వెబ్‌కెమెరాతో ఏం చేస్తాం? స్కైప్‌లో వీడియో చాటింగ్. అంతేనా కేవలం చాటింగ్ కోసమేనా ఇంకా దేనికీ వాడుకోలేమా? వాడుకోవచ్చు.. రకరకాలుగా. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. అదెలాగో తెలుసుకోండి. వెబ్‌కామ్... డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు ఎక్స్‌టర్నల్‌గా ఉంటుంది. ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు, టాబ్లెట్‌లలో ఇన్‌బిల్డ్‌గా ఉంటుంది. శివుడికి మూడో కన్ను ఉందో లేదో తెలియదు కానీ.. మన పీసీకి వెబ్‌కామ్ ఉంటే మనకు మూడో కన్ను ఉన్నట్లే.. ఎందుకంటే ఈ ప్రపంచాన్నే ఆ కంటితో చూసేయొచ్చు. విఠాలాచార్య సినిమాల్లో దూరదర్శినిలా పనిచేస్తూ.. దేశవిదేశాల్లో ఉన్న మన వారిని సింగిల్ క్లిక్‌తో మన కళ్ల ముందు ఉంచుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ వెబ్‌కామ్ ఇప్పుడు కేవలం వీడియో చాటింగ్ కోసం మాత్రమే కాదు.. చాలా అవసరాలకు ఉపయోగించొచ్చని చాలామందికి తెలియని విషయం. దీనికి అదనపు సౌకర్యాలను అనుసంధానం చేయొచ్చు. అద్భుతాలను సృష్టించొచ్చు. ఇందుకు కొన్ని అరుదైన సాఫ్ట్‌వేర్‌లు, ఆన్‌లైన్ సర్వీస్‌లను వారధిగా వాడుకుంటే చాలు. మీ ఇంటికి రక్షణ కవచంగా.. బార్‌కోడ్ రీడర్‌గా.. మీ కంప్యూటర్‌కి లాగిన్ పాస్‌వర్డ్‌గా ఇలా ఎన్నో రకాలుగా వెబ్‌కామ్‌ని...