Skip to main content

ఫీల్ మై పెయిన్... ఐ యామ్ గణేష్!



పద్మవ్యూహాన్ని ఛేదించినవాడు... విజేత కాదు.. 
అతడు కేవలం బతికి బయటపడ్డవాడు మాత్రమే!
ఆ వ్యూహంలో చిక్కుకున్న వారిని కాపాడాలనుకునేవాడే నిజమైన విజేత...
అదే సర్వైవర్‌కి.. కాంకరర్‌కి ఉన్న తేడా...
ఆ పోరాటంలో.. ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది... 
అలాంటి ‘చీకటి’ నుంచి వెలుగులోకి వచ్చిన ఒక అభిమన్యుడు.. గణేష్ నల్లారి. 
అమీర్ ‘సత్యమేవ జయతే’తో ప్రేక్షకుల్ని కన్నీరు పెట్టించిన ఆయనతో ములాఖాత్. 

---
ఒక సినిమా కథ... 
అభిమన్యు.. ఒక సక్సెస్‌ఫుల్ సినిమా డైరెక్టర్. బాల్యంలో అతడు సెక్సువల్ అబ్యూస్ (లైంగిక వేధింపు)కు గురవుతాడు. ఆ చీకటి జ్ఞాపకాలు అతణ్ణి నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. మనసులో సునామీ.. ఎవరికీ అర్థంకాని మానసిక సంఘర్షణ.. అలాగే బాధపడుతూ కూర్చుంటే.. అతని జీవితం అక్కడే ఆగిపోయేది. అతడు కాలంతోపాటు కలిసి నడిచాడు. జీవితంలో గెలిచాడు. కానీ.. సినిమా కథలో అతని ‘లైంగిక గుర్తింపు’.. ఒక ప్రశ్నార్థకం???
(ఏవూపిల్, 2011లో విడుదలైన బాలీవుడ్ మూవీ ‘ఐ యామ్’లో ఒక భాగమిది. ఒనీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జాతీయ అవార్డుని అందుకుంది)

ఒక యథార్థ కథ...
బాల్యంలో నా మీద బలాత్కారం జరిగింది. కానీ ఈ రోజు నా జీవితాన్ని నేను చక్కగా మలుచుకున్నాను. నేను దేవుణ్ణి ద్వేషిస్తున్నానంటే ఒక్క విషయం గురించే.. అది.. నా జీవితంలో విలువైన బాల్యాన్ని ఆయన నాకు దక్కకుండా చేశాడు. కాబట్టి నేనాయన్ని ఎప్పటికీ క్షమించను. కానీ నేను ఎవరి వల్ల బాధితుణ్ణి అయ్యానో ఆయన చనిపోయేముందు కలిశాను. ‘నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను’ అని చెప్పాను.. క్షమించలేదనుకోండి... నా జీవితమంతా నేను బాధతో గడపాల్సిందే. నిజానికి నేను ఎక్కువగా బాధపడింది.. మా అమ్మానాన్నల గురించే. వాళ్ల మనోభావాల్ని ఒకసారి ఊహించుకోండి.. !
(మే 13, 2012న ప్రసారమైన అమీర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’లో సక్సెస్‌ఫుల్ ఫ్యాషన్ డిజైనర్ గణేష్ నల్లారి చెప్పిన మాటలివి)


ఈ రెండు కథలకి సంబంధం ఉంది. గణేష్ నల్లారి ‘డార్క్ మెమరీస్’ ఆధారంగానే ఒనీర్ ‘ఐ యామ్’ సినిమా తీశాడు (పూర్తిగా గణేష్ కథ కాదు. అతని జీవితంలో కొంత భాగం మాత్రమే). 30 సంవత్సరాల నుంచి కన్న తల్లిదంవూడులకూ చెప్పుకోలేని బాధని గణేష్ ఒనీర్‌తో ఎందుకు చెప్పాడు? గతం చేసిన గాయం మీద ఒనీర్ ఎందుకు మళ్లీ కారం చల్లాడు? ‘దాని’ గురించి తెలుసుకున్న గణేష్ తల్లిదంవూడుల మానసిక పరిస్థితి ఏంటి? వీటికి గణేష్ చెప్పిన సమాధానాలే ఈ ములాఖాత్. 

అమ్మానాన్న.. తాతయ్య నాయనమ్మ.. బాబాయిలు.. అత్తయ్యలు.. అందరూ కలిసి ఉన్న ఉమ్మడి ఇల్లు అది. సామాన్య మధ్య తరగతి కుటుంబం. గణేష్ తండ్రి మీద చాలా బాధ్యతలున్నాయి. ఆయన తమ్ముళ్ల, చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయాలి. ఒక్కడే కొడుకైన గణేష్‌ని బాగా చదివించాలి. అందుకోసం రేయింబవళ్ళు కష్టపడేవాడు. చేయాల్సిన వారి పెళ్లిళ్లు చేశాడు. ఇంట్లో మొత్తం ఏడుగురు పిల్లలు. గణేష్‌కి అప్పుడు ఐదేళ్లు. తల్లిదంవూడులతో ఎటాచ్‌మెంట్ ఎక్కువ. మిగిలిన పిల్లలతో కలివిడిగా ఉండేవాడు. బాగా చదివేవాడు. బొమ్మలేసేవాడు. కూచిపూడి, భరత నాట్యం నేర్చుకునేవాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఆలోచిస్తుండేవాడు. ‘ఏమైంది?’ అని అమ్మానాన్నలు అడిగితే మాత్రం సమాధానం ‘ఏమీలేదు’ అనే ఉండేది. ఏదో కసిగా బొమ్మలు వేస్తుండేవాడు. ఏదో మరిచిపోవడానికి ఒక వ్యాపకం పెట్టుకున్నట్లు కనిపించేది.3 

పన్నెండేళ్ల తర్వాత.. 
ఒకరోజు.. గణేష్ అంకుల్(!)తో బాగా గొడవపడ్డాడు. చిన్న విషయమే పెద్దదైంది. మాటా మాటా పెరిగింది. ఆ కారణంతోనే గణేష్ ఇంట్లోంచి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ అకారణంగా ఇంట్లోంచి వెళ్లిపోతున్నాడు అనుకున్నారు తల్లిదంవూడులు. గణేష్ మామయ్య వాళ్లింటికి వెళ్లిపోయాడు. తల్లిదంవూడులు వెళ్లి మాట్లాడారు. ‘ఆ ఇంట్లో ఉండడం నాకిష్టం లేద’న్నాడు గణేష్. కారణం మాత్రం చెప్పలేదు. అప్పుడే విద్యానగర్ ‘ఉమ్మడి కుటుంబం’ చీలి బేగంపేట ‘న్యూక్లియర్ ఫ్యామిలీ’గా షిప్ట్ అయ్యింది. చిక్కడపల్లి అరోరాలో జెనెటిక్ ఇంజినీరింగ్‌లో చేరాడు గణేష్. తర్వాత బెంగళూరు శ్రీకృష్ణ దేవరాయలు డెంటల్ కాలేజ్‌లో చదివాడు. గణేష్ ఇప్పుడు డాక్టర్. అదే కాలేజ్‌లో డెంటల్ టీచర్‌గా జాబ్ వచ్చింది. గణేష్ ఇప్పుడు ఇండిపెండెంట్ కిడ్. ఏదో జ్ఞాపకాలకు దూరంగా.. ఒంటరిగా.. స్వతంవూతంగా బతుకుతున్నాడు.

ఒక మలుపు...
ఇంకా బిజీగా ఉండాలి.. ఏదో చేయాలి.. సంవత్సరంన్నర గడిచింది. ఈ డెంటల్ జాబ్‌కాదు... ‘డిజైనింగ్’పైన ఒక డిజైర్ అతనికి. ఎలా పుట్టిందో తెలియదు కానీ.. ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్నాడు. అమ్మానాన్నలను కన్విన్స్ చేశాడు. బెంగళూరు నిఫ్ట్‌లో ఎంట్రన్స్.. ఇంటర్వ్యూ... ‘డాక్టర్ ఫీల్డ్‌లో మంచి రెస్పెక్ట్ ఉంటుంది కదా.. మీరు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు?’ అడిగాడు ఇంటర్వ్యూయర్. ‘అంటే.. మీరంతా గౌరవంగా బతకడం లేదా? రెస్పెక్ట్ అనేది వ్యక్తి ప్రవర్తనకి ఉంటుంది కానీ.. వయసుకు.. హోదాకు కాదు’ అని సమాధానమిచ్చాడు గణేష్. నిజమే.. వయసులో పెద్దవావరో అతన్ని వేధించారు. అందుకే ‘పెద్దల’ మీద నమ్మకం లేదు. కసితో చదివాడు. 2004లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ నిఫ్ట్‌లో పూర్తయింది. గోల్డ్ మెడల్ సాధించాడు. ‘కలలు కనండి.. సాకారం చేసుకోండి’ అన్న అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా మెడల్ అందుకున్నాడు. నాన్నకు గణేష్ మీద నమ్మకం పెరిగింది. 
4
ఇంకా.. ఇంకా... 
‘వీలైతే ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్లీ నేర్చుకోవడానికి నేను రెడీ’ అనే గణేష్ డిజైనింగ్ లోతుల్ని ఇంకా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే ఇటలీ మిలాన్‌లోని డోమస్ అకాడెమీలో మాస్టర్స్ చేయాలనుకున్నాడు. 40 శాతం స్కాలర్‌షిప్.. కానీ ఏమీ నేర్పరు. ‘ఈ ప్రపంచంలో ఎవరూ ఏదీ నేర్పరు.. చూసి మనమే నేర్చుకోవాలి’.. గొప్ప విషయం తెలుసుకున్నాడు. 2006 కోమోలో జరిగిన యూరోపియన్ సిల్క్ అవార్డ్స్ ఫైనలిస్ట్‌లలో ఒకడుగా నిలిచాడు. హైదరాబాద్ నిఫ్ట్‌లో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేశాడు. ఫ్రాంక్లీ మోరెల్లో, ఎలియో ఫియోర్సీ, రాఫెల్ లోపెజ్, హవాయీన్స్‌లాంటి అంతర్జాతీయ బ్రాండ్స్‌తో కలిసి పనిచేశాడు. టెక్స్‌టైల్ డిజైన్‌లో స్పెషలైజేషన్.. హైదరాబాద్, బెంగళూరులలో పెద్ద పెద్ద కంపెనీలతో పనిచేసిన అనుభవం.. ఇక చాలు.. చెడు జ్ఞాపకాలు చెదిరిపోయాయి. ఇక అమ్మానాన్నలకు దగ్గరగా ఉంటూ పనిచేసుకోవాలి. అలా తన పేరుతోనే ‘గణేష్ నల్లారి’ లేబుల్‌ని ప్రారంభించాడు. 

ఫస్ట్ ఛాన్స్...
సికింవూదాబాద్‌లో చిన్న గది.. రెండు మిషిన్లు.. ఒక టైలరు... అదీ అతని బోటిక్. అమ్మానాన్నవి.. చుట్టుపక్కల వారివి.. డ్రెస్సులు కుట్టేవాడు. బాగా డిజైన్ చేస్తున్నాడని... మౌత్ పబ్లిసిటీ వచ్చింది. ఒక మంచి ఆఫర్.. ఒక వెడ్డింగ్‌కి డ్రెసెస్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్.. ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. పెళ్లిలో అందరూ అతను డిజైన్ చేసిన డ్రెస్‌ల గురించే మాట్లాడుకున్నారు. ఇంకేముంది.. బోటిక్ సికింవూదాబాద్ నుంచి బంజారాహిల్స్‌కి మారింది. సాగర్ సొసైటీ.. స్ట్రీట్ నెంబర్ 2లో చింక్ పీ స్టూడియోస్.. 12 మంది స్టాఫ్.. 5 మిషిన్లు.. మంచి బోటిక్.. ఇది ఇప్పుడతని లైఫ్ స్టైల్. సినిమా అవకాశాలొచ్చాయి. ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలకి స్టైలింగ్ చేశాడు. ఊ కొడతారా ఉలిక్కి పడతారా!, దరువు, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలకు కూడా ఇప్పుడు డిజైనింగ్ చేస్తున్నాడు.. బిజీ బీ.

గతం...
బెంగళూరు హాస్టల్లో ఉన్నప్పుడు ఒకరోజు.. ‘I am sexually abused in my childhood తన స్నేహితుడికి చెప్పలేక.. కాగితం మీద రాసి చూపించాడు గణేష్. ‘ఇలా నవ్వుతూ నవ్విస్తూ ఉండే నీ వెనక ఇంత విషాదం ఉందా?’ షాక్ తిన్నాడతడు. ఇన్నేళ్లు ఎవరికీ చెప్పలేని ఆ విషయం కాగితాలతో, బొమ్మలతో చెప్పుకునేవాడు. ఈ విషయం ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్‌కి మాత్రమే తెలుసు. రెండేళ్ల క్రితం... ‘అంకుల్(!) ఆస్పవూతిలో ఉన్నాడు. నువ్వు వెళ్లి చూసి రావాలి’ చెప్పింది అమ్మ. ‘నేను వెళ్లను’ సమాధానమిచ్చాడు గణేష్. ‘ఎందుకు వెళ్లవు. అతనంటే నీకెందుకు అంత కోపం?’ అమ్మ అడిగింది. ‘ఇదే మాట... పాతికేళ్ల క్రితం అడిగి ఉండొచ్చు కదా అమ్మ? అమ్మే కాదు ఎవరూ నన్ను అడగలేదు’- మనసులో అనుకున్నాడు గణేష్. అమ్మకోసం ఆస్పవూతికి వెళ్లాడు. జీవచ్ఛవంగా పడి ఉన్నాడు ఆ వ్యక్తి.. దగ్గరికి వెళ్లి గణేష్ అతని కళ్లలోకి చూస్తూ.. ‘నేను నిన్ను క్షమిస్తున్నాను’ అన్నాడు. అతడు మాట్లాడలేదు. కళ్లల్లో నీళ్లు ఉబికి వచ్చి గణేష్‌ని క్షమాపణ అడిగాయి. అతడు కళ్లు మూశాడు. గణేష్ ఏడ్చాడు. బాగా.. అందరికంటే ఎక్కువ. ఎందుకని ఎవరూ అడగలేదు.

ఆ రోజు సాయంత్రం...
గణేష్ ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ చేస్తున్నాడు. ‘నీ గతం నాకు తెలుసు? నేను సినిమా తీద్దామనుకుంటున్నాను?’ అడిగాడు ఒనీర్. ‘వద్దు. ఆ గాయం చేసిన వారు ఈ లోకంలో లేరు. అతని గురించి చెప్పి.. వారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు’ ఒప్పుకోలేదు గణేష్. ‘లేదు ఈ సమస్యని నీవరకే చూస్తున్నావు. ఈ సమాజంలో నీలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. ఒక అవేర్‌నెస్ కలిగించాలి. అందుకు నువ్వు మాట్లాడాలి’ ఒప్పించే ప్రయత్నం చేశాడు ఒనీర్. గణేష్ ఆలోచనలో పడ్డాడు. గూగుల్‌లో వెతికాడు. తనలాంటి వాళ్ల గురించి తెలుసుకున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమస్య పరిష్కారానికి నేను సపోర్ట్ చేయాలి. యస్.. నేను నోరు విప్పాలి. గణేష్ గతం తెరకెక్కింది. మరి తల్లిదంవూడులు? ‘ఇన్నాళ్లు మాకు చెప్పకుండా బాధనంతా గుండెల్లోనే దాచుకున్నావా?’ అమ్మ గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ‘ఆర్ యు ఓకే నౌ?’ అడిగాడు నాన్న. 

గణేష్ థియరీ
లోకంలో చాలామంది చాలా కాంప్లికేటెడ్‌గా బతుకుతున్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దగా చూస్తున్నారు. మా స్నేహితుడొకడు తన లవర్ హ్యాండిచ్చిందని చాలాకాలం బాధపడ్డాడు. నేను లైట్ తీసుకొమ్మని చెప్పాను అప్పుడు. ఇప్పుడు నా గురించి తెలిశాక ‘నేను చిన్న విషయానికే అంతలా రియాక్ట్ అయ్యాను. నువ్వు మనసులో ఇన్నేళ్లు ఇంత బాధ పెట్టుకుని మాతో హ్యాపీగా ఉన్నావు. జీవితంలో సాధించాలనుకున్నది పొందావు. అందరూ నీలా ఉండాలి’ అన్నాడు. తెలియని వాళ్లందరికీ నా విషయం తెలిసింది. ‘ఇష్టపడ్డ వాళ్లు’ కలిసి బతకాలనుకున్నా చట్టాలు అడ్డువచ్చే దేశంలో ఉన్నాం మనం. అప్పటికీ ఇప్పటికీ అబ్యూస్ మీద అవగాహన వచ్చింది. అమీర్ ఖాన్ లాంటి స్టార్ కూడా సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. నాకు పిలుపొచ్చింది. అందుకే నేనూ సపోర్ట్ చేయాలనుకున్నాను. మాట్లాడాను. ఇక పెళ్లంటారా? నేనేం తప్పుచేశాను? నేను బాధితుణ్ణి అయ్యాను. నాలా ఎవ్వరూ ఉండకూడదన్న ఆశయం కోసం నేనిలా ఉండడానికి ఎప్పటికీ రెడీ.


Comments

buddhamurali said…
చాలా బాగా రాశారు . సత్యమేవ జయతే మిస్ అయ్యాను . అయితే ఏదో హిందీ చానల్ లో ఈ ఎపిసోడ్ను ప్రత్యేక కార్యక్రమంగా కొంత చూపించారు. మొత్తం చూస్తే బాగుండేది అనిపించింది. ఇప్పుడు మీ పోస్ట్ చదివాక మొత్తం కళ్ళ ముందు ప్రత్యక్షం అయినట్టుగా ఉంది .( ఈ పోస్ట్పై చాలా మంది బ్లాగర్స్ స్పందిస్తారని అనుకున్నాను కానీ ....)

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...