Skip to main content

మోడర్న్ హభ్బీ : అతడు ఆమెలో సగం



కార్యేషు దాసి కరణేషు మంత్రి.. భోజ్యేషు మాత.. శయనేషు రంభ... అని భార్య ఎలా ఉండాలే చెప్పారు కానీ.. భర్త ఎలా ఉండాలో ఎవరూ చెప్పలేదు. బహుశా పురాణాలు మగవాళ్లు రాయడం వల్ల వాళ్లకీ ప్రశ్నలు తలెత్తకపోవచ్చు. మగువ ఇలా ఉండాలి.. అని చెప్పడంలోనే.. మగాడూ దానికి ప్రతిగా.. పాజిటివ్‌గా ఉండాలనే అర్థమూ ఉంది. అంటే ఎలా ఉండాలి? ఈ మోడర్న్ హజ్బెండ్స్ ‘మిక్స్ అండ్ మ్యాచ్’ నుంచి తెలుసుకోండి. 
 ప్రపంచంలో సక్సెస్ అయిన చాలా కంపెనీల సీఈవోలు ఆడవాళ్లే అనేది ఒక సర్వే. పతనమవుతున్న కంపెనీలలో ఆడవాళ్లు లీడ్ చేస్తున్న వాటి కంటే మగవాళ్లు లీడ్ చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయనేది ఇంకో అధ్యయనం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. కానీ ప్రతి స్త్రీ విజయం వెనుక అన్ని సార్లూ పురుషుడు ఉండకపోవచ్చు. మహిళ సంపాదన పరురాలైతే ఈ సమాజం గౌరవిస్తుంది. ఆ కుటుంబ కొనుగోలు శక్తి, ఆర్థిక సామాజిక స్థితి పెరుగుతుంది. మహిళ ఇప్పుడు వంటింటికి మాత్రమే పరిమితం కావడం లేదు. రైళ్లు, విమానాలు నడుపుతోంది. అంతరిక్షంలో అడుగుపెట్టింది. ఆమె అలా ఎదగాలంటే ఆ కుటుంబం సహకరించాలి. ఆమె భర్త ప్రోత్సహించాలి. ఆమె ఆకాశంలో సగం.. ఆమెలో సగం అతడు కావాలి.

అలాంటి వారే ఈ మోడర్న్ హాస్బెండ్‌లు. తాను సంపాదిస్తేనే సరిపోదు.. ఆమె కూడా పనిచేయాలి. నాలుగు రాళ్లు సంపాదించాలి అని ఎంకరేజ్ చేసే భర్తలు ఉన్నారు. ఇక్కడ మగాళ్లు టూ టైప్స్... ఒకటి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక.. తన భార్య సహకారం తీసుకునేవారు కొందరు. ఆర్థికంగా ఆయన బాగానే సంపాదిస్తున్నా... ఆమె శక్తి సామర్థ్యాలు వృథాకాకుండా, టాలెంట్ వేస్ట్ కాకుండా స్టెప్ తీసుకొమ్మనేవాళ్లు ఇంకొందరు. మహిళ వంటింటికి మాత్రమే పరిమతయ్యే కాలం కాదిది. మగాడికి తోడుగా చేదోడువాదోడుగా ముందడుగు వేస్తోంది. అందుకు మగాడు కూడా తోడుగా నిలబడాలి. అలా నిలబడి ప్రోత్సహిస్తున్న మోడర్న్ హబ్బీలు ఉన్నారు..

డౌన్ టు ఎర్త్
ఐశ్వర్యరాయ్‌ది బిగ్ ప్రొఫైల్.. పెళ్లయిన తర్వాత కూడా ఆమె నటించడంలో భర్త అభిషేక్ బచ్చన్ ఎంకరేజ్‌మెంట్ ఎంతో ఉంది. ఆయనో మోడర్న్ హబ్బీ. బాలీవుడ్ ‘బిగ్’ సెలవూబిటీ బేబీ ఆరాధ్య బచ్చన్ పుట్టిన నాలుగు నెలల తర్వాత ఐశ్వర్యారాయ్ మొదటి సారి మీడియా ముందుకు వచ్చింది. లోరియల్ ఫెమినా అందించిన ‘ది ఐకానిక్ విమెన్ ఆఫ్ వర్త్’ అవార్డు అందుకున్నప్పుడు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లినప్పుడు ఆయన పాపకు తోడున్నాడు. జ్యువెలరీ యాడ్‌లో నటించినప్పుడు షూటింగ్ స్పాట్‌లో ఆరాధ్యని ఎత్తుకుని తిప్పాడు అభిషేక్. కిరణ్‌కి ఆమిర్ ఖాన్ కూడా అలాంటి భర్తే. ఆమెతో స్క్రిప్ట్ రాయించి.. డైరెక్షన్ చేయించింది ఆమిర్‌లోని ఆ లవ్లీ నేచరే. అభిషేక్, ఆమిర్ ఫ్యామిలీ చికాగో టూర్‌కి వెళ్లినప్పుడు ఆమిర్ తన కొడుకు ఆజాద్ రావ్ ఖాన్‌ని ఎత్తుకుని ఆడించిన ఫోటోలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేశాయి. షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, హృతిక్ రోషన్ భార్య సుహానే రోషన్ ఇంటీరియర్ డిజైనింగ్‌లో గెటాన్ అవ్వడం వెనక వారి భర్తల సపోర్ట్ ఉంది. ఇండియన్ ‘మోస్ట్ బిలవ్డ్’ రైటర్ చేతన్ భగత్ కూడా మోడర్న్ హబ్బీనే. తన భార్య అనూష ముంబైలోని ఒక ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం చేసేది. ఆయన హాంకాంగ్ బ్యాంక్‌లో ఉద్యోగం మానేసి ఇప్పుడు ముంబైలోనే ఉంటున్నాడు. ఆమె ఉద్యోగానికి వెళ్తే ఆయన పిల్లల్ని చూసుకుంటూ పుస్తకాలు రాసుకుంటున్నాడు.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
చర్లపల్లి సెంట్రల్ జైలు దాటాక.. చౌరస్తాలో రైట్ తీసుకుంటే ఒక చిన్న కిరాణ దుకాణం (పాన్ డబ్బా) కనిపిస్తది. అందులో ఒక నడివయస్కురాలు పెద్ద కుర్చీ మీద కూర్చుని ఉంటది. కుర్చీ దిగితే గానీ తెలియదు.. ఆమెకు కాళ్లు లేవని. ఆమె పేరు లక్ష్మమ్మ. ఆమె భర్త వెంక ఆయనకు కళ్లు లేవు. కానీ అతను ఆమెని నడిపిస్తున్నాడు. ఆమె కళ్లతో అతను లోకం చూస్తున్నాడు. వెంక పేపర్ ప్లేట్లు తయారు చేసే పని నేర్చుకున్నాడు. ఆమె కూడా తన ‘సొంత కాళ్ల’ మీద నిలబడాలని కిరాణ డబ్బా పెట్టించాడు. ఇద్దరి పనులు ముగిశాక మూడు చక్రాల బండి మీద ఆమె కూర్చుని దారి చెబుతుంటే.. అతను నెడుతూ ఇంటికి వెళ్లిపోతారు. బ్యూటీఫుల్ లైఫ్. ఎల్‌బీనగర్ రింగ్ రోడ్డులో ఒక ఇడ్లీ బండి ఉంటుంది. తెల్లవారు జామునే ఆ బండి నడిపే యువ దంపతులు తోసుకుంటూ వస్తారు. సరుకు సరంజామా రెడీ చేసిన తర్వాత ఆయన పేపర్ వేయడానికి వెళ్లిపోతాడు. తర్వాత వచ్చి ఆమెకి సహకరిస్తాడు. మధ్యాహ్నం వరకు ఇద్దరూ పనిచేసి బండి తోసుకుంటూ ఇంటికి వెళ్లిపోతారు.

జస్ట్ ఏ మినిట్
తరతరాలుగా ఆమె అడుగుతూ వచ్చింది సగమే. అందని ఆకాశంలో కాదు.. అంది వచ్చే అవకాశాల్లో సగం కావాలని పోరాడింది నిన్నటి తరం. ఫలితంగా ప్రస్తుతతరం ఆ ఫలితాల్ని అనుభవిస్తోంది. నింగీ నేలా నాదే అంటోంది. అయినా వీటన్నింటి కంటే ఆమెకు కావాల్సింది మొగుడి మనసులో సగం. భార్యభర్తలు సంతోషంగా ఉండాలంటే భార్య భర్తని తక్కువగా ప్రేమించాలి. ఎక్కువగా అర్థం చేసుకోవాలి. భర్త భార్యని తక్కువగా అర్థం చేసుకోవాలి. ఎక్కువగా ప్రేమించాలి. ఆమె చేసే డిజైన్‌ని.. రాసే రాతని.. వేసే అడుగుని. అప్పుడు అతడు మొగుడవుతాడు. ఆమెలో సగమవుతాడు.


