రిచ్ డాడ్ కి పూర్ డాడ్ కి తేడా తెలుసుకోండి

By | September 23, 2012 Leave a Comment
Delivery
కొందరు మెల్లగ ఎలాగో అలాగ బతికేద్దామని పట్నం వస్తుంటారు. 
ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటారు. వెయ్యి, రెండు వేలు పెరిగే జీతం కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటారు. పెరిగే ధరల్ని నిందిస్తూ కూర్చుంటారు. అద్దె ఇంటితో అవస్థ పడుతుంటారు. సొంత ఇంటి కల వారికి కలగానే మిగిలిపోతుంది.
కానీ, ఇంకొందరు అలా కాదు. ‘బిజినెస్‌మేన్’ సినిమాలో మహేష్‌బాబులా ఉంటారు. తమ కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు.
‘రిచ్ డాడ్’ గురించి మీకు తెలుసా?
అమెరికా రచయిత రాబర్ట్ కియోసా ‘రిచ్ డాడ్ - పూర్ డాడ్’ అని ఒక పుస్తకం రాశాడు.
‘పూర్ డాడ్ పొదుపు చేయమని చెప్తే, రిచ్ డాడ్ మదుపు చేయమని చెప్తాడు. పొదుపుకి మదుపుకి ఒక అక్షరమే తేడా. కానీ వాటి లక్షణమే వేరు. దాన్ని అర్థం చేసుకోవడమే బిజినెస్’ అంటారు కియోసాకి. ఉద్యోగం చేసే వాడు కేవలం ఉద్యోగిగానే మిగిలిపోతాడు. ‘బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది’ అని తన కొడుక్కి నూరిపోస్తాడు. ఆ కొడుకూ అలాగే చేస్తాడు. కానీ రిచ్ డాడ్ అలా కాదు. తన కొడుక్కి డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తాడు. ‘డబ్బు వృథాగా ఖర్చు పెట్టకు’ అని ఆయన ఎప్పుడూ చెప్పడు. దాంతో ఆడుకొమ్మంటాడు.

అందుకే కొందరు డబ్బుతో ఆడుకొంటుంటారు. కొత్త కొత్త బిజినెస్‌లు పరిచయం చేస్తుంటారు.
‘మీరు వ్యాపారం చేయాలనుకుంటే మార్కెట్‌తో పోటీ పడకండి. మీకంటూ ఒక మార్కెట్‌ని క్రియేట్ చేసుకోండి’ అని చెప్పాడు ‘యాపిల్’ సృష్టికర్త స్టీవ్ జాబ్స్.
ఒక ‘కొత్త మార్కెట్’ని క్రియేట్ చేయడం కోసం మిమ్మల్ని వాడుకుంటారు బిజినెస్‌మెన్.
అది ఎంతలా అంటే మీ ‘బద్దకం’తో కూడా బిజినెస్ చేస్తారు ‘సార్లు’.
మీకు కొంచెం తిక్కుండొచ్చు. దానికో లెక్కుండొచ్చు. కానీ మీ ఇంట్లో కుక్క ఉన్నప్పుడు మాత్రం తినడానికి దానికో బొక్క ఉండాలి. అది కొనుక్కొచ్చే ఓపిక మీకుండాలి. లేదా? అయితే.. కంగ్రాట్స్! మీరూ బద్దకస్తులే అన్నమాట. మీలాంటి వాళ్లే వీళ్లకు కావాలి.
ఢిల్లీకి చెందిన సంజీవ్ కుమార్, ఆయన భార్య ప్రీతి ‘స్కూపీ స్క్రబ్’ బిజినెస్ మొదపూట్టారు. వీళ్లకు ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు మీ ‘పప్పీ’కి కావాల్సిన ఫుడ్ తెచ్చి పెడతారు. అంతే కాదు, దానికి వెంట్రుకలు కత్తిరించడం, స్నానం చేయించడం, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం లాంటి పనులు కూడా చేసి పెడతారు. కేవలం ఢిల్లీలోనే కాదు హైదరాబాద్‌తో కలిపి దేశం మొత్తం మీద వీరికి 20 అవుట్‌పూట్‌లు ఉన్నాయి.

పెంపుడు కుక్కల్లాగే ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ అంత తీరికగానీ, ఓపికగానీ ఉండకపోవచ్చు. అలాంటి వారు ఒక 250 రూపాయలు ఇస్తే వారం వారం మీ ఇంటికొచ్చి మొక్కలకు నీళ్లు పోయడం, ఆకులు కత్తిరించడం, కుండీల్లో మట్టి మార్చడం, ఎరువులు వేయడం లాంటి పనులు చేసి పెడతారు.
కారు సర్వీసింగ్ చేయించాలనుకున్నప్పుడు ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి తీసుకెళ్లడం ఎప్పటి నుంచో ఉంది. లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి వచ్చినప్పుడు దుమ్ము పట్టిన కారుని కడుక్కునే తీరిక అందరికీ ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం కార్ క్లీన్స్ మొదలయ్యాయి. కార్ క్లీన్ చేసి డోర్ డెలివరీ చేయడానికి నాలుగైదు గంటలు పడుతుందంతే. డోర్ స్టెప్ కార్ వాషింగ్ సర్వీస్ చెన్నై (ఫ్లిడ్జ్ అండ్ గ్లిడ్జ్), బెంగళూరు(వూపొవాష్)లలోనూ ఉంది. హైదరాబాద్‌లో 499 రూపాయలు చెల్లిస్తే ‘ఇంపీరియల్ మొబైల్ కార్ వాష్’ వారు మీ ఇంటి వద్దకే వచ్చి కార్ కడిగి వెళ్తారు.

మీ ఇల్లు మెయిన్ రోడ్‌కి దూరంగా ఉండొచ్చు. అక్కడి వరకు నడిచి వెళ్తే ఆటో దొరుకుతుంది. కానీ వెళ్లాలంటే బద్ధకం. కానీ వెళ్లి తీరాలి. డోంట్ వర్రీ. ఫోన్ చేస్తే నిమిషాల్లో ఆటో మీ ఇంటి ముందు ఉంటుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మొదలయ్యాక హైదరాబాద్‌లో రేడియో క్యాబ్స్ విపరీతంగా పెరిగిపోవడం మీరు చూసే ఉంటారు. అదే టెక్నాలజీని వాడుతూ పూనేలో ఆటో రిక్షా క్యాబ్స్ మొదలయ్యాయి. హైదరాబాద్‌ది, ఆటోది ఛాయ్, సిగట్‌లా విడదీయరాని బంధం. అందుకే ఈ ఫెసిలిటీ త్వరలోనే మన దగ్గరికీ వస్తుంది.
ఈ-సేవలో మీ కరెంటు బిల్లు కట్టడానికి ఎట్ యువర్ సర్వీస్, బట్టలు డ్రై క్లీనింగ్ చేసి పెట్టడానికి ఫ్యాబ్రిక్ స్పా, అర్థరాత్రి మందు పార్టీ అయిపోయాక సరిపోకపోతే సప్లై చేయడానికి మిడ్‌నైట్ డెలివరీ.. అబ్బో ఇలా చాలా బిజినెస్‌లు ఉన్నాయి.
మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు. బార్బర్ మీ ఇంటికే వచ్చి హెయిర్ కటింగ్ చేసి వెళ్లడాన్ని. అది గతం.

కావాలంటే ఇప్పుడూ వచ్చి చేస్తారు.. ‘హోమ్ సెలూన్’ అని ప్యాకేజీ ఉంది.
వారొచ్చినప్పుడు ‘హెయిర్ కటింగ్ చేసేవాడే కదా’ అని తక్కువ చేసి మాట్లాడకండి. అతను మీ సర్వెంట్ కాదు. మీ కంటే గొప్పవాడైన బిజినెస్‌మేన్. ‘ఎంత గొప్పవాడైనా.. ఎవరికింద తల వంచకపోయినా వారి కింద వంచాల్సిందే’ అనేది గుర్తుపెట్టుకోండి. అందుకే ‘సార్’ అని గౌరవించండి.
మీకు పేపర్ చదివి వినిపించడానికి కూడా బిజినెస్ ప్లాన్స్ వేస్తున్నారు కొందరు. సో.. ఏదో ఒకరోజు సారొస్తారు. అంటిల్ దెన్.. బీ లేజీ. గో క్రేజీ

0 comments: