ఈ గిఫ్టులను ఒకసారి చూడాల్సిందే..

By | June 25, 2012 Leave a Comment

మనం ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు.. ఇచ్చిన దాంట్లో మన ప్రేమ ఎంత ఉందన్నది ముఖ్యం అంటారు మదర్ థెరిసా. కానుక చిన్నదైనా పెద్దదైనా.. మనం ఇచ్చే వ్యక్తిపట్ల మనకున్న ఇష్టం, ప్రేమ కనిపించాలి. అలాంటి ఎఫర్ట్ ఏదో పెట్టాలి. అప్పుడే ఆ గిఫ్ట్ వారి మనసులో అలా జీవితాంతం నిలిచిపోతుంది. అలాంటి గిఫ్ట్‌ల గురించి చాలా మంది గూగుల్‌లో ఎప్పుడూ సెర్చ్ చేస్తూనే ఉంటారు. రకరకాల గిఫ్ట్‌లు ఉండొచ్చు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా రెండు విషయాల్ని తప్పకుండా ఇష్టపడతారట. ఏంటవి? 1. పేరు 2. ఫోటో. నా పేరు నాకు తప్పకుండా నచ్చుకుంది. అలాగే ఫోటో కూడా. కాకి పిల్ల కాకికి ముద్దు టైప్ అన్నమాట. అందుకే ఈ రెండింటినీ మిక్స్ చేసి గిఫ్ట్‌గా ప్యాక్ చేస్తే..?! కెవ్వు కేక.. అలాంటి గిఫ్ట్‌లనే ఇక్కడ ఇచ్చాం. హ్యావ్ ఏ లుక్.

స్పీకింగ్ ఫ్లవర్స్
అమ్మ.. ఆవకాయ.. గులాబీ పువ్వు... నచ్చని వాళ్లు ఎవరైనా ఉంటారా? కాస్ట్‌లీ కాకుండా సింపుల్‌గా ఏదైనా ఇవ్వాలనే కాన్సెప్ట్ ఉంటే గులాబీ పువ్వే కరెక్ట్. ఇది నిన్నటి వరకు. కానీ ఇప్పుడు గులాబీ పువ్వులకు కూడా కాస్త క్రియేటివ్ టచ్ ఇవ్వొచ్చు. మీరొకరికి ‘సారీ’ చెప్పాలనుకున్నారు. సింపుల్‌గా సారీ అని చెప్పడం కంటే ‘సారీ’ అని గులాబీ రేకులపై రాసి ఉన్న పువ్వుని ఇస్తే ఎలా ఉంటుంది? మీరడిగిన క్షమాపణకు ఒక అర్థం ఉంటుంది. మీ జీవితంలో, ఎదుటివారి జీవితంలో ఆ పువ్వు అలా గుర్తుండిపోతుంది. ఒకరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలి. వారి ఫోటో కూడా పువ్వుపై ప్రింట్ చేసి విషెస్ చెబితే వారికొచ్చిన అన్ని గిఫ్ట్‌లలో మీ గిఫ్టే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. కరెక్టే! కానీ గులాబీ పువ్వుపై ప్రింట్ చేయడం కుదురుతుందా? ఆ డౌటే అక్కర్లేదు. ఎందుకంటే మీరు ఉదయ్‌ని కలిసిన తర్వాత ఆ అనుమానం రాదు.

మీట్ మిస్టర్
సికింద్రాబాద్‌లోని వైస్రాయ్ గార్డెన్స్‌లో ఇప్పుడొక ఎగ్జిబిషన్ నడుస్తోంది. అందులో ఒక స్టాల్‌పై ‘స్పీకింగ్ ఫ్లవర్స్’ అని రాసి ఉంది. ఆ స్టాల్‌లోని గులాబీ పువ్వులను పరిశీలిస్తే ఇలాంటి క్యాప్షన్లు ఉన్నవి ఎన్నో కనిపిస్తాయి. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, హ్యాపీ బర్త్‌డే డియర్ ఫ్రెండ్, హ్యాపీ యానివర్సరీ.. అని రకరకాల రోజ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. కొన్నింటిపై ఫోటోలు కూడా ఉంటాయి. పువ్వులపై కొటేషన్స్ ప్రింట్ చేయాలన్న ఐడియా ఉదయ్‌ది. ఆరేళ్ల క్రితం ఆయనకు ఈ ఐడియా వచ్చింది. కానీ అలా రాయడం సాధ్యమవుతుందా? ప్రయత్నం మొదలుపెట్టాడు. వాటర్ కలర్స్ ఉపయోగించి కంప్యూటర్ ఆధారంగా డిజైన్ చేసి పువ్వులపై అక్షరాల్ని ప్రింట్ చేసే పద్ధతిని కనిపెట్టాడు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా హార్డ్‌వేర్‌ని కూడా తయారు చేసుకున్నాడు. ఈ ఐడియా ఆచరణలో పెట్టిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. మన రాష్ట్రంలో ఉన్న ఏకైక స్టోర్ కూడా అతనిదే. అసలు ఆ పువ్వులకు ఆదరణ ఉంటుందా? అనుమానాకి ఇప్పుడు ఆరేళ్ల అనుభవం తోడైంది. ఏంతో ఆదరణ లభించింది. పెద్ద పెద్ద సినిమా ఫంక్షన్లకు కూడా పువ్వులు సరఫరా చేసే స్థాయికి ఉదయ్ ఎదిగాడు. శ్రీరామరాజ్యం, మగధీర సినిమా ఫంక్షన్లకు బొమ్మలు వేసిన గులాబీ పువ్వులను ఉదయ్ సప్లై చేశాడు. అల్లు అర్జున్ పెళ్లికి, హీరో రవితేజకు, హీరోయిన్ తమన్నాకు కూడా ప్రత్యేకమైన బొకేలు తయారుచేసి ఇచ్చాడు.
 
ఎంతవుతుంది?
ఒక పువ్వు మీద మనకు నచ్చిన కొటేషన్ రాయించుకోవడానికి ఎంత ఖర్చవుతుంది? అంటే 150 రూపాయల నుంచి మొదలవుతుంది. ఒక పువ్వుపై మూడు పదాల వాక్యాన్ని ప్రింట్ చేయొచ్చు. నాలుగైదు పదాలు కావాలంటే కాస్త ఖర్చు ఎక్కువవుతుంది. ఫోటో ప్రింట్ చేయించుకోవాలంటే ఇంకాస్త ఎక్కువవుతుంది. ‘బొకే’ కావాలంటే పూల సంఖ్యని బట్టి ధర ఉంటుంది.
- ఉదయ్ (సెల్ : 92473 93151)

ఫోటో మానియా
ఫోటో ప్రింట్ చేసే గిఫ్ట్‌ల్లో చాలా వెరైటీలు ఉన్నాయి. రూబిక్స్ క్యూబ్ రంగు రంగులుగా ఉంటుంది. దీన్ని పిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే రంగులకు బదులు వారి ఫోటోల్ని ప్రింట్ చేయించి దాన్ని గిఫ్ట్‌గా ఇస్తే వారు చాలా సంతోషిస్తారు. అలాగే రకరకాల మ్యాచింగ్ పజిల్స్ కూడా. టెడ్డీబేర్‌లను కూడా పర్సనలైజ్డ్ చేసి అమ్ముతున్నారు. అది వేసుకున్న డ్రెస్‌పై మీ పేరు, ఫోటోని అచ్చు వేయించుకోవచ్చు. కాఫీ మగ్‌పై, మౌస్‌ప్యాడ్‌లపై కూడా ఫోటోల్ని ప్రింట్ చేయించి గిఫ్ట్‌గా ఇస్తే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. మీ పేర్లతో కీచెయిన్‌లు తయారు చేసే షాపులు జాతరలలో, ఎగ్జిబిషన్లలో అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటారు. మీ ఫోటోలతో కీచైన్లు కూడా తయారు చేయించుకోవచ్చు. ఈ గిఫ్ట్‌లు ఎక్కడ దొరుకుతాయంటే కాస్త కష్టమే. ప్రత్యేకమైన స్టోర్‌లు తక్కువగానే ఉన్నా ఆన్‌లైన్ స్టోర్‌లు చాలానే ఉన్నాయి. మీరు ఫోటో పంపించి ఆర్డర్ ఇస్తే చాలు మీకు కావాల్సిన గిఫ్ట్‌ని నేరుగా మీ చెంతకే పంపిస్తారు. అలాంటి వెబ్‌సైట్ల లిస్ట్ ఇచ్చాం చూడండి.

ఆన్‌లైన్ స్టోర్స్
www.picturebite.com
www.craftmygift.com
www.indiangiftsportal.com
www.ourshop.in
www.pringoo.com
www.printbooth.in
www.picsquare.com












 

0 comments: