ఒక జన్మ.. రెండు జీవితాలు... ఫస్ట్ హాఫ్ ఆర్డినరీ.. సెకండాఫ్ అడ్వెంచర్... మొదటిది అందరిలాంటిదే... రెండోది ఎవరికీ అందనిది.. అతడు గెలిచాడు.. విధి మీద విజయం సాధించాడు.. అతనిది వీల్‌చెయిర్ కాదు.. విల్ పవరున్న చెయిర్. అందుకే ఈ ములాఖత్. టెన్నిస్‌కి క్రేజ్‌ఎక్కువ. అది గ్లామర్‌తో మిక్స్ అయిన ఆట. అందుకే మన సానియా మీర్జా టెన్నిస్ సెన్సెషన్ అయింది. ప్రస్తుతం ఆమె ర్యాంకు 87. కెరీర్‌లో ఆమె హైహెస్ట్ ర్యాంక్ 27. కానీ ఈ వీల్‌చెయిర్‌లో కూర్చున్న వ్యక్తి ర్యాంకు ఎంతో తెలుసా? 21. టెన్నిస్‌లో కాదు. బ్యాడ్మింటన్‌లో. ఆ రెండూ ఒకటి కాదు. దేని ప్రత్యేకత, పాపులారిటీ.. దానిదే. ఇక్కడ కంపారిజన్ ఆటలు, ర్యాంకుల గురించి కాదు. ఈయనకున్న డిఫంట్ ‘ఎబిలిటీ’ని ఎలివేట్ చేయడం గురించే. ఒకటి కన్నా రెండు పెద్దది.. కానీ ర్యాంకుల్లో రెండుకన్నా ఒకటి పెద్దది. ఇది నిజం. అలాంటి జీవితమే ఈ వన్నెల అంజన రెడ్డిది. కరీంనగర్ జిల్లాలో రాజారాంపల్లి ఒక చిన్న ఊరు. కాలువ పక్కన సాధారణ ఇల్లు.. ఒక పెట్రోల్ బంక్.. రైస్ మిల్.. ఇవన్నీ ఉన్నా ఆయనిది సింపుల్ లైఫ్. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇలా ఉన్నాడంటే నమ్మాలనిపించలేదు. 100 పర్సెంట్ ...