Skip to main content

నా కథకు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అవార్డు


వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
19 ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన

"శ్రీ జయ నామ సంవత్సర ఉగాది (మార్చ్ 31, 2014సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 19  ఉగాది ఉత్తమ రచనల పోటీ లో  నేను రాసిన ’అపరిచితుడు‘ అనే కథ ఉత్తమ రచనగా ఎంపికయ్యింది. తొలిసారిగా నిర్వహించిన యువతరం విభాగంలో ఈ కథ ఎంపికైంది.
త్వరలో ఈ కథ కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ఇతరపత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.

10tv వీడియో ఇక్కడ చూడొచ్చు.. 

ప్రధాన విభాగం – 19  సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
ఎత్తరుగుల ఇల్లు –మధు పెమ్మరాజు, Katy, TX.  ($116 నగదు పారితోషికంప్రశంసా పత్రం)
భార్య విద్యలో బి.ఏ – కలశపూడి శ్రీనివాస రావు, New York, NY  ($116 నగదు పారితోషికం,ప్రశంసా పత్రం)
జీవన చిత్రం –గంధం యాజ్ఞ్యవల్క్య శర్మ, నరసరావు పేట  (ప్రశంసా పత్రం)
ఏం మాయ చేసావో !!. కోసూరి ఉమాభారతి, Houston, TX  (ప్రశంసా పత్రం)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
జన్మ – యోగానంద్ సరిపల్లి (San Jose)  ($58 నగదు పారితోషికంప్రశంసా పత్రం)
కృతజ్ఞతలు -నారాయణ గరిమెళ్ళHerndon, VA  ($58 నగదు పారితోషికంప్రశంసా పత్రం)
రహదారిలో గడ్డిపోచలు  -  డా.మాదిన రామకృష్ణ ( చెస్టర్ ఫీల్డ్,ఇంగ్లండ్.)  (ప్రశంసా పత్రం)
స్వేదం – భరత్ భూషణ్ రెడ్డి (హైదరాబాద్(ప్రశంసా పత్రం)
=======================================================================
మొట్టమొదటి రచనా విభాగం-5  సారి పోటీ
 "నా మొట్ట మొదటి కథ” విభాగం విజేతలు
సారీ సెంటర్” –టి. నవీన్ (హైదరాబాద్($116 నగదు పారితోషికంప్రశంసా పత్రం)
ఆఖరి వీలునామా –భండారు విజయ (హైదరాబాద్($116 నగదు పారితోషికంప్రశంసా పత్రం)
సహజ” – బి. మెర్సీ మార్గరెట్  (హైదరాబాద్(ప్రశంసా పత్రం)
అదే నవ్వు”కుడికాల “సరోజనార్ధన్” వంశీధర్, హనుమకొండ (ప్రశంసా పత్రం)
నా మొట్టమొదటి కవిత” విభాగం విజేతలు
తాళం” – కామేష్ పూళ్ళ (యానాం): ($58 నగదు పారితోషికంప్రశంసా పత్రం)
నేనొక విహంగమై –చెన్నూరు నరేంద్ర నాథ్,  కలకత్తా ($58 నగదు పారితోషికంప్రశంసా పత్రం)
రొమాన్స్ చచ్చిపోయింది”శివ్వాల గోవింద రావు  (ప్రసంసాపత్రం)
మొదటి కవిత” – కర్రి రఘునాథ శంకర్ , యలమంచిలి  (ప్రసంసాపత్రం)
=================================================================
యువతరం విభాగం-  తొలి సారిగా ప్రవేశ పెట్టబడిన పోటీ
ఉత్తమ కవిత విభాగం విజేతలు
నా యుగం మల్లిపూడి రవిచంద్ర, Hyderabad  ($58 నగదు పారితోషికంప్రశంసా పత్రం)
అడవిలా …-ప్రసూన రవీంద్రన్, శేరిలింగంపల్లి ($58 నగదు పారితోషికంప్రశంసా పత్రం)
నిర్భయ – గొర్లె హరీష్ , కాకినాడ  (ప్రశంసా పత్రం)
ప్రవహిస్తూనే ఉంటా – దోర్నాదుల సిద్ధార్థ, పలమనేరు  (ప్రశంసా పత్రం)
ఉత్తమ కథానిక  విభాగం విజేతలు
అర్ధ శతాబ్దపు అజ్జానం – మోహిత కౌండిన్య , హైదరాబాద్  ($116 నగదు పారితోషికంప్రశంసా పత్రం)
పున్నాగ పూల జల్లు – మధురవాణిFreisingGermany, ($116 నగదు పారితోషికంప్రశంసాపత్రం)
ఆమె జీవితాన్ని జయించింది – S. V. కృష్ణ జయంతి, హైదరాబాద్  (ప్రసంసాపత్రం)
(అపరిచితుడు – నగేష్ బీరేడ్డి , రామగిరి, నల్గొండ (ప్రసంసాపత్రం)


వంగూరి ఫౌండేషన్ బ్లాగ్ ఇక్కడ చూడొచ్చు.  

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...