Skip to main content

సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ పరిణయం

అప్పట్లో బ్రిటన్ ప్రధానులు, నిజాం రాజులు... ఆ తర్వాత ఒక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త మాత్రమే అక్కడ వేడుక చేసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ అది. అక్కడ ఇప్పుడు మరో వేడుక. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అర్పితాఖాన్ పెళ్లి. సల్లూ భాయ్ చెల్లి పెళ్లంటే మజాకా? లార్జర్ దాన్ లైఫ్! 250 మందికి మాత్రమే ఆహ్వానం! ఎవరు వారు? ఎంత వైభవం? ఖాన్‌సాబ్ ఖాన్‌దాన్ గురించి తెలిసిన వారిలో ఇదే 
ఉత్కంఠ. అర్పిత పరిణయం ఇప్పుడు హాట్ టాపిక్.

arpita-khan

బాలీవుడ్ బ్యాచిలర్ హీరో సల్మాన్‌ఖాన్ ఇప్పుడు మ్యారేజ్ బిజీలో పడ్డాడు. ఆయన చెల్లి అర్పితాఖాన్ పెళ్లి ఎక్కడనుకుంటున్నారు? ఖాన్‌ల ఖాన్‌దాన్‌కి సరితూగే ఫలక్‌నుమా ప్యాలెస్‌లో. హైదరాబాద్‌లోని పైగా నవాబుల విలాసవంతమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సల్మాన్ తన చెల్లి పెళ్లి కోసం రెండు రోజులు బుక్ చేసుకున్నారు. లార్జర్ దాన్ లైఫ్ సెలబ్రెషన్స్‌కు రెడీ అయిపోతున్నారు. 

ఖాన్ ఫ్యామిలీ


సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సుశీల, సలీమ్ ఖాన్. సలీమ్ ఖాన్ బాలీవుడ్ యాక్టర్ కమ్ స్క్రీన్‌రైటర్‌గా ఫేమస్. 1964లో ఈయన పెళ్లి చేసుకున్నారు. సుశీలకు మరో పేరు సల్మాఖాన్. ఈ దంపతులకు నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. అబ్బాయిల్లో పెద్దవాడు సల్మాన్ ఖాన్. రెండో అబ్బాయి అర్బాజ్ ఖాన్. ఈయన నటి మలైకా అరోరాని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. అర్బాజ్ తెలుగులో చిరంజీవి హీరోగా చేసిన సినిమాలో విలన్‌గా కూడా నటించాడు. సల్మాన్ చిన్న తమ్ముడు సోహెల్ ఖాన్. ఇతను కూడా నటుడే. సోహెల్ భార్య సీమ. వీరికి ఇద్దరు పిల్లలు నిర్వాన్, యోహాన్. సల్మాన్‌కు సొంత చెల్లెలు అల్వీరా ఖాన్. ఈమె అతుల్ అగ్నిహోత్రిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.. అయాన్, అలీజ్. 1981లో సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ నటి హెలెన్‌ను పెళ్లి చేసుకున్నారు. 

మరి ఎవరీ అర్పిత?


arpita-khan-salmankhan1

సల్మాన్ తల్లిదండ్రులు అర్పితను దత్తత తీసుకున్నారు. అర్పిత తల్లి ఇల్లు లేక ఫుట్‌పాత్ మీద బతికేది.. ఆమె చనిపోవడంతో అర్పిత దిక్కులేనిది అయిపోయింది. అప్పుడే సలీమ్ భార్య హెలెన్ స్పందించి అర్పితను దత్తత తీసుకుంది. కుటుంబంలో అందరికంటే చిన్నది కావడంతో సల్మాన్‌తో సహా కుటుంబ సభ్యులందరూ అర్పితను ముద్దుగా చూసుకునేవారు. సల్మాన్ ఎంత బిజీ బాలీవుడ్ యాక్టర్ అయినా అర్పితకు స్పెషల్ టైమ్ ఇస్తాడు. అర్పిత అంటే సల్మాన్‌కు చాలా ఇష్టం. తండ్రి వయస్సు ఉన్నా ఇద్దరు స్నేహితుల్లా క్లోజ్‌గా ఉంటారు. అన్ని విషయాలూ షేర్ చేసుకుంటారు. ఇద్దరి మధ్య బ్యూటిఫుల్ బాండింగ్ ఉంది. అన్నయ్య చాలా బిజీగా ఉంటారు. అయినా మా మధ్య ఈజీ గోయింగ్ రిలేషన్‌షిప్ ఉంది. కానీ సల్మాన్ భాయ్‌కి మనుషుల్ని అర్థం చేసుకోవడం పెద్దగా రాదు అని దాపరికం లేకుండానే చెబుతుంది అర్పిత. 

ఖాన్ ఫేమ్..


అర్పిత లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది. సొంతంగా ఒక ఫ్యాషన్ లేబుల్‌ను కూడా లాంచ్ చేసింది. ప్రస్తుతం లీడింగ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీతో కలిసి పనిచేస్తోంది. ఫ్యాషన్ సైడ్ ఉండడంతో అర్పితకు స్వతహాగా కొంత ఫేమ్ వచ్చింది. 

సల్మాన్ చెల్లెలుగా అర్పిత క్రేజ్ ఆటోమెటిగ్గా ఉండనే ఉంది. తన భాయ్‌తో కలిసి నటించిన హీరోయిన్లందరితో అర్పితకు మంచి స్నేహం ఉంది. సోనమ్ కపూర్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ అందరూ నాకు మంచి ఫ్రెండ్సే అని చెబుతుంది అర్పిత. 

కాస్టూమ్స్..


సల్మాన్ ఖాన్ చెల్లి పెళ్లంటే ఎలాంటి దుస్తులు వేసుకుంటారు.. ఎవరు డిజైన్ చేస్తారు అని ఖాన్ అభిమానులు ఆసక్తిగానే ఎదురు చూస్తుంటారు. అర్పిత పెళ్లి బట్టలు ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేస్తారా? సల్మాన్ ఫేవరెట్ అశ్లీ రెబెలో చేస్తారా అని టాక్ మొదలైంది. ఇంతకీ పెళ్లిలో సల్మాన్ ఎలాంటి దుస్తులు వేస్తారన్నది కూడా హాట్ టాపిక్. ఎందుకంటే సల్మాన్ సింప్లిసిటీనే లైక్ చేసే హీరో. సల్మాన్ బ్లూ జీన్స్.. బీయింగ్ హ్యూమన్ టీషర్టుల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు.

మరి పెళ్లిలో ఎలాంటి డ్రెస్.. వేస్తారు.. షేర్వానీయా.. త్రీపీస్ సూటా? అని ఫ్యాన్స్ ఎగ్జయిట్‌మెంట్. అర్బజ్ ఖాన్, మలైకా అరోరా కలర్ కో-ఆర్డినేషన్ మీద కూడా ఆసక్తి ఉంది. దుస్తుల మీద ఇంతగా ఎందుకు ఆసక్తి ఉందంటే.. సల్మాన్ బాలీవుడ్ స్టయిలిష్ స్టార్.. అర్పిత ఫ్యాషన్ డిజైనర్.. సల్మాన్ మరదలు సీమ కూడా కాస్టూమ్ డిజైనర్. ఇంత మంది ఫ్యాషన్ ఐకాన్‌లు ఉన్నవారి బిగ్ డే ఫంక్షన్‌లో దుస్తులు ఎలా ఉంటాయన్నదానిలో ఆసక్తి కామన్. 

ఖాన్‌దాన్


తల్లిదండ్రులు : తండ్రి సలీమ్ ఖాన్. 
తల్లి సుశీల (సల్మా ఖాన్). 
సలీమ్ రెండో భార్య హెలెన్.
పెద్ద తమ్ముడు : అర్బజ్ ఖాన్ భార్య మలైకా అరోరా
చిన్న తమ్ముడు : సోహెల్ ఖాన్ భార్య సీమ 
చెల్లెలు : అల్వీరా ఖాన్ భర్త అతుల్ అగ్నిహోత్రి
చిన్న చెల్లి : అర్పితాఖాన్ 
అర్పిత, ఆయుష్ ఒకరి పేర్లు ఒకరు చేతుల మీద టాటూలు వేయించుకున్నారు. అర్పిత మోచేతి మీద అప్పటికే స్టార్ షేప్ టాటూ ఉంది. ఆ స్టార్‌లో ఖాన్‌దాన్ పేర్లు మొత్తం ఉంటాయి. 

బాయ్ ఫ్రెండ్..


Arpitakhan Wedding

యాక్టర్ అర్జున్ కపూర్‌తో అర్పిత కొంత కాలం డేటింగ్ చేసినట్లు మధ్య రూమర్స్ వచ్చాయి. ఈ విషయాన్ని అర్జున్ కూడా ఒక టీవీ షోలో ఒప్పుకున్నాడు. అయితే అర్పిత ఇప్పుడు తన బోయ్‌ఫ్రెండ్ ఆయుష్ శర్మతో పెళ్లికి సిద్ధమైంది. అర్పిత, ఆయుష్ ప్రేమికులు కాకముందు నుంచి మంచి స్నేహితులు. ఆయుష్ కూడా బాలీవుడ్‌లో యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట. అందుకోసమే ఢిల్లీ నుంచి ముంబై వచ్చేశాడు. ఆయుష్ శర్మ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. 2013 నుంచి అర్పితా ఆయుష్‌తో డేటింగ్ చేస్తోంది. ఇద్దరు తమ పెద్దలను ఒప్పించి ఇప్పుడీ పెళ్లికి రెడీ అయ్యారు. 

పెళ్లి బాజా


ఎంతో కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న తన బాయ్‌ఫ్రెండ్ ఆయుష్ శర్మతో పెళ్లికి ఎట్టకేలకు అన్నయ్యను ఒప్పించింది. ఖాన్ ఇరు ఫ్యామిలీలను ఒప్పించాడు. ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి పత్రికలు కూడా పంచేశారు. ఈ పత్రికల డిజైన్ వెరీ రిచ్‌గా ఉందని టాక్. పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో డిజైన్ చేయించారు. అయితే గోల్డ్ కోటింగ్‌తో కార్డులున్నాయని టాక్ వచ్చింది కానీ కాదు. మా కార్డ్స్ చాలా సింపుల్‌గా రిచ్ లుక్‌తో ఉన్నాయని అర్పిత ట్విట్టర్‌లో చెప్పింది. అర్పిత పెళ్లి షాపింగ్‌లో సల్మాన్ ఫ్రెండ్ సంగీత బిజిలానీ హెల్ప్ చేస్తోందట. 

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...