లవ్ ఆజ్ కల్ సినిమా గుర్తుందా? అందులో ‘జై’ ఒక ఆర్కిటెక్ట్... గోల్డెన్ గేట్ కోసం పనిచేయాలనుకుంటాడు...‘మీరా’ రిస్టోరేషన్ ఆర్కిటెక్ట్... ఇండియాలో ెసెటిలవ్వాలని ఆమె డ్రీమ్. ఇక్కడ విషయం... సినిమా స్టోరీ కాదు. రిస్టోరేషన్ గురించి... దీపికా డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి....అలాంటి థీమే ఈ అనురాధా నాయక్‌ది.‘లవ్ ఆజ్ కల్’ సినిమా సమయంలో దీపికా పదుకొన్ తాజ్‌మహల్‌ని చూడడానికి మూడుసార్లు వెళ్లిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ సినిమాలో ఆర్కిటెక్ట్‌గా పనిచేయడం వల్ల చారివూతాత్మక నిర్మాణాల పట్ల ఆమెకు ఆసక్తి పెరిగిందట. ఆమెకే కాదు... అలాంటి నిర్మాణాలంటే ఎవరికైనా ఆసక్తే ఉంటుంది. అలాంటి కట్టడాలను మనం ఇప్పుడు చూస్తున్నాం..కానీ మన ముందుతరాల వారు చూడగలరా? అప్పటి వరకు అవి కూలిపోకుండా ఉంటాయా? అంటే.. కచ్చితంగా ఉంటాయి. ఉండేలా చేయొచ్చు. అలా పురాతన కట్టడాలను పునరుద్ధరించడాన్నే రిస్టోరేషన్ అంటారు. దేశవిదేశాల్లో చదివి.. సినిమాలో దీపికలా.. ఇండియాలో పురాతన భవనాలను పునరుద్ధరించేందుకు వచ్చింది అనురాధ ఎస్. నాయక్. ఆమె మన హైదరాబాద్ ‘ఆడబిడ్డ’. 104 ఏళ్ల ఇల్లు... అనురాధ గురించి తెలుసుకునే ముందు ఆమె ఫ్లాష్‌బ...