కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు......  creamకొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు మస్త్ ఉంటాయి... ఇంకొన్నింటి పేర్లు క్రియేటివ్‌గా ఉంటాయి...క్రియేటివిటీలో ఫీల్ ఉంటుంది...అర్థం చేసుకుంటే షాపు బోర్డులోనూ ఫిలాసఫీ ఉంటుంది. అలాంటి పేర్ల మిక్చర్ పొట్లాం.. ఈ మోర్ దాన్ మోర్.

I wandered lonely as a cloud
That floats on high oer vales and hills,
When all at once I saw a crowd,
A host, of golden daffodils;
(నేను ఒంటరిగా ఒక మేఘంలా తిరిగాను. లోయలు, గుట్టల మీదుగా. అప్పుడు నేనొక సమూహాన్ని చూశాను. అందమైన గోల్డెన్ డాఫొడిల్స్ పువ్వులు అవి)
విలియమ్ వర్డ్‌స్మిత్ రాసిన ‘ద డాఫొడిల్స్’ పోయమ్‌లోని మొదటి భాగమిది. ఇంటర్మీడియట్‌లో బట్టీపట్టినట్లు గుర్తు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి యూసుఫ్‌గూడ వెళ్తుంటే వెంకటగిరిలో డాఫోడిల్స్ పేరుతో ఫ్యామిలీ సెలూన్ కనిపిస్తుంది. డాఫొడిల్స్ అంటే మెట్ట తామర పువ్వులు అని అర్థం. పసుపు రంగులో అందంగా ఉంటాయవి. వర్డ్‌స్మిత్‌ని తన్మయ పరిచిన ఆ పువ్వులు సెలూన్ నిర్వాహకులనూ కదిలించి ఉంటాయి. అందుకే డిఫంట్‌గా ఉండాలని ఆ పేరు పెట్టారేమో. చూసే మనసు.. వెతికే కళ్లు ఉండాలిగానీ.. అలాంటి విభిన్నమైన పేర్లున్న దుకాణాలు మీ ఊరిలో.. మీ పట్టణంలో కూడా చాలానే కనిపిస్తాయి. అలా ఒంటరిగా.. ఒక మేఘంలా రాజధానిలో తిరిగితే అలాంటివి చాలానే కనిపించాయి.

ఫ్యాషన్ స్టోర్స్
dressచాలామంది ఫ్యాషన్ డిజైనర్లు తమ సొంత పేర్లతోనే లేబుల్స్‌ని ప్రారంభించి బొటిక్‌లను ఏర్పాటు చేస్తుంటారు. గణేష్ నల్లారి, జ్యువెలరీ డిజైనర్ సుహానీ పిట్టిలకు ఇలాంటి బొటిక్‌లే ఉన్నాయి. కానీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెనకాల ఎన్వీ (envy) పేరుతో స్టైలింగ్ లాంజ్ ఉంది. ఆర్య2 సినిమాకి స్టైలింగ్ చేసిన అశ్విన్ మావ్లేది ఈ బొటిక్. ఎన్వీ అంటే అసూయ. ‘ఎన్వీ’లో దుస్తులు వేసుకుంటే ఎదుటివారికి అసూయ పుడుతుందన్నది మావ్లే కాన్సెప్ట్. జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 19లో ‘దర్జీ’ పేరుతో ఇంకో బొటిక్ ఉంది. సానియా మీర్జా పెళ్లికి డ్రెస్ డిజైన్ చేసిన ఉదయ్ శంకర్‌ది ఈ బొటిక్. ఫ్యాషన్ డిజైనింగ్.. ‘దర్జీ’ పని అని దర్జాగా చెప్పుకోవడం ఆయన స్టైల్. బంజారాహిల్స్ ఏఎన్‌ఆర్ జంక్షన్‌లో క్రిసాలా(krsala) జ్యువెలరీ ఉంది. నాగవల్లి సినిమాకి నగలు డిజైన్ చేసిన బంటి బజాజ్ తనకు ఇష్టమైన శ్రీకృష్ణుడి పేరు మీద క్రిసాలా బొటిక్‌ని ప్రారంభించారు. ఇంగ్లీష్ క్రిసాలాలో ఐ(i) లేకుండా బొటిక్ పేరు రాసుకోవడం ఆమె క్రియేటివిటి.

