Skip to main content

Posts

Showing posts from November, 2010

బెంగాల్ టు జులు మా తుఝే సలామ్‌...

రాఘవేంద్రరావు పండ్లు లేకుండా పాట, ఆర్‌. నారాయణమూర్తి ఎర్రజెండా లేకుండా సినిమా తీయరన్నది ఎంత నిజమో ఈయన ఒకే పాటని 265 భాషల్లో పాడారన్నది కూడా అంతే నిజం. అసలు అన్ని భాషలు ఉన్నాయా? అని డౌటొచ్చింది కదూ. ఉన్నాయి కాబట్టే గిన్నిస్‌ వారు వరల్డ్‌ రికార్డు ఇచ్చేశారు. మన ఎఆర్‌ రెహమాన్‌ 'మా తుఝే సలామ్‌' పాటని ప్రపంచదేశాలకు పరిచయం చేసిన ఈ తెలుగోడి పేరు సాయి మనప్రగడ. కాలిఫోర్నియాలో ఉంటున్న సాయి ఇ-మెయిల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. మా నాన్న జానప్రద బ్రహ్మ మనప్రగడ నరసింహమూర్తి, మా అమ్మ రేణుకా దేవి. ఇద్దరూ గాయకులుగా, సంగీత విద్వాంసులుగా పేరున్నవారే. సంగీతం మీద ఆసక్తి నాకు వారి నుంచి వారసత్వంగా వచ్చింది. నాకు జానపద గేయాలంటే చాలా ఇష్టం. అంతరించి పోతున్న జానపదాలని వెలుగులోకి తీసుకురావాలని నేను పరిశోధన చేస్తుండేవాడిని. అందులో భాగంగా మన దేశంలోని చాలా ప్రాంతాలు, ఇతర దేశాలు కూడా తిరిగాను. అలా తిరుగుతున్నప్పుడే మన పాటనొకటి చాలా భాషల్లో పాడాలన్న ఆలోచన వచ్చింది. మా తుఝే సలామ్‌... నేను ఎంచుకున్న పాట మన దేశ స్తులనే కాదు ఇతర దేశాల వారికి కూడా కన్నతల్లిని, మాతృదేశాన్ని గుర్తు చేయాలనుకున్నాను. మన దేశంలో అలాంటి ...

జానకి డెఫ్‌ అండ్‌ డంబే కాదు రఫ్‌ అండ్‌ టఫ్‌ కూడా... (నెలవంక - 2)

('నెలవంక' పేరుతో 'ఆంధ్రజ్యోతి-ఆదివారం అనుబంధం'లో నేను రాస్తున్న శీర్షిక. నెలలో రెండుసార్లు కనిపించే నెలవంకలా రెండు వారాలకొకసారి.)   ఆ మురికివాడలోని ఒక గుడిసెలో కిరోసిన్‌ దీపం వెలుగుతోంది. ఎనిమిది మంది పిల్లలు ఆరుబయట పడుకుని ఉన్నారు. వారి తండ్రి దీపం వెలుగులో ఏదో ఆకులు నూరి ఆ పసరు తన భార్యకు తాగించాడు. ఆమె మూడు నెలల గర్భవతి. కడుపు పట్టుకుని బిగ్గరగా ఏడ్చింది. ఆమెని ఒళ్లోకి తీసుకుని ఓదార్చాడతను. కడుపులో బిడ్డను చంపాల్సిన అవసరం వారికి ఏమొచ్చిందో! అది చూడలేక ఆకాశంలో నెలవంక మబ్బుల చాటుకు వెళ్లిపోయింది. *** ఆరు నెలల తర్వాత... ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తల్లిదండ్రుల మొహాల్లో ఊహించినట్టుగానే సంతోషం లేదు. ఎందుకంటే పుట్టింది ఆడపిల్ల. అప్పటికే వారికి ఆరుగురు అమ్మాయిలు. ఈసారీ ఆడపిల్ల పుడుతుందనే వారు పురిట్లోనే చంపేయాలనుకున్నారు. కాని ఆ తల్లి తాగిన పసరు మందు పనిచేయలేదు. పోనీ పుట్టాక ఆ బిడ్డను చెత్తకుప్పలో విసిరేద్దామనుకున్నారు. కాని కన్నపేగు కదా... మనసు రాలేదు. దేవుడి దయ ఉంటే మంచి రోజులొస్తాయనుకున్నారు. ఆ పాపకి జానకి అని పేరు పెట్టుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ తల్లి...

