ఒక డైనోసార్‌ని దోమ కాటేసిoది

By | November 27, 2012 3 comments

1993లో ఒక సినిమా వచ్చింది.
పేరు ‘జూరాసిక్ పార్క్’.
అనగనగా ఒక దోమ... డైనోసార్లు జీవించే కాలంలో అది ఒక డైనోసార్‌ని కాటేస్తుంది. రక్తం పీల్చి ఆనందంతో ఎగురుతుంది. ఆకస్మాత్తుగా అదొక ఆపదలో ఇరుక్కుంటుంది. ఒక చెట్టు నుంచి కారే జిగురులో

అది చిక్కుకుని చనిపోతుంది.
కొన్ని వందల సంవత్సరాల తర్వాత...
ఆ జిగురు చరిత్ర పరిశోధకులకు దొరుకుతుంది. అందులోని దోమ రక్తం నుంచి డీఎన్‌ఏని సేకరించి శాస్త్రవేత్తలు మళ్లీ డైనోసార్లకు ప్రాణం పోస్తారు. అలా ప్రాణం పోసిన డైనోసార్లతో జూరాసిక్ పార్క్‌ని ఏర్పాటు చేస్తారు. స్పీల్‌బర్గ్ రాసుకున్న స్రిప్టు ఇది. హాలీవుడ్ సినిమాల్లో ఒక రివల్యూషన్‌ని క్రియేట్ చేసింది.
1995లో ఇంకో సైన్స్ ఫిక్షన్..
గ్యారీ జోన్స్ తీసిన ‘మస్కిటో’ సినిమా.

ఒక చిత్తడి నేలలో దోమలు అప్పుడే ప్రాణం పోసుకుంటుంటాయి.
ఆకాశం నుంచి ఒక అంతరిక్ష నౌక అక్కడ కుప్పకూలుతుంది. దాని ప్రభావం దోమలపై పడి విపరీతంగా పెరిగి వికృతంగా ప్రవర్తిస్తుంటాయి. దగ్గరలో క్యాంపు వేసుకుని ఉన్న మనుషులపై అవి దాడి చేస్తుంటాయి. వారు ఆ దోమల్ని ఎలా ఎదుర్కొన్నారనేది కథ.

ఖర్చు చేసిన బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన సినిమా ఇది. ఇప్పటికీ ఈ సినిమా డీవీడీలకు మంచి డిమాండ్ ఉంది.
ఇంతకీ విషయం ఏంటంటారా?
దోమలు!!
‘దోమలా?’
దోమే కదా అని కొట్టి పారేయకండి.
దోమ ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటోంది.
MOSQUITOS2మొన్న.. కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షిద్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కేజ్రీవాల్‌ని ఇలా అన్నాడు. ‘కేవూజీవాల్ ఎటాక్స్ అన్నీ దోమకాటులాంటివే. జస్ట్ ఇరి చేస్తయి తప్ప పెద్దగా ఏం ఉండదు’ అన్నాడు. ఇందుకు కేజ్రీవాల్ ‘నేను దోమనే. కానీ డెంగ్యూ దోమని. నేను కరిస్తే కాంగ్రెస్, బీజేపీలు కష్టాల్లో పడతాయి’ అని కౌంటర్ ఇచ్చాడు. అవును మరి. దోమకాటుకు ఉన్న పవర్ అలాంటిది.

ప్రతి సంవత్సరం మన దేశంలో 4 కోట్ల మంది దోమకాటు వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఇదే ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 50 కోట్ల మంది రోగాల బారిన పడుతున్నారు. ప్రతిఏటా 10 లక్షల మంది దోమకాటు వల్ల చనిపోతున్నారు. అంటే సెకనుకు సుమారు ఇద్దరు దోమ కాటు వల్ల చనిపోతున్నారన్నమాట.

అన్నట్లు.. కసబ్‌కి కూడా డెంగ్యూ వచ్చిందట.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్యూరిటీ ఉంచినా.. దోమ కాటేసి తన పగ తీర్చుకుంది.
కసబ్‌ని తిట్టుకుంటూ మనమూ.. మనల్ని కుట్టుకుంటూ దోమలు బతికేస్తున్నాయి.
అయినా, దోమలు మనకంటే బెటరేపూండి.