క్లాత్‌స్టోర్స్
fidaచైతన్యపురి ‘కళానికేతన్’కు పక్కన ‘సెకండ్ స్కిన్’ అనే బట్టల దుకాణం ఉంది. వారి బట్టలు మీకు రెండో చర్మమట. ఇదే పేరుతో బంజారాహిల్స్‌లో కూడా ఒక ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ఉంది. పెన్షన్ హౌస్ చౌరస్తాలో ‘స్కిన్ టచ్’ అని ఒక శారీ సెంటర్ కనిపిస్తుంది. దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, సికింవూదాబాద్‌లలో ఆర్‌ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్, చందన బ్రదర్స్.. ఇప్పుడు కామన్‌గా కనిపిస్తున్నాయి. బ్రదర్స్ కలిసి బట్టల దుకాణం పెడితే ఆ బ్రదర్స్.. ఈ బ్రదర్స్ అని పేరు పెట్టుకుంటారు.. కానీ ఇద్దరు స్నేహితులు కలిసి బిజినెస్ ప్రారంభిస్తే కెకె ఫ్రెండ్స్ అని, ఆర్‌సీ ఫ్రెండ్స్ అని ఎందుకు పెట్టుకోరో? దిల్‌సుఖ్ నగర్ వెంకటాద్రి థియేటర్ దగ్గరలో ‘న్యూ డ్రెస్ కోడ్’ అనే దుకాణం కొత్త డ్రెస్ కోడ్‌ని పరిచయం చేస్తోంది. చందన బ్రదర్స్ పక్కన ‘ది బ్రాండ్ స్ట్రీట్.. ఓన్లీ ఫర్ హీ’ అంటూ అబ్బాయిల్ని ఆకట్టుకుంటోంది. సుల్తాన్ బజార్‌లో ‘లగ్న’ అనే వెడ్డింగ్ వేర్ బొటిక్ డీసెంట్‌గా ఉంది. బేగం పేటలో ‘దారం’ అనే పేరుతో ఒక బొటిక్ ఉన్నట్లు ఆ‘ధారాలు’న్నాయి. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న మీనా బజార్ బట్టల దుకాణాన్ని ట్రెండీగా మార్చి ‘మీబాజ్’ అనే పేరు పెట్టారు. మీబాజ్ అంటే కూడా మీనా బజారే.. షార్ట్‌కట్.

జస్ట్ ఫర్ కిడ్స్
పిల్లల కోసం బొమ్మలు, దుస్తులు లభించే ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు ఈ మధ్య నగరాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలక్‌పేట ‘యశోద’కి దగ్గరలో మామ్ అండ్ మీ పేరుతో ఒక స్టోర్ ఉంది. ఇదే పేరుతో హిమాయత్ నగర్‌లో కూడా ఇంకో స్టోర్ ఉంది. కాకపోతే దీని ట్యాగ్‌లైనే డిఫంట్‌గా ఉంటుంది. everything a baby needs.. except MOM. (పిల్లలకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి.. ఒక తల్లి తప్ప) వాహ్.. బావుంది కదా. హిమాయత్‌నగర్‌లో ‘టీటీడీ’కి దగ్గర్లో ‘టాయ్ అండ్ జాయ్ ఫర్ కిడ్స్’ అని, బార్న్ అండ్ బిహాండ్... ది కిడ్స్ స్టోర్‌లు ఉన్నాయి. టి అండ్ జె ఫర్ కిడ్స్ పేరుతోనే బేగంపేటలో ఇంకో స్టోర్ ఉంది. జస్ట్ ఫర్ యు అని సికింవూదాబాద్ ప్యాట్నీ సెంటర్‌కి దగ్గర్లో, హైదర్‌గూడలో ‘బేబీ షాప్’ అని, చైతన్యపురిలో ‘జస్ట్‌బార్న్’ని.. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చెక్‌పోస్ట్ వెళ్తుంటే టాయ్స్ అండ్ మోర్ (toys n more.. the complete sports store) అని చాలా స్టోర్‌లు ఉన్నాయి.
mom
హిమాయత్‌నగర్ ప్లానెట్
క్రియేటివ్.. ఫన్నీగా పేర్లున్న దుకాణాలకు హిమాయత్‌నగర్ ఒక ప్లానెట్ అనొచ్చు. ఎందుకంటే విల్స్ లైఫ్ స్టైల్‌కి ఎదురుగా కనిపించే ‘ప్లానెట్ ఎం’ని చూస్తే అలా అనిపిస్తోంది. ‘ఎం’ అంటే ఏంటో అర్థమయ్యేందుకు దానికింద ట్యాగ్‌లైన్ ఉంటుంది. మొబైల్స్, మ్యూజిక్, మూవీస్ అని . ప్లానెట్ ఎం దాటి కాస్త ముందుకు వెళ్లగానే ‘క్రీమ్ స్టోన్ కాన్సెప్ట్స్’ అనే ఐస్‌క్షికీమ్ పార్లర్ కనిపిస్తుంది. ఫ్రీజ్ యువర్ ఇమాజినేషన్స్ అనేది దాని ట్యాగ్‌లైన్. దాని పక్కనే ‘ఫ్రూటోహాలిక్’ అనే జ్యూస్ పాయింట్. ఫలాలకు దాని రసాలకు బానిసలవ్వండని దాని అర్థం కాబోలు. తర్వాత ‘బేలీజా’ ఫాలో ది ట్రెండ్ అంటూ ఒక జ్యువెలరీ దుకాణం. ‘వి’ డ్రెసప్ యువర్ డ్రీమ్స్ అంటూ ఎక్స్‌క్లూజివ్ విమెన్ కుర్తీల షాపు.. ‘డ్యూక్’ పక్కనే ‘లైక్.మీ’ అనే ఏసీ హెయిర్‌వూడెస్సింగ్ సెలూన్, బ్రాండ్ ఫ్యాక్టరీ ఎదురుగా కేక్ బ్యాంక్, ఫిదా.. ది అర్బన్ ఎథిక్ వేర్ అని.. ఇలా చాలానే ఉన్నాయి. హిమాయత్‌నగర్ నుంచి నారాయణగూడ ఫ్లై ఓవర్ ఎక్కుతుంటే కుడివైపు ‘దోశ అడ్డా’ అని ఒక హోటల్ కనిపిస్తుంది. సింపుల్‌గా ఎంత బావుందో కదా ఈ పేరు. టిఫిన్స్, మీల్స్, చాట్ అనేది దాని ట్యాగ్‌లైన్.

కర్టెసీ కాచిగూడ
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రాళ్లు మంచి దుస్తులు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కువగా కాచిగూడకు వెళ్తుంటారు. వారిని ఆకట్టుకునేందుకు ఆ బట్టల దుకాణాల పేర్లు కూడా అలానే ఉంటాయి. నారాయణగూడ బ్లడ్‌బ్యాంక్‌కు ఎదురుగా.. ధూమ్.. ద ఫ్యాషన్ స్టోర్ దుమ్ములేపే దుస్తులున్నాయంటోంది. ఆప్షన్స్.. మేక్ ఏ పర్ఫెక్ట్ మ్యాచింగ్.. మీరు దుస్తులు సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్నో ఆప్షన్స్ మా దగ్గర ఉన్నాయంటోంది. న్యూ ఏజ్.. ద ఫ్యాషన్ ఎరా.. కొత్త ఫ్యాషన్లను ఇస్తానంటోంది. ‘ఆజ్ తక్’లో ఇప్పటి వరకు దొరకనివి అందుబాటులో ఉంటాయట. డబుల్ ఎఫ్.. ఫీల్ ద ఫ్యాషన్ అని ఆర్యా స్టైల్‌లో ఆకర్షిస్తోంది. స్మార్టీ, నాటీ, బ్యాచ్‌లర్, ఎండబ్ల్యూ (మెన్స్ వేర్), హాట్‌స్పాట్, సస్పెన్స్, థ్రిల్లర్.. ఇలా రకరకాల బట్టల దుకాణాలు క్రియేటివ్ టైటిల్స్‌తో అదరగొడుతున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్‌కి ఎదురుగా ఉండే టూరిస్ట్ ప్లాజాలో ఒక హోటల్‌కి ‘ఈట్స్ అండ్ డ్రింగ్స్.. తినేవి తాగేవి’ అని తమాషాగా పేరు పెట్టారు.
planet
ఏ1 హోటల్స్
దిల్‌సుఖ్ నగర్ మెగా థియేటర్ పక్కన గ్రీన్ బావర్చీ హోటల్ ఉంది. అక్కడి నుంచి మలక్‌పేట వైపు కాస్త ముందుకు వస్తే ముసారంబాగ్ చౌరస్తాలో ‘గ్రాండ్ బవార్చీ’ ఉంది. ఆటోనగర్ దగ్గరలో కూడా గ్రాండ్ బవార్చీ హోటల్ ఉంది. ఇదే పేరుతో నగరంలో చాలా హోటల్స్ ఉన్నాయి. చాలామంది ఇవన్నీ ఒరిజినల్ బావర్చీ హోటల్సే అనుకుంటారు. అసలు బవార్చీ ఉన్నది ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌లో. ‘గమనిక : మాకు ఇంకెక్కడా బ్రాంచీలు లేవు’ అనే బోర్డు ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని బావర్చీ హోటల్ గోడకు వేలాడుతూ ఉంటుంది. ఆ బావర్చీకి ఉన్న నేమ్‌ని, ఫేమ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇలాంటి పేర్లు పెడుతుంటారు కొందరు. బావర్చీ అక్షరాల సైజు కంటే గ్రీన్, గ్రాండ్ అనే అక్షరాలు సగంలో సగం తక్కువగా రాసి ఉంటాయి. బేగం పేటలో ‘వై..ఫై లంచ్’ పేరుతో ఒక హైఫై రెస్టాంట్ ఉంది. వెజ్ ప్లేటు మీల్సు.. జస్ట్ 149 రూపాయలే. వెంకీస్ ఎక్స్‌వూపెస్‌లో ఎక్స్‌వూపెస్ స్పెల్లింగ్‌ని ఎక్స్..పీ..ఆర్..ఎస్ అని మాత్రమే రాస్తారు. ఇదీ షార్ట్‌కటే మరి. బరిస్తా, ది క్లే పాట్ అనే కాఫీ షాప్‌లు, దస్‌పల్లా, కంకీస్, చట్నీస్, సిల్వర్ స్పూన్.. లాంటి ఇన్నోవేటివ్ పేర్లతో చాలా రెస్టాంట్లు ఉన్నాయి.

హైటెక్కు.. కిక్కు..
బిగ్ సీ అనేది మొబైల్ ఫోన్లు అమ్మే సంస్థ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బిగ్ సీ’లో ‘బిగ్’ కంటే ‘సీ’ పెద్దగా రాసి ఉండి ఆకట్టుకుంటోంది. సీ ఫర్ సెల్ అన్నమాట. యూనివర్‌‘సెల్’లోనే ‘సెల్’ ఉంది. ‘సెల్ వరల్డ్’లో సెల్‌లో ‘సీ’ వరల్డ్‌లో ‘డీ’లను బ్రాకెట్‌లుగా మార్చి సెల్ వరల్డ్‌ని అందులో బంధించారు. ఇదీ డిఫంట్ లుక్ కోసమే. సైన్ ఇన్, జస్ట్ సైనప్ అనేవి రాంనగర్, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇంటర్‌నెట్ కేఫ్‌ల పేర్లు. నెట్ నాలెడ్జ్, మిరాకిల్ సైబర్, వెబ్ కాఫీ, నెట్ కేఫ్, కనెక్ట్, ఆన్‌లైన్ అనేవి కూడా అక్కడక్కడా కనిపించే ఇంటర్‌నెట్ సెంటర్లు. చాలా బార్లు, వైన్ షాపులకు బాలాజీ, వెంక కనకదుర్గ, శ్రీరామ అని దేవుళ్ల పేర్లే ఉంటాయి. కోఠీలోని ‘బగ్గా వైన్స్’ గురించి ‘బగ్గా’ అని చెబితే చాలు.. వైన్స్ అని ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. బగ్గా అంత పాపులర్ అన్నమాట. సికింవూదాబాద్ క్లాక్‌టవర్ దగ్గరలో ‘మధుశాల’ అనే బార్ రామాయణంలో ‘పర్ణశాల’ రేంజ్‌లో ఉంటుంది. ఇదే పేరుతో నాగోల్‌లో ఒకటి, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి దగ్గరలో ఒకటి ఉన్నాయి. బేగంపేటలో బీ అండ్ సీ(బాటిల్స్ అండ్ చిమ్నీస్) అనే ఇంటర్నేషనల్ నైట్ క్లబ్ పేరు చూడండి... ఎంత పా...ష్‌గా ఉందో! టచ్ పబ్‌ను, ఫ్యూజన్ pandu లాంటి పేర్లని బడాబాబులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్
పెద్ద చేపలు వచ్చి చిన్న చేపల్ని మింగేసినట్లు.. సూపర్‌మ్కాట్లు చిన్న చిన్న కిరాణషాపుల్ని దెబ్బతీస్తున్నాయి. మొహిదీపట్నంకు దగ్గర్లోని అత్తాపూర్‌లో అలాంటి ఒక సూపర్ మార్కెటే ‘మోర్’. ఆదిత్యా బిర్లా గ్రూప్ వారి మోర్ స్టోర్‌లు హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్రమంతటా ఉన్నాయి. కానీ అత్తాపూర్ మోర్ గురించి ఎందుకు చెబుతున్నామంటే.. అక్కడొక చిన్న కిరాణ షాపు ఉండేది.. ‘మోర్’ రంగవూపవేశంతో ఆ ‘చిన్న చేప’ విలవిలలాడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆలోచించింది. ఆలోచించింది.. ఒక షార్క్‌లాంటి స్పార్క్.. జస్ట్ తన పేరు మార్చుకుంది. ఏమనో తెలుసా? ‘మోర్ దాన్ మోర్’ అని. వాహ్.. ఆసమ్ ఐడియా.. రెండూ ఒకేరకమైన దుకాణాలు పక్కపక్కన ఉండొచ్చు.. కానీ ఒకే పేరుతో ఉన్న దుకాణాలు ఎక్కడా కనిపించవు. అందుకే ఈ ఒకదానికి మించి ఒక పేరు.

‘టీ’ ఫ్లేవర్
-పనామా నుంచి వనస్థలిపురం గణేష్ టెంపుల్‌కి వెళ్తుంటే.. అచ్చ తెలంగాణ పేరుతో ‘సింగిడీ’ అనే రెస్టాంట్ ఉంది.
-న్యూ నల్లకుంటలో ‘తెలంగాణ రుచులు’ అనే పేరుతో హోటల్ ఉంది.
కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు...... కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు...... Reviewed by Chanti on June 30, 2012 Rating: 5

2 comments

మాలా కుమార్ said...

చాలా రీసర్చ్ చేసారే .

Anonymous said...

Baagundi!
Just going thru other articles some of them are very nice.
keep going.

Surabhi