నువ్వు - నేను, రుమి

By | September 04, 2014 Leave a Comment

నేను నీ ఫ్యాన్ కాదు. కానీ నీ మక్డీ సినిమా చూశాను. డ్యుయల్ రోల్. నేషనల్ అవార్డ్. ఇగ్బాల్‌తో ఇంటర్నేషనల్ అవార్డ్. ఏం యాక్టింగ్ అది? సాధించావ్. చిన్న వయసులో ఎంతో సాధించావ్. అప్పటి నుంచి నీ మీద ఆసక్తి. 
సాధించాల్సింది సాధించిన తర్వాత ఇంకేం మిగిలి ఉంటుందా? అని. ఇంకేం ఉంటుంది? కోల్పోవాల్సింది ఏదో మిగిలి ఉంటుంది. అప్పటి నుంచి నిన్ను ఫాలో అయ్యాను. నువ్వు ఏమవుతావా? అని.

అప్పుడు వచ్చావ్. కొత్త బంగారులోకంలో ఎగురుదామనుకున్నావ్. రెండు మూడు సినిమాలే.. అవకాశాలు పోతున్నాయి.. అన్ని దారులూ మూసుకుపోతున్నాయి.. అప్పుడు మళ్లీ చూశాను నువ్వు ఏమవుతావా? అని.

అప్పుడు.. నీలో నటిని మాత్రమే కాదు.. మంచి ఫొటోగ్రాఫర్‌ని బయటికి తీశావ్. రుమి ఫొటో ఎగ్జిబిషన్ పెట్టావ్. పర్షియన్ కవి రుమిని పరిచయం చేశావ్. అప్పుడు నీ ఫ్యాన్ అయిపోయాను.

నువ్వు అందరిలా పాక్కుంటూ వెళ్లకు..

నీకు రెక్కలున్నాయి.. వాటిని ఎలా యూజ్ చేయాలో నేర్చుకో అంటాడు రుమి. ఆ రెక్కలు నీలో చూశాను. నటిగా అవకాశాలు తగ్గినప్పుడు ఫొటోలే ఆ రెక్కలు అనుకున్నాను.
దారులు మూసుకుపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోవచ్చు... 
కానీ నీలోన.. లోలోన శూన్యం ఉన్నప్పుడు.. నీకు కావాల్సినదేంటో తెలుసుకో.. దాంతో ఆ ఖాళీని నింపుకో.. అంటాడు రుమి. ఆ మాటలే నీకు స్ఫూర్తినిస్తే.. 
ఇంతకూ నీకు కావాల్సినదేమిటి?

స్వచ్ఛంగా నిరంతరంగా.. కోరుకుంటే అది నీకు తప్పకుండా దొరుకుతుంది... అని చెప్పారు కదా ఆయన.. బహుశా రుమికి మన సినీ రంగం గురించి.. నువ్వున్న రంగుల లోకం గురించి తెలియదు కదా.. అందుకే అలా చెప్పి ఉంటారు. అయినా నీ గురించి కాకపోయినా నువ్వున్న రంగం గురించి ఆయనో మాట చెప్పారు. 
you are not just a drop in the ocean
you are the mighty ocean in the drop.
రుమి చెప్పిన ఈ మాటలతో నువ్వు కనెక్ట్ అవ్వలేదా?
నీ జీవితం అగ్నిలో పడినప్పుడు.. నీ మంటల్ని ఇష్టపడే వారికోసం వెతికే ఉంటావు?
కనిపించకపోవచ్చు.. కని పెంచని వారు.. నీ దారి మార్చి ఉండొచ్చు..
నువ్వన్నట్లు.. నీలాంటి వారు ఇండస్ట్రీలో చాలామంది ఉండొచ్చు..
కానీ వారికి నీకు తేడా ఉందంటోంది ఈ ఇండస్ట్రీ.. సొసైటీ..
నిన్న నువ్వు కేవలం క్లవర్‌గా ఈ మాట అని ఉండొచ్చు. 
వారు నీలా డబ్బు తీసుకోలేదు. దానికి బదులుగా.. అవసరాలు.. అవకాశాలు.. తీర్చుకున్నారేమో..
కానీ నువ్విప్పుడు.. చాలా వైజ్ పర్సన్.

Do you know what you are?

You are a manuscript of a divine letter.
You are a mirror reflecting a noble face.
This universe is not outside of you.
Look inside yourself;
everything that you want,
you are already that.
రుమి ఈ మాటలు నీ కోసమే రాసిపెట్టారేమో.
నీలోకి నువ్వు ఓ సుదీర్ఘ ప్రయాణాన్ని ఎప్పుడు మొదలు పెడతావ్? ఆ నాలుగు గోడల మధ్య మొదలుపెట్టే అవకాశం ఇప్పుడు నీకు దొరికింది.

నువ్వు ఏం వెతుకుతున్నావో అదే ఇప్పుడు నిన్ను వెతుకుతోంది..

హన్సల్ మెహతా నెక్ట్స్ సినిమాలో నీకో అవకాశం ఇస్తానంటున్నారు..
ఆలోచించుకో..
అదితి రావు ఆసరయ్యేలా ఉన్నారు.
ఉపేన్ పటేల్.. ఊపిరి పోసేలా ఉన్నారు..
నిన్ననే ట్వీట్్ చేశారు..
సో..
నెవర్ గివ్ అప్..
ఆల్ ది బెస్ట్.. 

0 comments: