జస్ట్ ఎండలో పెడితే ‘ఎనర్జీ’నిచ్చే టెక్నాలజీని ఉపయోగించుకోండి.

By | July 26, 2012 Leave a Comment


సీటీలో రోజుకు మూడు గంటల కరెంటు కోత..
గ్రామాల్లో పన్నెండు గంటలు... విద్యుత్‌తో అవసరం లేని లోకాన్ని..
ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించండి.
రెండు రోజులు వాన కురిసినా..
రెండు రోజులు ఎండ అంతో ఇంతో కొడుతూనే ఉంది.
అందుకే..
జస్ట్ ఎండలో పెడితే ‘ఎనర్జీ’నిచ్చే టెక్నాలజీని ఉపయోగించుకోండి. 


iphone-4 talangana patrika telangana culture telangana politics telangana cinema
ఐఫోన్ ఛార్జర్ 

ఐఫోన్ల కోసం చాలా రకాల సోలార్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ఐఫోన్ 4 కోసం ఉపయోగించే ఛార్జర్. దీన్ని 20 నిమిషాలు సూర్యరశ్మి తగిలే చోట పెడితే 5 నిమిషాల టాక్‌టైమ్‌ని, ఒక గంట స్టాండ్‌బై టైమ్‌ని ఇస్తుంది. దీని రెండు వేల రూపాయలకు పైనే ఉంటుంది. 

samsung-b talangana patrika telangana culture telangana politics telangana cinema
స్యామ్‌సంగ్ బ్లూ ఎర్త్ 

స్యామ్‌సంగ్ కంపెనీ మూడేళ్ల క్రితమే రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ ఫోన్ ఇది. దీని వెనకాల ఉండే సోలార్ ప్యానెల్స్‌తో ఇది రీఛార్జ్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఉండే మైనస్ ఏంటంటే.. ఫోన్ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే ఈ సోలార్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. ఈ ఫోన్‌లో ఉండే మిగిలిన ఫీచర్లను వాడడం కోసం... అంటే ఫోటోలు, వీడియోలు తీయడం లాంటి వాటికోసం ఈ పవర్ ఉపయోగపడదు. భవిష్యత్తులో పూర్తిగా సోలార్ టెక్నాలజీతో పనిచేసే ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. 

logitech talangana patrika telangana culture telangana politics telangana cinema
కీబోర్డ్ 

దీనికి వైర్లు, బ్యాటరీలు అక్కర్లేదు. దీన్ని ప్రత్యేకంగా ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోకి వచ్చే వెలుతురుతోనే ఇది ఛార్జ్ అవుతుంది. సీపీయూకు కేబుల్ కనెక్షన్ ఇవ్వకుండానే ఆపరేట్ చేసుకోవచ్చు. అమేజాన్ స్టోర్‌లో ఇది దొరుకుతోంది.

solar-USB talangana patrika telangana culture telangana politics telangana cinema
ఎటాన్ స్కార్పియాన్ 

ఎల్‌ఈడీ టార్చ్‌లైట్ ఇది. రేడియో కనెక్షన్ కూడా దీనికి ఉంటుంది. యూఎస్‌బీ ఛార్జర్‌గా కూడా ఉపయోగపడుతుంది. సోలార్ ఎనర్జీతో అద్భుతంగా పనిచేయడం దీని ప్రత్యేకత. చీకట్లో బయటికి వెళ్లినప్పుడు దీన్ని తీసుకెళ్లడం సరదాగా ఉంటుంది. దీంతో మీ మొబైల్ ఫోన్‌కు కూడా యూఎస్‌బీ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 

solar-camera talangana patrika telangana culture telangana politics telangana cinema
వీడియో కెమెరా 