గజానన్స్‌ ఖజానా

పది రూపాయల బిళ్ల కనిపిస్తే పదిలంగా దాచిపెట్టుకుంటాం. ఐదు రూపాయల బిళ్లలే తప్ప నోట్లు కనిపించడం లేదని ఎవరైనా ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని పర్సులో పెట్టుకుని మురిసిపోతాం. ఇలాంటివి ఓ నాలుగైదు మన దగ్గరుంటే నలుగురికి చెప్పుకుని గర్వపడతాం. ఆ మాత్రం దానికే అంతలా ఫీలయిపోతే మరి ఈ గజానన్‌ ఎంతలా గర్వపడాలి. ఎందుకంటారా? గజానన్స్‌ ఖజానాలో అలాంటి అరుదైన నాణేలు, నోట్లు చాలా ఉన్నాయి మరి. పదహారణాల తెలుగమ్మాయి అనడం వినే ఉంటారు. కానీ అణాని ఎక్కడైనా చూశారా? నిజాం కాలం నాటి నాణేలు మ్యూజియంలో కాకుండా బయట ఎప్పుడైనా కనిపించాయా? ఏ దేశం కరెన్సీ నోటు అన్నింటికంటే చిన్నదిగా ఉంటుంది? కలర్‌ఫుల్‌గా ఉండేది ఏ దేశం కరెన్సీ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు గజానన్‌ దగ్గర సమాధానం దొరుకుతుంది.  అతని దగ్గర 195 దేశాల అరుదైన నోట్లు, 220 దేశాల నాణేలు ఉన్నాయి. ఒక్కో నోటుకు ఒక్కో కథ ఉంటుంది. ఒక్కో నాణేం వెనుక ఒక్కో చరిత్ర ఉంది. వాటిని చూపిస్తూ ఆనందంతో గజానన్‌ చెబుతుంటే చిన్నప్పుడు చరిత్ర పాఠాలు చెప్పిన సోషల్‌ టీచర్‌ గుర్తొస్తాడు. ఎప్పట్నించి? గజానన్‌ నాన్న రఘు మహబూబ్‌నగర్‌లో డాక్టర్‌. వారి ఆస్ప్రతి పక్కనే వాళ్లకు ఒక మెడికల్‌ షాప...

'పచ్చని జీవనశైలికి ఆహ్వానం'

ఆ ఇంటి తలుపుపై 'పచ్చని జీవనశైలికి ఆహ్వానం' అని రాసి ఉంటుంది. హాలులో గోడపై పచ్చని చెట్లు, సెలయేరు, ఎగిరే పక్షులు ఉన్న అందమైన వాల్‌ పోస్టర్‌ అంటించి ఉంది. పచ్చని కిటీకీ కర్టెన్లు.. పదహారు ఇరవై చెట్లు.. అక్కడక్కడా హాఫ్‌ ఓల్ట్‌ ఎల్‌ఇడి బల్బులు.. నల్లా దగ్గర అందమైన మగ్గులు కనిపిస్తాయి. ఇంట్లో ఎక్కడా ప్లాస్టిక్‌ కవర్లు మాత్రం కనిపించవు. ఆ ఇంట్లో వాళ్లు లోకం పచ్చగా ఉండాలని కలగంటున్నారు. అందుకే పచ్చని జీవన శైలికి అలవాటు పడ్డారు. 'మాలాగా మీరూ మారండి. ఈ లోకాన్ని మార్చండి. భూమి భవిష్యత్తు మీ చేతుల్లోనూ ఉంది' అని అంటున్నారు ఆ ఇంటాయన జయప్రకాశ్‌ నంబారు. లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి గ్రీన్‌ ప్లానెట్‌ విజన్స్‌ సంస్థని ఎందుకు నడుపుతున్నాడో వినండి. "అమ్మతో నాన్నతో సరదాగా ఓ సాయంత్రం.. ఆడుదాం పాడుదాం భూమిని కాపాడుదాం.. మన తరం భావితరం కలిసి భవితని కాపాడుదాం..'' ఇదే మా క్యాప్షన్‌. భవిష్యత్తు పిల్లలది. అందుకే ముందు పిల్లల్ని మార్చాలనుకున్నాను. వారి దగ్గరకు వెళ్లి పర్యావరణం గురించి ఎలా చెప్పాలి అని ఆలోచించాను. రోజుకు ఇంత చెత్త ఉత్పత్తి అవుతోందని లెక్కల్లో చ...

ఎవడు కొడితే దిమ్మ దిరిగి బొమ్మవుతుందో వాడే మైకెల్‌ జాక్సన్‌

కార్పొరేట్‌ స్కూలు పిల్లలు బడి గడప దాటకముందే ప్రపంచంతో పోటీ పడుతుంటారు. సర్కారు బడి పిల్లలు చదువు పూర్తయ్యాక కూడా ప్రపంచంతో పోటీ పడలేక ఉన్నచోటే ఆగిపోతారు. ఇద్దరూ బడిపిల్లలే అయినా ఎంత తేడా? ఈ తేడాని తుడిపేసేందుకు బొమ్మని భుజానేసుకుని ఊరూరా తిరుగుతున్నాడు కొండా శ్రీనివాస్‌. మాటలు నేర్చిన ఆ బొమ్మ తన బాస్‌ శ్రీనివాస్‌ గురించి ఏం చెబుతుందో వినండి. ఎవడు కొడితే దిమ్మ దిరిగి బొమ్మవుతుందో వాడే మైకెల్‌ జాక్సన్‌. అంటే నేనే. ఉట్టి బొమ్మనే అని తీసిపారేయకండి. ఈ బొమ్మే లేకపోతే శ్రీనివాస్‌ లేడు. శ్రీనివాసే లేకపోతే సర్కారు బడిపిల్లలకు దారి చూపించేవాడే లేడు. అంత సీన్‌ లేదంటరా? అయితే మా బాసు శ్రీనివాస్‌ గురించి మీకు చాలా చెప్పాలి. ఆయనో బతకలేని... కాదు.. కాదు బతకనేర్చిన బడిపంతులు. బడిపిల్లలకు బతుకు నేర్పుతున్న సర్కారు బడిపంతులు. నేను చిన్నప్పటి నుంచీ ఆయన వెంబడి ఏం లేను. రెండేళ్ల కిందటే నన్ను కొట్టుకొచ్చాడు.. సారీ.. కొనుక్కొచ్చాడు. అప్పుడు నేను "అసలు నన్నెందుకు తీసుకొచ్చావు?'' అని అడిగాను. "నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. వాళ్లకు మనం పాఠాలు చెప్పాలి'' అన్నాడు. "పాఠాలా!...

వేళ్లతోనే కళ్లను గెలిచాడు

పదిహేను సంవత్సరాల క్రితం... ఒకరోజు... దారుల్‌ షిఫా అంధుల పాఠశాల, హైదరాబాద్‌ తొమ్మిదో తరగతి గది ఖాళీగా ఉంది. ఒక అబ్బాయి ఒంటరిగా కూర్చుని టేప్‌ రికార్డర్‌ వింటున్నాడు. అతని పేరు పవన్‌ కుమార్‌. అంతకుముందు రోజు ఆ అబ్బాయి స్కూల్‌కి డుమ్మా కొట్టాడు. అందుకే తన ఫ్రెండ్‌ దగ్గర క్యాసెట్‌ తీసుకుని పాఠాన్ని వింటున్నాడు. టీచర్‌ చెప్పిన పాఠం అయిపోయింది. ఆ తర్వాత టేప్‌ రికార్డర్‌లో ఒక పాట వినిపించింది. ఆ పాటలో ఒక బీట్‌ అతని మనసు దోచింది. ఆ సౌండ్‌ అతని మైండ్‌లో ఫిక్స్‌ అయిపోయింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌ హోరులో కూడా అదే స్వరం అతని చె వుల్లో మారుమోగుతోంది. మెట్ల మీద చెప్పుల చప్పుడు, తెరుచుకుంటున్న తలుపు శబ్దం, నల్లా నుంచి వస్తున్న నీటి గల గల.. గదిలో తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌ సౌండ్‌.. ఇలా అన్ని శబ్దాలను ఆ స్వరంతోనే పోల్చుకుంటున్నాడు ఆ అబ్బాయి. దేనిదా శబ్దం? ఎంత మాధుర్యంగా ఉంది?...  రాత్రి నిద్రలేదు. ఉదయం ఆకలి లేదు. మూడీగా ఉన్నాడు. అమ్మతో కబుర్లు చెప్పడం లేదు. నాన్నతో ఆడుకోవడం లేదు. "ఏమైందిరా అలా ఉన్నావు'' అని అడిగారు వాళ్ల నాన్న దయాకర్‌. పవన్‌ నుంచి సమాధానం లే...