ఆమెలో కాన్ఫిడెన్స్ పెరిగింది..
మాకు 2001లో పెళ్లయింది. కవిత అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నేను 1996 నుంచే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాను. ఉద్యోగరీత్యా మహబూబ్‌నగర్ వెళ్లాల్సి వచ్చింది. ఆమెకు చదువుకోవాలని ఉండేది. కానీ పెళ్లైన ఏడాదికే బాబు పుట్టాడు. ఆమె చదువు అలాగే ఆగిపోయింది. 2006లో నేను హైదరాబాద్ వచ్చి కాచిగూడలో పనిచేస్తున్నాను. అప్పటికి మాకు ఇద్దరు పిల్లలు. పెద్దయ్యారు.. స్కూల్‌కు వెళ్లేవారు. అప్పుడు కవిత తిరిగి చదువుపై కాన్సన్‌వూటేట్ చేసింది. డిగ్రీ ఎనిమిది బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఒకే ఎటెంప్ట్‌లో అన్నీ పాస్ అయింది. నేనూ కాంపి పరీక్షలు రాసి ఉండడం వల్ల ఆమెని అటువైపు ఎంకరేజ్ చేశాను. దిల్‌సుఖ్‌నగర్‌లో కోచింగ్ ఇప్పించాను. నేను డిపార్ట్‌మెంట్‌లో ఉండడం వల్ల కాస్త బిజీగానే ఉండేవాణ్ణి. అయినా ఆమె క్లాసుకు వెళ్లినప్పుడు నాకు దొరికిన టైమ్‌లో పిల్లల్ని చూసుకునేవాణ్ణి. వాళ్లని ఉదయాన్నే స్కూల్‌కు రెడీ చేయడం.. సాయంత్రం హోమ్ వర్క్‌లు చేయించడం.. లాంటివి చేసేవాడ్ని.


కవిత కష్టపడి చదివి 2010లో ఫస్ట్ ఎటెంప్ట్‌లోనే గ్రూప్ 2 సర్వీసెస్ గట్టెక్కింది. ఇప్పుడు రంగాడ్డి ట్రెజరీ ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. నేను లకిడీకాపూల్ ఇంటలిజెన్స్‌లో సీఐగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇద్దరం బిజీ. అయినా పనులు పంచుకుని చేస్తున్నాం. తను ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంది. తెలంగాణ ట్రెజరీ అసోసియేషన్‌కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తోంది. విమెన్ రిప్రజెం ఉంటు మంచి యాక్టివిటీస్ చేస్తోంది. ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతోంది. ఒక విషయం ప్రధానంగా చెప్పాలి... కవిత ఉద్యోగం చేయడానికి, ఇప్పుడు చేస్తున్నప్పటికి ఒక మంచి మార్పు గమనించాను. పోలీస్ ఉద్యోగం అంటే ఇంట్లో వాళ్లు అనుక్షణం భయపడతారు. ఎప్పుడు ఏమవుతుందో అని.. ఉద్యోగం అలాంటిది... ఇప్పుడు ఆమెలో ఆ భయం పోయింది. ధైర్యం పెరిగింది. ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ ప్రతి భర్తా తన భార్యలో పెంచాలి.
- పాపాని గోపాల కృష్ణ, సీఐ (ఇంటలిజెన్స్)



couples2 టాలెంట్‌ని వేస్ట్ చేయకూడదని..
నీలిమ చిన్నప్పటి నుంచి బొమ్మలు బాగా వేస్తుంది. 2004లో మా పెళ్లయింది. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. పెళ్లయ్యేనాటికి తన పీజీ పూర్తయింది. నేను మంచి పొజిషన్‌లోనే ఉన్నాను. అయినా తను ఉద్యోగం చేస్తానంది. తను చదువుకుంది పైగా ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతోంది. ఎందుకు కాదనడం అని ఓకే అన్నాను. ఒక సంవత్సరం పాటు చేసింది. అప్పుడు మాకో బాబు పుట్టాడు. ఉద్యోగానికి రాజీనామా చేసింది. బాబు పెరిగి పెద్దయ్యాడు. నీలిమ బొమ్మలు వేస్తుండేది. రకరకాల డిజైన్లు చేస్తుండేది. ఐర్లాండ్‌లో ఉండే తన ఫ్రెండ్ పద్మ డ్రెస్ డిజైనింగ్ నేర్చుకొమ్మని ఎంకరేజ్ చేసేది. నేను కూడా తన టాలెంట్‌ని వేస్ట్ చేయకూడదని ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొమ్మన్నాను. 2006 లకోటియా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది.  తను చేసిన డిజైన్స్‌ని ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఇప్పుడు ఇలా బిజీ అయిపోయింది. తన కస్టమర్లు అందరూ ఎక్కువగా అబ్రాడ్‌లోనే ఉన్నారు. అప్పుడప్పుడు చాలా బిజీగా వర్క్ చేస్తూ ఉంటుంది. నేను ఫైవ్ డేస్ ఆఫీస్‌కి వెళ్తాను. వీకెండ్‌లో టూ డేస్ ఖాళీగానే ఉంటాను. అప్పుడు తనకు కావాల్సిన మెటీరియల్స్ రాసిస్తే వెళ్లి తీసుకొస్తుంటాను. లేదంటే ఇద్దరం సరదాగా అలా వెళ్లి తెచ్చుకుంటాం. ఆడవాళ్లకు ఫైనాన్సియల్ లీనియన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఒక పూర్ ఫ్యామిలీ ఉందనుకోండి.. అతను కష్టపడి పనిచేస్తాడు. కానీ లిక్కర్‌కు అడిక్ట్ అయ్యాడనుకుందాం. అతడు పోతే ఆ ఇల్లాలి పరిస్థితి ఏం కావాలి? అందుకే ప్రతి మహిళా సంపాదనపరురాలు కావాలి.
- యతీంద్రనాథ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...