Skip to main content

Posts

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...
Recent posts

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...

పెద్ద రాతి యుగం నాటి మా ఊరు.. పజ్జూరు!

ఆదిమానవుడు ఆకులు కప్పుకునేవాడు. చెట్ల తొర్రలలో నివసించేవాడు. ఒక రాయిని మరొక రాయితో రాపడించి నిప్పు పుట్టించేవాడు. రాతి పాత్రలతో..  పరికరాలతో పని వెళ్లదీసుకునేవాడు. కానీ ఆదిమానవుడు  ఉండేవాడు?  ఏ విధమైన జీవనశైలి అవలింబించేవాడు?..  ఈ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం తెలియకపోయినా.. అక్కడక్కడా అతని ఆనవాళ్లు బయటపడు తుంటాయి. అలాంటి ప్రాంతాల్లో పజ్జూరు ఒకటి.  ఆదిమానవుడి ఆనవాళ్లు ఈ ఊరిలో వెలుగు చూస్తున్నాయి. తొలిచారిత్రక యుగం  దొరల పాలనాకాలమైన 20వ శతాబ్ది మధ్య వరకు విశిష్ట రాజ్య పరిణామాలు పజ్జూరులో అవశేషానవాళ్లుగా కనిపిస్తున్నాయి. గ్రామం: పజ్జూరు    మండలం: తిప్పర్తి     జిల్లా: నల్లగొండ     పిన్: 508247     జనాభా: 3320     వృత్తి: వ్యవసాయం తూర్పు: ఎర్రగడ్డల గూడెం    పడమర: సందనపల్లి     దక్షిణాన: పెద్ద సూరారం    ఉత్తరాన: కురువేణిగూడెం అక్షరాస్యత: 67శాతం ఎక్కడ ఉంది?:  నల్లగొండ జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో. ప్రత్యేకత ఏంటి? : సుమారు రెండు వేల ఏళ్ల చరిత్ర పజ్జ...

గుట్టను తొలచి..గుడిగా మలిచిన ఒకే ఒక్కడు

  నాడు.. రామదాసు నిలువనీడలేని శ్రీరాముడికి గుడి కట్టిస్తే..  నేడు.. ఈ పరమదాసు నరసింహుడికి గుట్టనే గుడిగా మలిచి ఇచ్చాడు!   కాకులు దూరని కారడివిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చి.. అనంత శోభ తీసుకొచ్చాడు! ఆయనో ఆధ్యాత్మిక వేత్త కాదు.. అతి సాధారణ ఓ పశువుల కాపరి!  భక్తిని శక్తిగా మార్చుకుని.. దైవసేవనే లోకసేవగా భావించి.. గుట్టను తొలిచి గుడిని చేశాడు! ఆలయమే ఇల్లుగా.. నారసింహుడి సేవే పరమావధిగా యావత్ జీవితాన్ని దైవపూజకు అంకితం చేశాడు!  85 ఏళ్ల వయసులోనూ.. వెల్చాల్ శ్రీలక్ష్మీ నరసింహస్వామికి నిత్య పూజారిగా సేవ చేస్తున్న పరమదాసు యాదవ్‌ను పరిచయం చేసుకుందాం! యాభై ఏండ్ల క్రితం అదొక కాకులు దూరని కారడవి. పశువుల కాపరులు మాత్రమే కనిపించే నిర్మాణుష్య ప్రాంతం. అలాంటిది ఇప్పుడు పచ్చని చెట్లతో.. ప్రకృతి రమణీయతతో పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం. నిత్యం పూజా వైభవకాంతితో కళకళలాడుతున్నది. ఈ అద్భుత సృష్టికి కారణం ఒక సామాన్యుడు. అంతులేని భక్తి ప్రపత్తులతో నారసింహుడిని కీర్తిస్తున్న పరమదాసు యాదవ్. వర్షం మార్చిన జీవితం  వికారాబాద్‌జిల్లా వెల్చాల్ గ్రామ సమీపంలో ఉంది ఈ ప...

ఎర్ర రొయ్యల్లో.. చింత చిగురు..శనగపప్పు.. వేస్కొని తింటే..

అబ్బ.. ఏం కాంబినేషనబ్బ ఇది? వింటేనే నోట్లో ఊరీలొస్తున్నాయి! చెరువులో నీళ్లుండి.. చేతినిండా పని ఉన్న రోజుల్లో.. చేను ఒడ్డుపై కూర్చుని రొయ్యల కూర తింటుంటే.. ఆ రుచుల ఘుమఘుమలు కిలోమీటర్ దాకా వెళ్లేవంట! చాలారోజుల తర్వాత చెరువుల్లో నీళ్లొచ్చాయి.. చేపలు.. రొయ్యల పెంపకానికి మంచిరోజులొచ్చాయి! తెలంగాణ నాటుదనపు ఘాటు వంటకమైన  ఈ రొయ్యల వెరైటీలను మనమూ రుచి చూస్తే.. ఆ మజాయే వేరప్పా.!  అరిటాకు రొయ్యలు కావాల్సినవి : రొయ్యలు : 200 గ్రా, కారం : ఒక టీస్పూన్, పసుపు : అర టీస్పూన్, గరం మసాలా : అర టీస్పూన్, అరటి ఆకు : ఒకటి, కొత్తిమీర : ఒక కట్ట, పుదీనా : ఒక కట్ట, నూనె, ఉప్పు : తగినంత తయారీ : ముందుగా రొయ్యలను బాగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీన్ని అరిటాకులో చుట్టి నిప్పుల మీద కాల్చాలి. బాగా కాలిన తర్వాత ఆకు నుంచి తీయాల్సి ఉంటుంది. వీలైతే మరో అరిటాకు తీసుకొని ఈ కూరను అందులో పెట్టి సర్వ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది.  చిట్టి ముత్యాల రొయ్యల పలావ్ కావాల్సినవి : రొయ్యలు : 200 గ్రా., బియ్యం : 250 గ్...

గమ్యం కాదు.. ఆ ప్రయాణం ఆస్వాదిద్దాం! The journey of LB sriram’s Heart films

నదీ ప్రవాహంలోకి కొత్త నీరు వచ్చినప్పుడు పాతనీరునూ కలుపుకొని పోతుంది. పాతని నెట్టేసి కొత్తది ముందుకు పోలేదు. ఈ రెండింటి మధ్య తరాల అంతరం ఉంది. నిన్నటి తరం ఒంటెద్దు బండిలో వెళ్తున్నది. ఈ తరం కారు వేగంలో వెళ్తున్నది. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ కట్ అయిపోతోంది. దూరం అంతకంతకూ పెరిగిపోతున్నది. ఆ తరమైనా ఈ తరమైనా కొత్తను పట్టుకోవాలి. పాతను పట్టుకెళ్లాలి అంటారు ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరాం. కడుపు నింపుకోవడానికి ఆయనింకా కమర్షియల్ సినిమాలు చేస్తున్నా.. మనసు నింపుకోవడానికి తనకు తాను ఇంకేదో చేయాలని ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ పేరుతో ఎల్బీ శ్రీరామ్ షార్ట్ (హార్ట్) ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈ తరం ఆయన బండి ఎక్కలేదు. అందుకే కలిసి వెళ్లొచ్చు.. వేగంగా వెళ్లొచ్చు.. భావాలూ పంచుకోవచ్చు అని ఆయనే మన కారు ఎక్కి కూర్చున్నారు. గమ్యం కాదు.. ఆ ప్రయాణం నాకిష్టం అంటున్నారు. ఏమిటా ప్రయాణం? నమస్తే అండీ! కావడి బద్ద వదిలేసి టీషర్టు వేసుకుని కారెక్కారు.. ఎలా ఉంది ప్రయాణం? నమస్తే! బావుంది. అనుకున్నదానికంటే పదిరెట్ల ఉత్సాహంగా కూడా ఉంది. రచయితగా.. నటుడుగా.. తెలుగు ప్రజల ఆదరా...

ఇలా బతకడం ఒక కల(ళ)!

ఒక చిన్న తోట.. అందులో ఇలాంటి ఓ చిన్న ఇల్లు.. అక్కడే కాసిన కూరగాయలు.. అప్పుడే పెట్టిన కోడిగుడ్లు.. ఆవు పాలు.. వేప పుల్ల.. ఈత పళ్ళు.. తాటి కల్లు.. ఇంకేం కావాలి జీవితానికి ? ఇలాంటి తోట ఉండీ అనుభవించలేక పోవడం సెల్ ఫొన్ లో బ్యాలెన్స్ ఉండీ అవుట్ గోయింగ్ కాల్ చెయ్యలేక పోవడం లాంటిదే కదా ?