అద్భుతమైన ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు

By | June 28, 2012 Leave a Comment


టెక్నాలజీ స్లిమ్ అయిపోతోంది. కంప్యూటర్ కూడా మొబైల్ ఫోన్లోకి మారిపోతోంది. అయినా పీసీ స్టైల్ పీసీదే. అందుకే పర్సనల్ కంప్యూటర్లలో ఇంకా కొత్తవి, ఆధునాతనమైనవి వస్తూనే ఉన్నాయి. ఒక హైఫై పర్సనల్ కంప్యూటర్ కావాలంటే కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి? ఒకటి రెండు కాదు.. అన్ని ఫీచర్లు, అద్భుతమైన వేగంతో పనిచేసే కంప్యూటర్లు ఉంటాయా? ఉంటాయి... అవే ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు. 
B520_H talangana patrika telangana culture telangana politics telangana cinemaలెనోవా ఐడియా సెంటర్ బీ520 
23 అంగుళాల ఫుల్ హెచ్‌డీ 3డీ డిస్‌ప్లే గల ఈ కంప్యూటర్‌లాంటి కంప్యూటర్‌ని మీరు చూసి ఉండరు. దీని అద్భుతమైన పెర్మామెన్స్, స్పీడును బట్టి ఇదో బెస్ట్ ఆల్ ఇన్ వన్ కంప్యూటర్‌గా చెప్పొచ్చు. 
ప్రాసెసర్ : 3.40 జీహెచ్‌జెడ్ ఇంటెల్ కోర్ ఐ7-2600 
ర్యామ్ : 8జీబీ డీడీఆర్3 ఎస్‌డీ
హార్డ్‌డ్రైవ్ : 2 టీబీ (7200 ఆర్‌పీఎం)
కెమెరా : ఉంది
ప్లస్‌లు : టీవీ ట్యూనర్, 3డీ ఫీచర్స్, కార్డ్ రీడర్, హెచ్‌డీఎంఐ ఇన్‌పుట్ అవుట్‌పుట్.
మైనస్‌లు : యూఎస్‌బీ 3.0 పోర్టులు లేవు. 
ధర : $ 1037, ₹ 59,200

Samsung0 talangana patrika telangana culture telangana politics telangana cinemaస్యామ్‌సంగ్ సిరీస్ 7 ఆల్ ఇన్ వన్ 
స్యామ్‌సంగ్ కంపెనీ రూపొందించిన ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లలో సిరీస్ 7 ఒకటి. దీన్నే డీపీ700ఏ3బీ పేరుతో కూడా పిలుస్తారు. 23 అంగుళాల ఫుల్ హెచ్‌డీ టచ్ స్క్రీన్, మంచి మల్టీమీడియా కన్సోల్ దీని సొంతం. 
ప్రాసెసర్ : 2.7 జీహెచ్‌జెడ్ (అప్ టు 3.5 జీహెచ్‌జెడ్) ఇంటెల్ సెకండ్ జనరేషన్ కోర్ ఐ5 ఐ5-2390టీ 
ర్యామ్ : 8జీబీ డీడీఆర్3 మెమరీ
హార్డ్‌డ్రైవ్ : 1 టెర్రా బైట్ (7200 ఆర్‌పీఎం) శాటా
కెమెరా : 1.3 మెగా పిక్సెల్స్ 
ప్లస్‌లు : డిస్‌ప్లే, డిజైన్, అవుట్‌పుట్, యూఎస్‌బీ 3.0
మైనస్‌లు : దీని ధరలోనే లభించే ఇతర కంప్యూటర్లతో పోలిస్తే వీడియో కాపబిలిటీస్ తక్కువ. బ్లూరే డిస్క్ లేదు. 
ధర : $ 1149, ₹ 65,600

Apple-iM talangana patrika telangana culture telangana politics telangana cinemaయాపిల్ ఐమ్యాక్ 21.5 
అసలు ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లను మొదట తయారు చేసిందే యాపిల్ కంపెనీ. యాపిల్ ఆల్ ఇన్ వన్ ఐమ్యాక్‌లలో 27 అంగుళాలది, 21.5 అంగుళాలది.. రెండున్నాయి. ఇవి 21.5 అంగుళాల కంప్యూటర్ ఫీచర్లు. 
ప్రాసెసర్ : 2.7 జీహెచ్‌జెడ్ క్వాడ్ కోర్ ఇంటెల్ కోర్ ఐ5 
ర్యామ్ : 4 జీబీ డీడీఆర్3
హార్డ్‌డ్రైవ్ : 1 టీబీ (7200ఆర్‌పీఎం)
కెమెరా : ఫేస్‌టైమ్ హెచ్‌డీ
ప్లస్‌లు : యాపిల్ బ్రాండెడ్ క్వాలిటీ, బ్యూటీఫుల్ డిజైన్, గుడ్ పెర్మామెన్స్.
మైనస్‌లు : ధర.
ధర : $ 1132 ₹ 64,700

hp_z1_S talangana patrika telangana culture telangana politics telangana cinemaహెచ్‌పీ జెడ్1 వర్క్‌స్టేషన్ 
ఈ వర్క్‌స్టేషన్‌పై పనిచేసిన తర్వాత హెచ్‌పీకి హ్యాట్యాఫ్ చెప్పకుండా ఉండలేం. పర్సనల్ కంప్యూటర్‌గా వాడేవారికంటే గ్రాఫిక్ డిజైనర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 
ప్రాసెసర్ : 3.5 జీహెచ్‌జెడ్ ఇంటెల్ గ్జెయాన్ 
ర్యామ్ : 8 జీబీ డీడీఆర్3
హార్డ్‌డ్రైవ్ : 250 జీబీ నుంచి 2 టీబీ వరకు 
కెమెరా : ఉంది
ప్లస్‌లు : యూఎస్‌బీ 3.0, స్పీడ్, డిజైన్, కలర్స్, రెజల్యూషన్, ధర
మైనస్‌లు : అన్నీ ఉన్నాక మైనస్‌లు ఏముంటాయి?
ధర : $ 1899, ₹ 1,08,500

HP-TouchS talangana patrika telangana culture telangana politics telangana cinemaహెచ్‌పీ టచ్‌స్మార్ట్ 610క్యూ 
అన్ని ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లలో ఇదొక బెస్ట్ పీసీ. టైలింగ్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ కన్సోల్, గ్రేట్ బిల్డ్ క్వాలిటీ దీని ప్రత్యేకతలు. 
ప్రాసెసర్ : 2.93 జీహెచ్‌జెడ్ ఇంటెల్ కోర్ ఐ7 
ర్యామ్ : 8 జీబీ ర్యామ్ మెమరీ
హార్డ్‌డ్రైవ్ : శాటా 1.5 టీబీ (5400 ఆర్‌పీఎం)
కెమెరా : 
ప్లస్‌లు : గ్రేట్ డిజైన్, కంపెటేటివ్ ప్రైస్, బ్లూరే ప్లేయర్, యూఎస్‌బీ 3.0 మల్టీ టాస్కింగ్
మైనస్‌లు : వీడియో అవుట్‌పుట్ పోర్ట్‌లు లేవు. గ్లోరీ డిస్‌ప్లే
ధర : $ 1200, ₹ 68,500

Asus-ET talangana patrika telangana culture telangana politics telangana cinemaఎసెస్ ఈటీ2410ఐయుటీఎస్ 
ఎక్కువగా ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లను తయారు చేస్తున్న కంపెనీల్లో ఎసెస్ ఒకటి. అందులో ఈటీ2410ఐయుటీఎస్ మోడల్ కంప్యూటర్ అద్భుతమైన ఫీచర్లు, పెర్మామెన్స్ కలిగి ఉంటుంది. 23.6 అంగుళాల హెచ్‌డీ టచ్ స్క్రీన్ దీని స్టైల్. 
ప్రాసెసర్ : 2.50 జీహెచ్‌జెడ్, ఇంటెల్ కోర్ ఐ5-2400ఎస్ (అప్ టు 3.3 జీహెచ్‌జెడ్)
ర్యామ్ : 2జీబీ (అప్ టు 8 జీబీ) 
హార్డ్ డ్రైవ్ : శాటా అప్ టు 2 టీబీ (7200 ఆర్‌పీం)
కెమెరా : 1.3 ఎంపీ
ప్లస్‌లు : గ్రేట్ టచ్ స్క్రీన్, గ్రేట్ సౌండ్ సిస్టమ్
మైనస్‌లు : ఇంటిగ్రేటెడ్ వీడియో కార్డ్, లో వీడియో పెర్మామెన్స్
ధర : $ 1000, ₹ 57,2000

