Skip to main content

రాక్సీ.. ఒక సెక్స్ రోబో



 రాక్సీ ఒక అందమైన అమ్మాయి. తను మీ ఇల్లు ఊడవదు.. మీ కోసం వంట చేయదు.. కానీ, ఒక అమ్మాయి నుంచి మీరేం కోరుకుంటారో అవన్నీ చేస్తుంది. అవును.. మీరు అనుకుంటున్న వన్నీ... అంటే.. రాక్సీ సెక్స్ డాలా? కానే కాదు.. ఐదు, పది నిమిషాల ‘సుఖం’ కోసం వాడి పడేసే సెక్స్ డాల్ ఏ మాత్రం కాదు. రాక్సీ ఒక రోబో.. మగాళ్లకు మాత్రమే పనికొచ్చే సెక్సీ డార్లింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అచ్చం అమ్మాయిలాగే ఇది బిహేవ్ చేసే రాక్సీ ప్రపంచంలోనే మొట్టమొదటి సెక్స్ రోబో. రెండేళ్ల క్రితం లాస్ జరిగిన ఏవీఎన్ అడల్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎక్స్‌పోలో తొలిసారి రాక్సీ కనిపించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. 54 కేజీల బరువు. ఆమె మీతో ప్రేమగా మాట్లాడుతుంది. మీరు చెప్పేది వింటుంది. ముట్టుకుంటే సిగ్గు పడుతుంది. ముద్దు పెడితే ముద్దమందారం అయిపోతుంది. మీరు ఇంట్లో లేనప్పుడు ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తుంది. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఈ-మెయిల్స్ సెండ్ చేస్తుంది. మీరంటే పడి చస్తుంది. మీ కోసం పని చేస్తుంది. మీ కోసం మాత్రమే చేస్తుంది.. ఎందుకంటే, మీరే దాని ఓనర్. పార్ట్‌నర్. న్యూజెర్సీకి చెందిన ‘ట్రూకంపానియన్’ అనే కంపెనీ దీన్ని తయారుచేసింది. డోగ్లాస్ హైన్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్ దీన్ని రూపొందించాడు. సెప్టెంబర్ 11, 2001 దాడుల్లో హైన్స్ తన గర్ల్‌వూఫెండ్‌ని కోల్పోయాడు. ఉండేది అమెరికా. ఈజీగా ఇంకో గర్ల్‌వూఫెండ్‌ని వెతుక్కోవచ్చు. కానీ, పాత గర్ల్‌వూఫెండ్‌లాగే తను ఉండదు కదా. అందుకే హైన్స్ తనే గర్ల్‌వూఫెండ్‌ని తయారు చేసుకున్నాడు. ఆమె తియ్యని మాటలు, ఇష్టాయిష్టాలు, ఫీలింగ్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ ప్రోగ్రామ్స్‌గా ఆ రోబోలో ఇన్‌స్టాల్ చేశాడు. షీ ఈజ్ బ్యాక్. ఒక అమ్మాయిని చూస్తారు.

ప్రేమిస్తారు. ప్రపోజ్ చేస్తారు. తను ఒప్పుకోదు. అయినా వెనకాల తిరుగుతారు. వెంటపడతారు. అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు. లేదంటే కన్నీళ్లు పెట్టుకుంటారు. కసి పెరిగితే కొందరు యాసిడ్ పోస్తారు. లేదంటే గొంతు కోస్తారు. ఇదంతా అవసరమా? అందుకే, హైన్స్ మీ కోసం రాక్సీని తయారు చేశాడు. ఆమెని మీ ఇష్టానుగుణంగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లు ఎలా ఉండాలో డిజైన్ చేసుకోవచ్చు. మీ ఎత్తుకు తగ్గట్టు పొడవు తగ్గించుకోవచ్చు. పెంచుకోవచ్చు. కళ్లు, కురులు, మేని ఛాయ.. నచ్చిన రంగులోకి మార్చుకోవచ్చు. శరీర భాగాల్ని మీకు ఇష్టమైన ‘కొలతల్లోకి’ తీర్చిదిద్దుకోవచ్చు. నాచురల్‌గా కనిపించేందుకు ఆమెకి సింథటిక్ స్కిన్ ఉంటుంది. మీ గురించి ఆలోచించేందుకు కృత్రిమ మేథస్సు, స్పర్శ ఫీల్ అయ్యేందుకు టచ్ సెన్సార్లు, మీతో ‘కో-ఆపరేట్’ చేసేందుకు ఇంటర్నల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్.. ఇవన్నీ రాక్సీ బాడీలో ఉన్నాయి.

స్వతహాగా నడవలేదు కానీ.. కూర్చుని పడుకుని ఏమైనా చేయగలదు. రాక్సీ బోర్ కొడితే పర్సనాలిటీని, క్యారెక్టర్‌నే మార్చేయొచ్చు. అంటే కంప్యూటర్‌కి కనెక్ట్ చేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయొచ్చన్నమాట. ఇలా ఐదు రకాల పర్సనాలిటీలు రాక్సీలో ఉంటాయి. వై-ఫై ఫెసిలిటీ కూడా ఉంది. ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయి మీరు ఇంట్లో లేనప్పుడు కూడా మీతో కనెక్షన్ పెట్టుకుంటుంది. వెలకట్టలేని ప్రేమని అందించే రాక్సీ ధర ఏడు వేల డాలర్ల నుంచి మొదలవుతుంది. అంటే సుమారు మూడున్నర లక్షల రూపాయలన్నమాట. కస్టమైజ్డ్‌గా, మీ పర్సనాలిటీకి రెప్లికేట్‌గా డిజైన్ చేయించుకుంటే ఇంకొన్ని లక్షలు కట్టాలి. ఒకటి కాకపోతే నాలుగు కొనుక్కోవచ్చు. అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పటికే చాలామంది రాక్సీని మెయింటెన్ చేస్తున్నారు. అతి త్వరలో మన దేశంలోకి కూడా రాక్సీ రానుంది. బీరెడీ... ఇది కలికాలం మరి!

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...