టూర్లకు వెళ్లినప్పుడు కంటిన్యూస్‌గా వీడియోలు చిత్రించడం వల్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతూ ఉంటుంది. తిరిగి ఛార్జింగ్ పెట్టడానికి కొంత సమయం పడుతుంది. ఆ టైమ్‌లో షూట్ చేసే వీలు లేకపోవడంతో కొంత మిస్ అవుతుంది. ఈ వీడియో కెమెరాతో ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే అవుట్‌డోర్‌లో.. అంటే ఎండలో వీడియోలు తీస్తున్నప్పుడు ఇది ఆటోమెటిగ్గా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఒక గంట ఎండలో ఉంటే 12 నిమిషాల వీడియోని మీరు అదనంగా తీసుకోవచ్చు. 

eton-soulr talangana patrika telangana culture telangana politics telangana cinema
ఐ సౌండ్ సిస్టమ్ 

ఇది ఐఫోన్, ఐప్యాడ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సౌండ్ సిస్టమ్. కరెంట్ పోయినప్పుడు దీన్ని ఐఫోన్, ఐప్యాడ్‌లకు కనెక్ట్ చేసుకుని పాటలు వినొచ్చు. ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా. 

gorilla talangana patrika telangana culture telangana politics telangana cinema
గొరిల్లా ఛార్జర్ 

ఈ గొరిల్లా సోలార్ ఛార్జర్ మీ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను రీఛార్జ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. కరెంటు పోయినప్పుడు వాడుకోవడానికి ల్యాప్‌టాప్‌లో బ్యాటరీలు ఉంటాయి. కానీ అవి కూడా కొంత సమయం వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత కూడా ల్యాప్‌టాప్‌ని ఆన్ చేయాలంటే ఈ గొరిల్లా ఛార్జర్‌తో సాధ్యమవుతుంది. దీంతో సుమారు 5 గంటల పాటు ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. నోకియా, స్యామ్‌సంగ్‌తో పాటు అన్ని రకాల మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసేందుకు ప్రత్యేకమైన కిట్‌ప్యాక్ దీంతోపాటు లభిస్తుంది. 

electric-s talangana patrika telangana culture telangana politics telangana cinema
ఎలక్ట్రిక్ స్కూటర్ 

ఇదో చిన్న స్కూటర్. దీన్ని నడిపించడానికి ఎలాంటి ఇంధనం అవసరం లేదు. సోలార్ ప్యానెల్స్‌తో ఇదే పవర్‌ని క్రియేట్ చేసుకుంటుంది. మీ సూట్‌కేస్‌లో కూడా దీన్ని మడిచి పెట్టుకోవచ్చు. ఇదిప్పుడు మార్కెట్‌లో దొరకడం లేదు. కానీ భవిష్యత్తులో అందుబాటులోకి రానుంది. 

స్యామ్‌సంగ్ ఎన్‌సీ215ఎస్ 
స్యామ్‌సంగ్ కంపెనీ రూపొందించిన సోలార్ పవర్ ల్యాప్‌టాప్ ఇది. 10.1 అంగుళాల ఈ నోట్‌బుక్‌లో 1.6 జీహెచ్‌జెడ్ ఇంటెల్ ఆటమ్ ఎన్570 డ్యుయల్ కోర్ ప్రాసెసర్ ఇందులో ఉంది. 1024x600 పిక్సెల్స్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే దీని సొంతం. 

ipad-so talangana patrika telangana culture telangana politics telangana cinema
ఐప్యాడ్ సోలార్ బ్యాగ్ 

ఐప్యాడ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సోలార్ బ్యాగ్ ఇది. ఎండలో వెళ్తున్నప్పుడు ఐప్యాడ్ ఆటోమెటిగ్గా ఛార్జ్ అవుతుంది. 

సోలార్ టాయ్స్ 
పిల్లలు ఆడుకునే బొమ్మలు కొన్ని బ్యాటరీలతో పనిచేస్తుంటాయి. వాటిలో ప్రతిసారీ కొత్త బ్యాటరీలను వేయాల్సి వస్తుంటుంది. అందుకే ఇప్పుడు సోలార్ ఎనర్జీతో పనిచేసే బొమ్మ కార్లు, ఇతర గాడ్జెట్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ బొమ్మలో కనిపించేది అలాంటిదే. దీని పేరు ఎలెన్‌కో. 

0 comments: