అప్పట్లో బ్రిటన్ ప్రధానులు, నిజాం రాజులు... ఆ తర్వాత ఒక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త మాత్రమే అక్కడ వేడుక చేసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ అది. అక్కడ ఇప్పుడు మరో వేడుక. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అర్పితాఖాన్ పెళ్లి. సల్లూ భాయ్ చెల్లి పెళ్లంటే మజాకా? లార్జర్ దాన్ లైఫ్! 250 మందికి మాత్రమే ఆహ్వానం! ఎవరు వారు? ఎంత వైభవం? ఖాన్‌సాబ్ ఖాన్‌దాన్ గురించి తెలిసిన వారిలో ఇదే ఉత్కంఠ. అర్పిత పరిణయం ఇప్పుడు హాట్ టాపిక్. బాలీవుడ్ బ్యాచిలర్ హీరో సల్మాన్‌ఖాన్ ఇప్పుడు మ్యారేజ్ బిజీలో పడ్డాడు. ఆయన చెల్లి అర్పితాఖాన్ పెళ్లి ఎక్కడనుకుంటున్నారు? ఖాన్‌ల ఖాన్‌దాన్‌కి సరితూగే ఫలక్‌నుమా ప్యాలెస్‌లో. హైదరాబాద్‌లోని పైగా నవాబుల విలాసవంతమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సల్మాన్ తన చెల్లి పెళ్లి కోసం రెండు రోజులు బుక్ చేసుకున్నారు. లార్జర్ దాన్ లైఫ్ సెలబ్రెషన్స్‌కు రెడీ అయిపోతున్నారు. ఖాన్ ఫ్యామిలీ సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సుశీల, సలీమ్ ఖాన్. సలీమ్ ఖాన్ బాలీవుడ్ యాక్టర్ కమ్ స్క్రీన్‌రైటర్‌గా ఫేమస్. 1964లో ఈయన పెళ్లి చేసుకున్నారు. సుశీలకు మరో పేరు సల్మాఖాన్. ఈ దంపతులకు నలుగురు సంతానం. వారిలో ముగ్...