జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది. అదే ...

By | October 01, 2012 Leave a Comment

సున్నా అంటే శూన్యం. ఏ విలువా లేకపోవడం. పూర్ణాంకాలు, సహజ సంఖ్యల సంకలనంలో.. బీజగణిత నిర్మాణంలో అదొక సంకలన తత్సమం.చారివూతాత్మకంగా సున్నా వాడుకలోకి వచ్చిన ఆఖరి అంకె. కానీ దాన్ని కనుక్కోవడం గణితశాస్త్రం మొత్తం మీద ఒక విప్లవాత్మకమైన మార్పు. తొమ్మిదో శతాబ్దంలో కర్ణాటకకు చెందిన మహావీరాచార్యుడు ‘గణిత సారసంక్షిగహం’ అనే గ్రంథంలో సున్నా గురించి రాశాడు. ఆ గ్రంథానికి 11వ శతాబ్దంలో పావులూరి మల్లన అనే కవి తెలుగులో కావ్యరూపం ఇచ్చాడు.
ఆయన సున్నా గురించి చెప్పిన పద్యం ఇది.సున్నయు, సున్నయు బెంచిన సున్నయు, తత్కృతి ఘనం సున్నయు వచ్చున్ సున్నయు లెక్కయు బెంచిన సున్నయు తానమరి యుండు సుస్థిర రీతిన్.
అంటే.. సున్నాని సున్నాతో కూడినా, సున్నాని సున్నాలోంచి తీసివేసినా.. సున్నాని సున్నాతో గుణించినా సున్నానే వస్తుంది.

అంతే తప్ప సున్నాకి విలువ లేదా? ఉంటుంది.. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ తన సైజుని ‘జీరో’కి తగ్గించుకున్నాకే ‘హాట్’ ఐకాన్ అయింది. సైజ్ జీరో అనేది దుస్తుల కొలతలకు సంబంధించిన విషయం.
30-22-32 శరీరాకృతి ఉన్నవారే ఆ దుస్తుల్లో ఫిట్ అవుతారు. కరీనా బక్కచిక్కి ఆ ‘జీరో’ బట్టల్లో ఒదిగిపోయింది. ఇంగ్లీష్ నటీ కైరా నైట్లీ, బార్బడియన్ రికార్డింగ్ ఆర్టిస్ట్ రెహాన్నా కూడా ఇలాగే సైజ్ జీరోని ట్రెండ్‌గా సృష్టించి తమ ‘విలువ’ని పెంచుకున్నారు. పార్లమెంట్‌లో జీరో అవర్ గురించి మీకు తెలిసే ఉంటుంది!ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత (మ॥ 12 నుంచి 1 గం॥ వరకు) ఉండే సమయాన్ని ‘జీరో అవర్’ అంటారు. ఈ సమయంలో ముందస్తు సమాచారం లేకుండానే ఎన్నో ప్రజలు రెయిజ్ అవుతుంటాయి. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేవే. అంటే జీరోకి విలువ ఉన్నట్లే.

జీరో సమ్ గేమ్ అనేది బిజినెస్‌కి సంబంధించిన పదం. ఇది ఒక ఆట కూడా. ఇద్దరు ఆడే ఆటలో ఒకరు పొందింది ఇంకొకరు కోల్పోయిన దానికి సమానం. అంటే అప్పటి వరకు ఒకరి దగ్గర ఉన్నది ఇప్పుడు ఇంకొకరి దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ నష్టం శూన్యం అనేది నగ్నసత్యం. అందుకే జీరోకి విలువ ఉంటుంది. దాన్ని ‘ఒక’దానికి ఎడమవైపు ఉంచితే.. ఒకటి ఒకటే అవుతుంది. అదే సున్నాని కుడివైపు రాస్తే.. ఒకటి పదవుతుంది. పది వందవుతుంది. వంద వెయ్యి అవుతుంది.
కుడివైపు రాస్తున్నా కొద్దీ దాని విలువ పెరుగుతుంది. పక్కదాని విలువనీ అది పెంచుతుంది.
ఎట్ ఎనీ కాస్ట్.. ఇట్ మస్ట్ బీ ఎట్ రైట్ సైడ్. ఫైరోగ్లఫిక్స్ ప్రకారం సున్నా అంటే ‘ధైర్యమైనది’ అనే అర్థం ఉన్నది. అందుకే సున్నా అంటే శూన్యం కాదు.. ఒక ధైర్యం. శూన్యం అంటే మొత్తం కోల్పోవడం.. ఇక ఏమీ మిగలలేదు.. అనే అర్థం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం! జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది. అదే భవిష్యత్తు!!ఇఫ్ యు లాస్ ఎవ్రీథింగ్ బీరెడీ ఫర్ యువర్ ‘బ్రైట్’ ఫ్యూచర్.

0 comments: