కంపేర్ చేసుకోవడానికి ఇవి కంఫర్ట్‌గా ఉంటాయి

By | June 26, 2012 Leave a Comment

మీరొక మొబైల్ ఫోన్ కొనాలనుకున్నారు. ఏది కొంటారు? ఏ కంపెనీది బావుంటుంది? దేంట్లో మీకు కావాల్సిన ఫీచర్లు ఉంటాయి? అవే ఫీచర్లు ఉన్న ఫోన్ ఏ కంపెనీది తక్కువకు దొరుకుతుంది?.. ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఒక్క క్లిక్‌తో సమాధానాలు వెతకొచ్చు. అదే ప్రొడక్ట్స్ కంపారిజన్. ఒక గాడ్జెట్‌ని ఇంకో గాడ్జెట్‌తో పోల్చుకోవడం. అందుకు ఉపయోగపడే వెబ్‌సైట్లే ఇవి. టీవీ, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పీసీ.. వస్తువు ఏదైనా.. కంపేర్ చేసుకోవడానికి ఇవి కంఫర్ట్‌గా ఉంటాయి.

సీనెట్ రివ్యూస్
https://reviews.cnet.com
ఇది కూడా చాలా పాపులర్ వెబ్‌సైట్. ఇందులో వినియోగదారుల రివ్యూలతోపాటు, నిపుణుల అభివూపాయాలు కూడా జతచేసి ఉంటాయి. నిపుణులు స్వతాహాగా వాడిన తర్వాతే రివ్యూ రాస్తారు. దీన్ని బట్టే ప్రొడక్ట్స్ పట్ల ఇందులోని అభివూపాయాలను ఎంతవరకు నమ్మొచ్చో అర్థమవుతుంది.

ప్రోన్టో
www.pronto.com
‘బెస్ట్ ఆన్‌లైన్ ప్రైస్ కంపారిజన్ వెబ్‌సైట్’గా కిప్‌లింగర్ కంపెనీ ప్రోన్టో వెబ్‌సైట్‌ని గుర్తించింది. ఓవర్ స్టేట్‌మెంట్‌ల కంటే ఫ్యాక్ట్స్‌కే ఇందులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. 70 మిలియన్ల ఉత్పత్తులకు సంబంధించిన రివ్యూలున్నాయి. రెండున్నర లక్షల ఆన్‌లైన్ సెల్లర్స్‌తో ఈ సైట్‌కు అనుబంధాలున్నాయి. అత్యంత తక్కువ ధరలో లభించే ఉత్పత్తులు ఇందులో మీకు దొరుకుతాయి.

నెక్స్‌ట్యాగ్
www.nextag.com
ఏదైనా వస్తువు కొనే ముందు దీన్నొకసారి తప్పకుండా చూడాల్సిందే. దీంట్లో ఉండే సెర్చ్ ఆప్షన్ ద్వారా నారో డౌన్ చేసుకోవచ్చు. దీంట్లో మీరొక ప్రైస్ అలర్ట్‌ని సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఐదు వేల రూపాయలకు ఒక కంపెనీ నుంచి మీకు కావాల్సిన ఫీచర్లతో ఫోన్ కావాలనుకోండి మీకు వెంటనే మెసేజ్ అందుతుంది.

ప్రైస్న్న్రర్
www.pricerunner.co.uk
ఈ వెబ్‌సైట్‌లో వినియోగదారుల రివ్యూలే కాకుండా ఎక్స్‌పర్ట్‌లు అందించిన రివ్యూలు కూడా అందుబాటులో ఉంటాయి. సైడ్ బై సైడ్ రివ్యూలను పొందుపర్చడం ద్వారా కంపేర్ చేయడం సులభమవుతుంది. మీరు ఏది ఎంచుకోవాలో ఇట్టే అర్థమైపోతుంది.
Tech02 talangana patrika telangana culture telangana politics telangana cinema
అలాటెస్ట్
https://alatest.com
యూజర్ ఫ్రెండ్లీ హోమ్‌పేజీ, సెర్చ్ సజెషన్ సర్వీస్ దీనిలోని ప్రత్యేకతలు. ఈ సర్వీసు ద్వారా ఒక వస్తువు ధరని రకరకాల స్టోర్‌లలో ఎన్ని రూపాయలకు లభిస్తుందో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి తక్కువ ధరలో ఏ స్టోర్‌లో అందుబాటులో ఉందో అక్కడి నుంచి కొనుగోలు చేయొచ్చు. యూజర్ రేటింగ్స్, రివ్యూలు కూడా ఇందులో ఉంటాయి.

కన్జ్యూమర్‌సెర్చ్
www.consumersearch.com
మిగిలిన వెబ్‌సైట్ల కంటే ఇది కాస్త భిన్నమైనది. దీంట్లో ప్రొడక్ట్ కంపారిజన్ సర్వీస్ కాకుండా వినియోగదారులు అందించే రివ్యూలను కూడా చూడొచ్చు. అన్ని రివ్యూలను పరిశీలించిన తర్వాత మీకు కావాల్సిన వస్తువు పట్ల ఒక కచ్చితమైన అవగాహన ఏర్పడుతుంది.

ప్రైస్‌క్షిగాబర్
www.pricegrabber.com
వినియోగదారులు ఇందులో ఒక ప్రొడక్ట్‌కి సంబంధించిన రివ్యూని యాడ్ చేయొచ్చు. రేటింగ్‌ని ఇవ్వొచ్చు. ఇలా రకరకాల రివ్యూల ద్వారా మీరు ప్రొడక్ట్ గురించి ఎక్కువ సమాచారాన్ని పొందొచ్చు. సైడ్ బార్ ద్వారా ఇప్పుడు మీరు వెతికిన అంశానికి సంబంధించిన సమాచారం తర్వాత కూడా లభిస్తుంది.

ఎపీనియన్స్
www.epinions.com
బెస్ట్ కంపారిజన్ వెబ్‌సైట్ల లిస్ట్‌లో ఈ సైట్ కూడా లీడింగ్‌లో ఉంది. ఇందులో మీకు నచ్చిన ప్రొడక్ట్ ఎంత పాపులర్, ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందుతోందిలాంటి వివరాలు కూడా లభిస్తాయి. 30 డిఫంట్ కేటగిరీల్లో లభించే మిలియన్ల కొద్ది రివ్యూల ద్వారా మీకు కావాల్సిన కచ్చితమైన ప్రొడక్ట్‌ని ఎంచుకోవడానికి ఇదో గ్రేట్ ప్లేస్.

బజ్జీలియన్స్
www.buzzillions.com
ఇందులో 17 మిలియన్ల ప్రొడక్ట్ రివ్యూలు ఉన్నాయి. రకరకాల కేటగిరీల్లో వీటిని పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్ కచ్చితమైన ఆన్‌లైన్ షాపింగ్ టూల్స్‌ని అందిస్తోంది. వినియోగదారుల అభివూపాయాల ఆధారంగా ప్రొడక్ట్స్ రివ్యూలు రాయడం వల్ల వస్తువుల పట్ల విశ్వసనీయత ఉంటుంది. మంచి నాణ్యమైన వస్తువుని పొందామన్న తృప్తి మిగులుతుంది.

బిజ్‌రేట్
www.bizrate.com
ఇది పాత వెబ్‌సైటే కానీ చాలా పాపులర్ వెబ్‌సైట్. ముఖ్యంగా ప్రైజ్ కంపారిజన్ దీంట్లో ప్రత్యేకం. అందుకే దీనికి బిజ్‌రేట్ అనే పేరు కచ్చితంగా సరిపోతుంది. కచ్చితమైన ధరల్ని కంపేర్ చేయడం దీని స్టైల్. ధరల్ని అంచనా వేయడంతో పాటు నాణ్యత, కస్టమర్ సర్వీసులు కూడా వేల కొలది రిటైలర్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

0 comments: