శ్రీదేv.. vదేవి.. కమింగ్ బ్యాక్. 14 ఏళ్ల తర్వాత...

By | July 15, 2012 1 comment
అమెరికాలో ఉండే ఒక సాధారణ గృహిణి. తన భర్త, పిల్లల కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంగ్లీష్ కోర్సులో చేరుతుంది. ఆమె ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంది అనేది ఈ సినిమాలో ఆసక్తిగా చూపెడుతున్నారు.
ముందు ట్రైలర్ గురించి చెబుతాను, చదవండి...

ఎర్ర చీర కట్టుకుని.. నల్ల హ్యాండ్‌బ్యాగ్ పట్టుకున్న శ్రీదేవి ఓ వాల్ పోస్టర్‌ని పరిశీలనగా చూస్తోంది. దాని మీద ఇంగ్లీషు, హిందీ వాక్యాలు రాసి ఉన్నాయి. ఆమె వాటిని చదవడానికి ప్రయత్నిస్తోంది. హిందీ అక్షరాల మీద వేలు పెట్టి ‘కేంవూదీయ..’ అని చదివింది. ‘శశీ.. ఇంగ్లీష్’ అని తనకు తాను తలపై కొట్టుకుంది. హిందీ అక్షరాల కింద ఉన్న ఇంగ్లీషు ఇలా చదవడానికి ప్రయత్నిచింది.
‘సెంవూటలు.. బోర్డు.. ఫిల్ము.. (తర్వాత పదం ఆమెకు అర్థం కాలేదు) బోర్..డు? సినిమాలు ఎక్కువ చూస్తే బోర్ కొట్టినట్టుంది’ అని చదువుకుంటూ పోస్టర్ ఎడమవైపు నుంచి కుడివైపు నడిచింది.
మళ్లీ ఎడమవైపు వచ్చి తర్వాతది చదవడం మొదపూట్టింది.

‘ట్రైలర్ ఆఫు ఇంగ్లీష్ వింగ్లీష్.. హిందీ.. హిందీ పిక్చర్ పేరు ఇంగ్లీష్.. హ్చ్.. స్టైల్...
జీ..ఏ..యు..జీ..ఇ.. గౌజీ? (దాన్ని ఏమని పలకాలో అర్థం కాక వీపు గోక్కుంది) గోగ్? డైరెక్టర్ పేరు గౌరీ కదా? ఓహ్.. బహుశా ఇది ఆమె ముద్దు పేరయ్యుంటది’ అని సమర్థించుకుంది.
ఆమె చదవడం ఇంకా అయిపోలేదు..

english
‘ఎగ్జామినేషన్ ఆఫు, ఫిల్మ్.. సర్ సిర్(ఇదీ అర్థం కాలేదు) సినిమాకు కూడా పరీక్ష ఉంటుందా? పాసైతే అందరికీ లడ్డూలే..’ అని ఎగిరి గంతేసింది.
అప్పటి వరకు గోడవైపు ఉన్న ఆమె ఇటువైపు తిరిగింది.
శ్రీదేవి.. అతిలోకసుందరి.. ఆదే గ్లామర్..

కానీ ఈ గ్రామర్ మిస్టేక్ లేంటి?
నాలుక కరుచుకుంది. నవ్వింది. నమస్కరించింది. కళ్లని చక్రాల్లా తిప్పింది. స్క్రీన్ ఫేడయిపోయింది..
‘ఇంగ్లీష్ వింగ్లీష్.. కమింగ్ సూన్’ అని ఒక టైటిల్.
శ్రీదేవి మళ్లీ నటిస్తోందా? యస్.. శ్రీదేవి కమింగ్ బ్యాక్. 14 ఏళ్ల తర్వాత.. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ అనే సినిమాలో డిఫంట్ రోల్‌తో రీఎంట్రీ ఇస్తోంది. దానికి సంబంధించిన ట్రైలరే ఇది.
ఇంగ్లీష్ వింగ్లీష్ ఫస్ట్ లుక్.. యూట్యూబ్‌లో ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పోస్టు చేసిన మూడు వారాల్లో మూడు లక్షల మందికి పైగా ఆ వీడియోని క్లిక్ చేశారు.
ఒక వాల్ పోస్టర్.. శ్రీదేవి.. ఇంగ్లీష్.. స్లాంగ్.. కెమెరా వైపు తిరిగి ఇచ్చిన ఎక్స్‌వూపెషన్స్.. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి.

sridevi
ఇంగ్లీష్ వింగ్లీష్.. ట్విట్టర్ విట్టర్.. ఫేస్‌బుక్ వేస్‌బుక్.. యూట్యూబ్ వేట్యూబ్ అంటూ తప్పుల తడకగా ఇంగ్లీష్ రాని వ్యక్తులు రాసినట్టుగా లేదంటే క్రియేటివ్‌గా రూపొందించిన ఈ ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్.
ఇంగ్లీష్ వింగ్లీష్ అప్పుడెప్పుడో టీవీలో వచ్చిన హిందీ సీరియల్ ‘జబ్బన్ సమ్‌బాల్కే’కి రీమేక్. గౌరీ షిండే ఇప్పుడు ఈ కథని శ్రీదేవి కోసమే రాసుకున్నారు. అమెరికాలో ఉండే ఒక సాధారణ గృహిణి. తన భర్త, పిల్లల కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంగ్లీష్ కోర్సులో చేరుతుంది. ఆమె ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంది అనేది ఆసక్తిగా చూపెడుతున్నారు. గౌరీ భర్త ఆర్. బల్కీ దీన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఆయన చీనీ కమ్, పా సినిమాలు తీశాడు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 21న హిందీ, తెలుగు, తమిళ్‌లో విడుదలవుతున్న ఈ సినిమా చూడడానికి బీ రెడీ!

1 comments:

Anonymous said...

అమెరికా లో ఉండదనుకుంట శ్రీదేవి.
అమెరికా వెళ్ళే అవసరం వస్తుంది తనకి.