లేకపోతే.. ఊరి తీయాల్సిన వాడ్ని బిర్యానీలు పెట్టి మేపుతారా?
కసబ్‌ని కాటేస్తే ఓకే.. మరి మనల్ని? అందుకే దోమల్ని నివారించలేమా?
ఎందుకు చేయలేం... అమెరికాలో దోమల నివారణ కోసం ఏకంగా ఒక అసోసియేషనే ఏర్పడింది. 1935లో అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్ ఏర్పడి దోమల మీద పోరాటం చే...స్తూ....నే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల డాలర్లను ప్రతియేటా మలేరియా నివారణ కోసం ఖర్చు పెడుతున్నారు. అయినా దోమల్ని నివారించలేకపోతున్నారు. 2020 కల్లా మలేరియాని అంతం చేయాలంటే ప్రతి ఏటా 500 కోట్ల డాలర్లు ఖర్చు చేయాలట.

అప్పటి వరకు మనం ఏం చేస్తాం చెప్పండి. దోమతెరలు.. ఆల్ అవుట్‌లు వాడడం తప్ప. దోమల్ని చంపడానికి మార్కెట్‌లో ఇలాంటి వస్తువులు చాలానే దొరుకుతున్నాయి. ఎలక్ట్రిక్ బ్యాట్‌లు, మస్కిటో కాయిల్స్.. ఇలాంటి వాటికి సంబంధించి మన దేశంలో రెండు వేల కోట్ల రూపాయల మార్కెట్ నడుస్తోంది.
చాలా పెద్ద మార్కెట్ అన్నమాట.
దోమకాటు వల్ల వచ్చే రోగాలదీ చాలా పెద్ద లిస్టే ఉంది. వాటికి డాక్టర్లు రాసే మందులది.. హాస్పిటల్ వారు వేసే బిల్లులదీ.. అదే రేంజ్.

ఇంత టెక్నాలజీ.. ఇంత మోడ్రనైజేషన్ ఉన్న తర్వాత కూడా.. ఏమీ చేయలేమా?
ఏం చేస్తాం. అంతకంటే ప్రమాదకరమైన మనుషుల్ని.. ప్రభుత్వాల్ని మనం భరించి.. భరించి అలవాటైంది.
ఎండాకాలం చెమటలా..
వానాకాలం బురదలా..
శీతాకాలాం దోమలదీ కూడా ఒక విడదీయరాని ప్యాకేజీ అని మెల్లగా బతికేయడం తప్ప ఏం చేస్తాం.
మారాలంటే లోకం.. మారాలంటే మనమే.

వీళ్ళనూ చంపింది...
-అలెగ్జాండర్ ది గ్రేట్ (356-323 బీసీ).
- చంగిజ్‌ఖాన్ (మొఘల్ చక్రవర్తి).
- పోప్ గ్రెగరీ (ఐదో జర్మన్ చక్రవర్తి).
- లార్డ్ బైరాన్ బిటీష్ కవి).
- అమ్రిష్ పురీ (బాలీవుడ్ నటుడు).
- 40 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే దోమలు ఉన్నట్లు ఆధారాలున్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా 3,500 రకాల దోమలు ఉన్నాయి. వీటిలో వంద రకాలు మాత్రమే మనుషుల్ని కుడతాయి.
- దోమ జీవితకాలం మూడు నెలల లోపు మాత్రమే. మగదోమలు పది పదిహేను రోజుల కంటే ఎక్కువ బతకవు.
- ఒక సాధారణ దోమ 2.5 మిల్లీ గ్రాముల బరువు ఉంటుంది.
- దోమ ఒక సెకన్‌కు 500 సార్లు తన రెక్కల్ని కదిలించగలదు.
- దోమ గంటకు ఒకటి నుంచి రెండు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదు.
- దోమ కాటేసినప్పుడు ఒక లీటరులో 500 కోట్ల వంతు రక్తాన్ని మాత్రమే పీల్చుకుంటుంది.
- దోమలు మగవాళ్ల రక్తం కంటే ఆడవాళ్ల రక్తాన్నే ఎక్కువగా ఇష్టపడతాయట.
(25 nov 2012)

3 comments:

వెన్నెల రాజ్యం1 said...

ఎక్స్లెంట్

వెన్నెల రాజ్యం1 said...

ఎక్స్లెంట్

G.P.V.Prasad said...

మళ్ళీ మనిషి పుట్టడానికి కారణం అయ్యే దోమని ఎలా చంపుతారు(Jurassic Park)