ఒక క్రియేటివ్ థాట్..
ఏడుగురు శిల్పులు..
12 ప్రాంతాలు..
20 రోజులు..
3800 కిలో మీటర్లు...
శిల్పాల కోసం ఒక సాహస యాత్ర...
కర్టసీ.. అచల స్టూడియో..
కన్సెప్ట్.. శివరామాచారి..
కదిలే శిల్పాల మిక్స్ అండ్ మ్యాచ్ కథ ఇది..
అచల అంటే స్థిరమైనది అని అర్ధం. కానీ ఈ శిల్పాలు స్థిరంగా ఒకే ప్రాంతంలో ఉన్నవి కాదు.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదిలిన శిల్పాలు. ఒక ప్రాంతం ప్రత్యేకతలు.. పరిసరాలు.. పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చిన అద్భుతాలు. భైరవకోన ప్రకృతి సౌరభాలు.. బెంగళూరు అర్బన్ టచ్... బేలూర్ చెన్నకేశవ ఆలయ అందాలు.. సహ్యాద్రి పర్వత సౌందర్యాలు.. మైసూర్ మిత్స్... ఊటీ నేచర్... కన్యాకుమారి కమనీయ దృశ్యాల నుంచి శిల్పులు స్ఫూర్తి పొంది తీర్చిదిద్దిన శిల్పాలివి. మే 12న హైదరాబాద్‌లో బయలు దేరిన అచల స్టూడియో టీమ్ భైరవ కోన నుంచి ఒక యాత్రని ప్రారంభించింది. బేలూర్, వెస్ట్రన్ ఘాట్స్, మైసూర్, ఊటీ, కొచ్చీ, కన్యాకుమారి, పొదుచెర్రీ, మహాబలిపురం, చెన్నై మీదుగా సాగిన ఈ యాత్ర జూన్ 1న తిరిగి హైదరాబాద్‌కి చేరుకుంది. ఆరుగులు శిల్పులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తూ ఇన్‌స్పైర్ అయిన అంశాల్ని తమ శిల్పాలకు జోడిస్తూ.. 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి 20 రోజుల తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. జూన్ 2న తాము చెక్కిన శిల్పాలను బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు.
తొలి ప్రయత్నం
ఒక రచయిత మంచి కథ రాయాలంటే ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుంటాడు. ప్రకృతి నుంచి, పరిసరాల నుంచి, పరిస్థితుల నుంచి, రకరకాల సంఘటనల నుంచి స్ఫూరి పొంది రాస్తాడు. అలాగే కళాకారులు కూడా. శిల్ప కళకు సంబంధించి రకరకాల వర్క్‌షాప్‌లు, ఎగ్జిబిషన్లు జరుగుతూనే ఉంటాయి. కానీ.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ శిల్పాలని చెక్కాలన్న ఆలోచన మాత్రం కొత్తది. ఇదే ప్రథమం కూడా. అచల స్టూడియో నిర్వహించిన యాత్ర వెనక క్రియేటివ్ మైండ్ మాత్రం శిల్పి శివరామాచారిది. ఆయన 2002లో అచల స్టూడియో ప్రారంభించి ఎన్నో అధునాతన శిల్పాలను రూపొందించారు. పార్క్ హయత్‌లాంటి పెద్ద పెద్ద హోటళ్లలో ఆయన శిల్పాలిప్పుడు కొలువుతీరి ఉన్నాయి. ఈ యాత్ర గురించి తెలుసుకునే ముందు శివరామాచారి గురించి కూడా కొంత తెలుసుకోవాలి.
వారసత్వమే కానీ..

అధ్యాపకుడిగా..
మోడ్రన్ ఆర్ట్‌లో మరింత ముందడుగు వేసేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శిల్ప కళలో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాడు శివరామాచారి. ఆ చదువు పూర్తయిన తర్వాత అతనికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోనే శిల్పకళా అధ్యాపకుడిగా అవకాశం లభించింది. కొంత కాలం అక్కడ పనిచేసిన తర్వాత 2007లో న్యూఢిల్లీలోని ఇండియన్ హబిటాట్ సెంటర్‌లో తన శిల్పాల్ని ప్రదర్శించాడు. వాటికి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత స్థానికంగా చాలా ప్రదర్శనలిచ్చాడు. దేశవ్యాప్తంగా 25కు పైగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాడు. దీంతో శివరామాచారికి ఒక నేమ్.. ఫేమ్ లభించింది. శివరామాచారి శిల్పాలు ఎక్కువగా ప్రయోగాత్మకంగా ఉంటాయి. క్రియేటివ్‌గా ఉంటాయి. ఆయన ఇప్పటి వరకు 150కిపైగా అద్భుతమైన శిల్పాలను చెక్కారు. పార్క్ హయాత్ ఎంట్రన్స్‌లో ఏర్పాటు చేసి ఫ్లవరింగ్ బ్యూటీ శిల్పం ఆయన తయారు చేసిందే. మొత్తం స్టీలుతో తయారు చేసిన ఆ శిల్పం.. కమలం పువ్వుపై మగువ ఉన్నట్లు అందంగా కనిపిస్తుంది. సింగిల్ మెటల్‌తో అంతటి అందం తీసుకురావడం ఆయన స్టైల్. సైకిల్ విడిభాగాలతో చేసిన ఎఫ్ టీవీ ర్యాంప్, ఆక్రిలిక్‌తో చేసిన 21 ఫస్ట్ సెంచరీ కృష్ణ.. ఇలా ఒక్కో శిల్పం వెనక ఒక కథ ఉంటుంది.
యాత్ర గురించి...
మొబైల్ స్కల్ప్‌చర్ పేరుతో యాత్ర చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందని శివరామాచారిని అడిగితే ఇలా చెప్పారు - ‘కళాకారులు సాధారణంగా కొత్త ప్రాంతాలని, గ్యాలరీలని ఎందుకు సందర్శిస్తుంటారో తెలుసా? ఏదో ఒక ఇన్‌స్పిరేషన్ కోసం. నేను కూడా ఎక్కువగా ప్రకృతిని ఆస్వాదిస్తుంటాను. అందుకే నా శిల్పాల్లో ఎక్కువగా నేచర్ అండ్ నాచురాలిటీ కనిపిస్తుంటుంది. అలా కొత్త ప్రాంతాలను సందర్శించిన స్ఫూర్తి పొందాలని ఏ కళాకారుడైనా కోరుకుంటాడు. దాని నుంచి నాకు ఈ మొబైల్ స్కల్ప్‌చర్ స్టూడియో ఐడియా వచ్చింది. ఈ ఐడియా రెండేళ్ల క్రితమే వచ్చినప్పటికీ దాన్ని ఆచరణలో పెట్టి సాధ్యం చేసేవరకు ఇంత సమయం పట్టింది. మేం కావాల్సినవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడి (హైదరాబాద్) నుంచి బయలు దేరి మొదట బైరవకొండకు చేరుకున్నాం. అక్కడి నుంచి మా యాత్ర ప్రారంభమైంది. మేం ఎంచుకున్న ప్రాంతాలన్నీ శిల్ప కళకు దగ్గరి సంబంధం ఉన్నవి. ప్రతిచోటా మాకు మంచి స్పందన లభించింది. మొదట మేం మనదేశమంతా.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరగాలనుకున్నాం. కానీ అది సాధ్యం కాలేదు. అందుకే మొదటి విడతలో భాగంగా దక్షిణ భారతదేశాన్ని ఎంచుకున్నాం. సక్సెస్ అయింది. సెకండ్, థర్డ్ ఫేజ్‌లలో ఇండియా అంతా తిరగాలన్నది అచల స్టూడియో లక్ష్యం’.
Comments