స్మార్ట్ వార్ : యాపిల్ X స్యామ్‌సంగ్‌ X నోకియా

By | September 21, 2012 Leave a Comment

ఐఫోన్ 5 విడుదలయ్యింది. అది స్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3కి పోటీ అయింది. హెచ్‌టీసీ వన్ ఎక్స్‌లోనూ ఈ రెండింటిలో ఉన్న ఫీచర్లే ఉన్నాయి. వీటి మధ్య ఉన్న పోటీకి ఐఫోన్5 ఇప్పుడు ఇంకా పోటీనిస్తోంది. త్వరలో నోకియా కూడా లుమియా 920 ఫోన్ ంచ్ చేయబోతోంది. మొత్తంగా ఒక ‘స్మార్ట్’ వార్ జరుగుతోంది.
‘యాపిల్’ లోగోలో యాపిల్‌ని ఎవరు కొరికారు?
స్యామ్‌సంగ్!
ఫేస్‌బుక్‌లో రొటేట్ అవుతున్న జోక్ ఇది.

ఐఫోన్, స్యామ్‌సంగ్‌లు కోర్టుకెక్కిన విషయం మీకు తెలిసే ఉండొచ్చు. అది వేరే విషయం. ఇప్పుడు యాపిల్ ఐఫోన్5 విడుదలయింది. దీంతో ఇప్పటి వరకు లీడింగ్‌లో ఉన్న స్యామ్‌సంగ్‌కి భయం పట్టుకుంది. అందుకే ఇంగ్లీష్ పేపర్లలో పేజీల కొద్ది యాడ్స్ ఇస్తోందని అంటున్నారు విమర్శకులు. ఏ కంపెనీ సరికొత్త ఫోన్‌ని విడుదల చేసినా అది తమ మార్కెట్‌ని పెంచుకోవడం కోసమే. అందుకోసం రకరకాల ఫీచర్లని, అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేస్తుంటాయవి. అలా వచ్చిన స్మార్ట్ ఫోన్లలో యాపిల్ ఐఫోన్, స్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, హెచ్‌టీసీ వన్ ఎక్స్ ఇప్పుడు పోటీ పడుతున్నాయి. త్వరలో విడుదల కానున్న నోకియా మియా 920 కూడా ఇదే బరిలోకి రానుంది. అందుకే ఏ ఫోన్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసుకోండి. 
డిజైన్
స్మార్ట్‌ఫోన్ అంటే కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. అందుకే ఏ కంపెనీ స్మార్ట్ ఫోన్‌ని చూసినా దాదాపు ఒకేలా కనిపిస్తాయి. కానీ ఈ నాలుగింటిలో నోకియా లుమియా డిజైన్ డిఫంట్‌గా ఉంటుంది. ఇది ట్రెండ్‌ని ఫాలో అవ్వకుండా సెట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. స్యామ్‌సంగ్ కర్వ్ స్టైల్‌ని క్రియేట్ చేస్తుంటే, యాపిల్ సేమ్ ఓల్డ్ స్టైల్‌ని ఫాలో అవుతోంది. ఈ నాలుగు ఫోన్లలో స్యామ్‌సంగ్ స్క్రీన్ అన్నింటికంటే పెద్దది. ఐఫోన్‌ది అన్నింటికంటే చిన్నది. కానీ ఇదే అన్నింటికంటే పలుచనైనది.
Nokia
డిస్‌ప్లే
డిస్‌ప్లే విషయానికి వస్తే దాదాపు అన్ని ఫోన్లది ఒకేలా ఉంది. యాపిల్ తనదైన స్టైల్‌లో రెటీనా డిస్‌ప్లేని పరిచయం చేస్తే, స్యామ్‌సంగ్ సూపర్ ఎమోల్డ్ హెచ్‌డీ డిస్‌ప్లేని ఫాలో అవుతోంది. కానీ ఇది బ్యాటరీ జ్యూస్‌ని బట్టి ఉంటుంది. నోకియా 4.5 అంగుళాల ఎల్‌సీడీని, హెచ్‌టీసీ సూపర్ ఐపీఎస్ ఎల్‌సీడీని కలిగి ఉన్నాయి.

కనెక్టివిటీ
డేటా స్పీడ్ అన్నింట్లోనూ (ఎల్‌టీఈ) సేమ్. వై-ఫై కూడా అన్నింట్లో సేమ్. బ్లూటూత్‌లో మాత్రం నోకియా 3.1నే వాడితే వెనకబడి ఉండొచ్చు. యాపిల్ ఫోన్‌ని లైటెనింగ్‌తో, మిగిలినవాటిని మైక్రో యూఎస్‌బీలతో కనెక్ట్ చేసుకోవచ్చు.
HTC-One-X-add1
ప్రాసెసర్
ఇక చాలు అనుకుంటే అన్నీ సరిపోతాయి. లేదంటే ఏదీ సరిపోదు. అందుకే యాపిల్ సరికొత్త సీపీయూని పరిచయం చేసింది. మిగిలినవన్నీ 1.5 జీహెజ్‌జెడ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌ని వాడుతున్నాయి. ర్యామ్ విషయానికి వస్తే యాపిల్ టీబీఏని వాడుతోంది. మిగిలిన వాటిల్లో స్యామ్‌సంగ్ 2 జీబీ ర్యామ్‌ని కలిగి ఉంటే హెచ్‌టీసీ, నోకియా 1 జీబీ ర్యామ్‌నే కలిగి ఉన్నాయి.

స్టోరేజీ
స్టోరేజీ విషయానికి వస్తే యాపిల్‌లో 16, 32, 64 జీబీ ఫోన్లను ఎంచుకునే అవకాశం ఉంది.

స్యామ్‌సంగ్, నోకియాలలో 16, 32జీబీ మాత్రమే ఉన్నాయి. హెచ్‌టీసీలో 32 జీబీ మాత్రమే ఉంది. ఒక స్యామ్‌సంగ్‌లో మాత్రమే మైక్రో ఎస్‌డీ కార్డ్‌ని వాడే ఫెసిలిటీ ఉంది.
campareesation
కెమెరా
ఫ్రంట్ కెమెరా విషయంలో అన్ని ఫోన్లు కంఫర్ట్‌గానే ఉన్నాయి. స్యామ్‌సంగ్, నోకియా కాస్త అడ్వాన్స్‌డ్‌గా ఉన్నా అన్నింటి రెజల్యూషన్ ఒకేలా ఉంటుంది. ఈ నాలుగు ఫోన్లలో రేర్ కెమెరా 8 మెగా పిక్సెల్స్ ఉన్నాయి, నోకియాలో మాత్రం 8.7 ఎంపీ కెమెరా ఉంది.

ఐఫోన్5లో ఇంటిగ్రేటెడ్ నాయిస్ రిడక్షన్, ఫేస్ డిటెక్షన్, షేర్డ్ ఫొటో స్ట్రీమ్స్, లోలైట్ షోయింగ్, జియో ట్యాగింగ్, టచ్ టు ఫోకస్, హెచ్‌డీఆర్ ఫీచర్లు ఉన్నాయి.

స్యామ్‌సంగ్ ఎస్3 కెమెరాలో దాదాపు ఇవన్నీ ఉన్నాయి. నాయిస్ రిడక్షన్‌లేదు గానీ ఫేస్ అండ్ స్మైల్ డిటెక్షన్ ఉంది.

నోకియాలో టచ్ టు ఫోకస్, జియో ట్యాగింగ్, డిజిటల్ జూమ్, సినిమాగ్రాఫ్ మేకర్, ప్రివ్యూ టెక్నాలజీ, ఆప్షనల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లు ఉన్నాయి.

హెచ్‌టీసీ వన్ ఎక్స్‌లో జియో ట్యాగింగ్, ఫేస్ అండ్ స్మైల్ డిటెక్షన్‌తో పాటు హెచ్‌డీ వీడియో అండ్ ఇమేజ్ రికార్డింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది.

0 comments: