బ్లూటూత్ ఇప్పుడొక ఫ్యాషన్ యాక్సెసరీ. ఒకప్పుడు బిజినెస్‌మెన్, సెలబ్రిటీలు మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో లభించే ఫోన్లలో కూడా బ్లూటూత్ ఆప్షన్ ఉంటోంది. బైక్ నడిపేటప్పుడు, ఎక్కువసేపు ఫోన్లే మాట్లాడేప్పుడు బ్లూటూత్ హెడ్‌సెట్‌ని వాడడం కంఫర్ట్‌గా ఉంటుంది. మీరు వాడే ఫోన్‌కి ఎలాంటి బ్లూటూత్‌ని ఎంచుకోవాలి?
పర్ఫెక్ట్ బ్లూటూత్ గురించి తెలిపే గైడ్‌లైన్స్ ఇవి.
1. కాల్ క్వాలిటీ
బ్లూటూత్ కొనేముందు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఇది. ఫోన్‌లో మాట్లాడేప్పుడు వాయిస్ క్లారిటీ ఎంత క్లియర్‌గా ఉందో చూడాలి. ఎదుటివాళ్ల మాటలు మీకు ఎంత క్లియర్‌గా వినిపిస్తున్నాయో మాత్రమే కాదు.. మీ మాటలు కూడా ఎదుటివారికి ఎంత క్లియర్‌గా వినిపిస్తున్నాయో కూడా చూడాలి. మీ వాయిస్ మాత్రమే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ కూడా ఎక్కువగా రాకుండా చూసుకోవాలి.
2. బ్యాటరీ పవర్
బ్లూటూత్ హెడ్‌సెట్‌కు కూడా ప్రత్యేకమైన ఛార్జర్ ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టి వాడితే రెండు గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసే బ్లూటూత్‌లు మార్కెట్‌లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫోన్లో ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉన్నవాళ్లు ఎక్కువ బ్యాటరీ పవర్ ఉండే బ్లూటూత్‌ని ఎంచుకోవడం మంచిది. స్మార్ట్ ఫోన్ కోసం బ్లూటూత్ వాడేవాళ్లు ఐదు గంటల స్టాండ్‌బై టైమ్ వాటిని ఎంచుకోవాలి.
3. టైప్ అండ్ కంఫర్ట్
బ్లూటూత్ హెడ్‌సెట్‌లు నాలుగు రకాలుగా లభిస్తాయి. 1. ఇయర్ బడ్ హెడ్‌ఫోన్స్, 2. ఇయర్ హుక్ హెడ్‌సెట్స్ (ఇయర్ పీస్), 3. సింగిల్ ఇయర్ హెడ్‌సెట్స్ (మోనో), 4. స్టీరియో హెడ్‌సెట్స్ (ండు ఇయర్ బడ్స్, రెండు ఇయర్ పీస్‌లు). వీటిలో మీకు ఎలాంటి స్టైల్ హెడ్‌సెట్ కావాలి. అది మీకు కంఫర్ట్‌గా ఉంటుందో లేదో చూసుకోవాలి. ఇయర్ బడ్స్ ఉన్నవి ఎక్కువ నాయిస్ క్యాన్సలేషన్‌ని కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అవి మీరు చెవిలో పెట్టుకోవడానికి కూడా కంఫర్ట్‌గా ఉంటాయి. ఇవి నచ్చని వాళ్లు ఇయర్‌పీస్‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు. హుక్ ఉన్నవి చెవిలో పెట్టుకున్నప్పుడు జారి పడిపోకుండా ఉంటాయి. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్టీరియో హెడ్‌సెట్స్‌ని పెట్టుకోవడం గుడ్ ఐడియా. పాటలు వినడానికి కూడా ఇదే బెటర్ ఆప్షన్.
4. కెపబిలిటీ అండ్ టెక్నాలజీ
మీ ఫోన్లో బ్లూటూత్ ఆప్షన్ ఉన్నప్పటికీ అన్ని రకాల బ్లూటూత్ హెడ్‌సెట్‌లు కనెక్ట్ కావు. ఉదాహరణకు మీరు స్యామ్‌సంగ్ మొబైల్ వాడుతున్నారనుకోండి నోకియా బ్లూటూత్ హెడ్‌సెట్ కనెక్ట్ కాకపోవచ్చు. స్యామ్‌సంగ్ హెడ్ సెట్‌లలో కూడా చాలా రకాలు ఉంటాయి. మీది స్యామ్‌సంగ్ అయినంత మాత్రాన స్యామ్‌సంగ్ బ్లూటూత్ హెడ్‌సెట్ మీ మొబైల్‌తో కనెక్ట్ కావాలని రూల్ ఏమీలేదు. ఇదీ కెపబిలిటీకి సంబంధించిన అంశం. మరి టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. బ్లూటూత్‌లో రకరకాల వెర్షన్‌లు ఉంటాయి. ప్రస్తుతం 4.0 అప్‌గ్రేడెడ్ వెర్షన్ నడుస్తోంది. అందుకే మీరు వాడుతున్న ఫోన్‌లో బ్లూటూత్ ఏ వెర్షన్‌దో తెలుసుకొని దానికి సరిపోయే హెడ్‌సెట్‌ని ఎంచుకోవాలి.
5. ఫీచర్స్ అండ్ కాస్ట్
స్మార్ట్ ఫోన్లలో బ్లూటూత్ హెడ్‌సెట్ కోసం పనికొచ్చే ప్రత్యేకమైన అప్లికేషన్లు ఇప్పుడు చాలానే ఉన్నాయి. మీ ఫోన్ ఎక్కడో పెట్టి బ్లూటూత్ ట్రాన్స్‌మీటర్ ఉన్న కంప్యూటర్‌లో కూడా మెసేజ్‌లను చదువుకోవచ్చు. ఇలాంటి ఫీచర్లు కావాలనుకునేవాళ్లు యాప్స్ ఫీచర్స్ ఉన్న బ్లూటూత్‌లను కొనుక్కోవచ్చు. బ్లూటూత్ హెడ్‌సెట్‌లు వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల విలువైనవి ఉన్నాయి. మీ ఫోన్, మీకు కావాల్సిన ఆప్షన్స్‌ని బట్టి మీ బ్లూటూత్ హెడ్‌సెట్‌ని ఎంచుకోవచ్చు.
Comments