హైదరాబాద్ నూర్జహాన్ ఈ చరిత్ర పునాదులు తవ్వుకుంటూ పోతే... పునాదుల కింద సమాధులు.. సమాధుల కింద ఎన్నో సత్యాలు. ముచ్‌కుందా నది అలాంటి ఓ సత్యాన్నే చెబుతోంది. ఒక నది రెండు తీరాలను విడదీయదు. రెండు ఒడ్డులను కలుపుతుంది. అలాంటి కలయికకు ప్రత్యక్షసాక్షి ముచ్‌కుందా. వరదకు ఎదురీదిన ఖులీ, భాగమతిల ప్రేమ నగరం.. ఈ భాగ్యనగరం.ఆ దంపతుల గారాల కూతురుదే ఈ సమాధి. కుతుబ్ షాహీ సమాధులలో హయాత్ బక్షీ బేగం సమాధి ప్రత్యేకమైనది. ఆమె ఎన్నడూ స్వయంగా పాలించలేదు. కానీ కుతుబ్ షాహీలలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉన్నది. హైదరాబాద్ చరిత్రలో ఆమె తాలూకు ఆనవాళ్లు ఇంకా సజీవంగానే మన కళ్లకు కనిపిస్తున్నాయి. గగనంలో చుక్కలు.. తోటలోని పూవులు.. కలహించక కలిసుండును.. మనుషులేల కలహించుట.. అన్న దాశరథి మాటలు గుర్తుకువస్తున్నాయి ఈ సమాధిని చూస్తే. అది ఎందుకో తెలుసుకోవాలంటే ఈ హైదరాబాద్ నూర్జహాన్ కథ వినాల్సిందే. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా చనిపోంగనే ఆయన కొడుకు అబ్దుల్లా కుతుబ్‌షా పన్నెండు సంవత్సరాల వయస్సులనే సింహాసనం అధిష్టించినాడు. ఇతను కుతుబ్‌షాహీ వంశ పరిపాలకులల్ల ఐదో రాజు. చిన్న వయస్సు వల్ల అతను కేవలం నామ్ కే వస్తే నవాబుగా ఉన్నడు. తల్లి ...