HP-Com talangana patrika telangana culture telangana politics telangana cinemaహెచ్‌పీ కంప్యాక్ 8200 ఎలైట్ ఎక్స్‌జెడ్909యూటీ 
కంప్యాక్ చాలారోజులుగా న్యూ సిరీస్ ల్యాప్‌టాప్‌లను, ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లని రూపొందిస్తోంది. 8200 ఎలైట్‌ని అందులో ఒక బెస్ట్ మోడల్‌గా చెప్పొచ్చు. 23 అంగుళాల హెచ్‌డీ యాంటీ గ్లేర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎనర్జీ స్టార్ 5.0 ఎక్స్‌టర్నల్ పవర్ సప్లై దీనిలోని ప్రత్యేకతలు.
ప్రాసెసర్ : 2.5ం జీహెచ్‌జెడ్ ఇంటెల్ కోర్ ఐ5-2400ఎస్
ర్యామ్ : 4 జీబీ డీడీఆర్3 ఎస్‌డీ
హార్డ్ డ్రైవ్ : శాటా 500 జీబీ (7200 ఆర్‌పీఎం)
కెమెరా : ఇంటిగ్రేటెడ్
ప్లస్‌లు : నైస్ డిజైన్, గ్రేట్ డిస్‌ప్లే, త్రీ ఇయర్స్ వారంటీ
మైనస్‌లు : టచ్‌స్క్రీన్ లేకపోవడం, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్. 
ధర : $ 1049, ₹ 59,900

acerz3-sg talangana patrika telangana culture telangana politics telangana cinemaఎసెర్ జెడ్5 
ఇదో స్లిమ్ అండ్ గుడ్ లుకింగ్ ఆల్ ఇన్ వన్ కంప్యూటర్. మంచి పెర్మామెన్స్‌ని ఇచ్చే ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లలో ఇది కూడా ఒకటి. 
ప్రాసెసర్ : 3.2 జీహెచ్‌జెడ్ ఇంటెల్ కోర్ ఐ5 650 
ర్యామ్ : 4 జీబీ డీడీఆర్3
హార్డ్‌డ్రైవ్ : శాటా2 హెచ్‌డీడీ 1 టీబీ 
కెమెరా : ఇన్‌బిల్ట్
ప్లస్‌లు : 23 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్, మల్టీ టచ్, స్క్రీన్ రెజల్యూషన్
మైనస్‌లు : బల్కీ డిజైన్, రెండు యూఎస్‌బీ పోర్టులే ఉండడం. 
ధర : $ 817, ₹ 46,700

hp-omni-2 talangana patrika telangana culture telangana politics telangana cinemaహెచ్‌పీ ఓమ్నీ 200 5380క్యూడీ 
ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ల పోటీలో హెచ్‌పీ ముందు వరుసలో ఉంది. ఆ కంపెనీ రూపొందించిన ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు అలాంటివి మరి. ఓమ్నీ 200ని ధరకు తగ్గ ప్రతిఫలాన్నిచ్చే కంప్యూటర్‌గా చెప్పొచ్చు. 
ప్రాసెసర్ : 2.8 జీహెచ్‌జెడ్ ఇంటెల్ కోర్ ఐ5 ఐ5-760
ర్యామ్ : 4 జీబీ / 8 జీబీ (మ్యాగ్జిమమ్) డీడీఆర్3 మెమరీ
హార్డ్‌డ్రైవ్ : 750 జీబీ (7200 ఆర్‌పీఎం) శాటా
కెమెరా : ఇంటిగ్రేటెడ్
ప్లస్‌లు : ధరకు తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తుంది. 
మైనస్‌లు : టచ్‌స్క్రీన్ లేదు. డిస్‌ప్లే 21.5 అంగుళాలే. 
ధర : $ 960, ₹ 54,800

Apple-iM5 talangana patrika telangana culture telangana politics telangana cinemaయాపిల్ ఐమ్యాక్ 27 
బ్యూటీ అనేది యాపిల్ కంపెనీకి ఉన్న పెద్ద ఆయుధం. ఈ 27 అంగుళాల ఐమ్యాక్ అంత బ్యూటీఫుల్‌గా ఉంటుంది. ఎక్స్‌ట్రా హార్స్‌పవర్ కావాలనుకున్నవారికి ఈ మ్యాక్ మంచి ఆప్షన్. ఇతర అన్ని ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ల కంటే దీని పెర్మామెన్స్ గొప్పగా ఉంటుంది. 
ప్రాసెసర్ : 3.1 జీహెచ్‌జెడ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ కోర్ ఐ5
ర్యామ్ : 4జీబీ డీడీఆర్3
హార్డ్‌డ్రైవ్ : 1 టీబీ (7200 ఆర్‌పీఎం)
కెమెరా : ఫేస్‌టైమ్ 
ప్లస్‌లు : ఎక్సలెంట్ క్వాలిటీ, గ్రేట్ డిజైన్, గుడ్ పెర్మామెన్స్
మైనస్‌లు : అన్ని యాపిల్ ఉత్పత్తుల్లాగే దీని ధర కూడా ఎక్కువే. 
ధర : $ 1600, ₹ 90,000/-.

0 comments: