు. మీ పాస్ట్‌వర్డ్ ఎంటర్ చేసి ఫోన్‌ని లాక్ చేసేయొచ్చు.

ల్యాప్‌టాప్

ల్యాప్‌టాప్‌ను ఎవరైనా దొంగిలిస్తే దాన్ని కనిపెట్టడానికి లొకేట్ మై ల్యాప్‌టాప్ (LocateMyLaptop) అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఇది ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతుంది. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ టూల్‌ని మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీకు కనిపించకుండానే ఇన్‌విజిబుల్ మోడ్‌లో ఇది మీ ల్యాప్‌టాప్ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. దీంతో గూగుల్ మ్యాపింగ్ ద్వారా ల్యాప్‌టాప్‌ని ఎక్కడెక్కడికి తీసుకెళ్లారో చూడొచ్చు. ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్‌లను కూడా పంపిస్తుంది. ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని రిమోట్ యాక్సెస్‌తో రికవర్ చేయొచ్చు.
http://locatemylaptop.com

టాబ్లెట్

పోగొట్టుకున్న టాబ్లెట్ పీసీని ట్రాక్ చేసి పట్టుకోవడానికి Prey Anti-Theft టూల్‌ని నిక్షిప్తం చేసుకోండి. ఆండ్రాయిడ్ ఓఎస్ టాబ్లెట్‌లకి ఇది ప్రత్యేకం. జీపీఆర్‌ఎస్, వై-ఫై నెట్‌వర్క్‌ల సహాయంతో వాటాని వెతికి పట్టుకోవచ్చు. సిమ్‌కార్డ్ మార్చేసి వాడేందుకు ప్రయత్నిస్తే మనకు మెసేజ్ అందిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ మార్కెట్ నుంచి పొందొచ్చు. ఇలాంటిదే మరొకటి Anti-Theft Plug In దీన్ని నార్టన్ సంస్థ రూపొందించింది. దీన్ని టాబ్లెట్‌లో ఇన్‌స్టాల్ చేసి Lock, Locate, Find ఫీచర్స్‌ని వాడుకోవచ్చు. దీన్ని ఆండ్రాయిడ్ మార్కెట్ నుంచి పొందొచ్చు.

యాపిల్ గాడ్జెట్స్

మ్యాక్ : యాపిల్ కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారు ఐక్లౌడ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం బెటర్. యాపిల్ మ్యాక్‌ని ఎవరైనా దొంగిలిస్తే Find my Mac సర్వీసెస్‌ని ఎనేబుల్ చేసి అదెక్కడుందో కనిపెట్టొచ్చు. దీన్ని యాపిల్ కంపెనీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి పొందొచ్చు. రిమోట్ యాక్సెస్‌తో మ్యాక్‌ని బ్లాక్ చేయొచ్చు. డ్రైవ్‌ల్లోని డేటాని తొలగించొచ్చు.
ఐఫోన్ : Find My iPhone ఆప్షన్‌తో యాపిల్ ఐఫోన్‌ని ట్రాక్ చేయొచ్చు. దీని ఆధారంగానే ఐపాడ్‌లనూ కనిపెట్టేయొచ్చు. యాపిల్ ఐస్టోర్ నుంచి వీటిని పొందొచ్చు.

Comments

aadhi said…
సర్ నేను సాధారణ మొబైల్ వాడుతున్న .న మొబైల్ లో ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయవచ్చ .మొబైల్ ట్రాకింగ్ గురుంచి సెట్టింగ్స్ గురుంచి .సాఫ్ట్వేర్స్ గురుంచి వివరం గ చెప్పగలరు.
aadhi said…
సర్ నేను సాధారణ మొబైల్ వాడుతున్న .న మొబైల్ లో ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయవచ్చ .మొబైల్ ట్రాకింగ్ గురుంచి సెట్టింగ్స్ గురుంచి .సాఫ్ట్వేర్స్ గురుంచి వివరం గ చెప్పగలరు.

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...