1993లో ఒక సినిమా వచ్చింది. పేరు ‘జూరాసిక్ పార్క్’. అనగనగా ఒక దోమ... డైనోసార్లు జీవించే కాలంలో అది ఒక డైనోసార్‌ని కాటేస్తుంది. రక్తం పీల్చి ఆనందంతో ఎగురుతుంది. ఆకస్మాత్తుగా అదొక ఆపదలో ఇరుక్కుంటుంది. ఒక చెట్టు నుంచి కారే జిగురులో అది చిక్కుకుని చనిపోతుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత... ఆ జిగురు చరిత్ర పరిశోధకులకు దొరుకుతుంది. అందులోని దోమ రక్తం నుంచి డీఎన్‌ఏని సేకరించి శాస్త్రవేత్తలు మళ్లీ డైనోసార్లకు ప్రాణం పోస్తారు. అలా ప్రాణం పోసిన డైనోసార్లతో జూరాసిక్ పార్క్‌ని ఏర్పాటు చేస్తారు. స్పీల్‌బర్గ్ రాసుకున్న స్రిప్టు ఇది. హాలీవుడ్ సినిమాల్లో ఒక రివల్యూషన్‌ని క్రియేట్ చేసింది. 1995లో ఇంకో సైన్స్ ఫిక్షన్.. గ్యారీ జోన్స్ తీసిన ‘మస్కిటో’ సినిమా. ఒక చిత్తడి నేలలో దోమలు అప్పుడే ప్రాణం పోసుకుంటుంటాయి. ఆకాశం నుంచి ఒక అంతరిక్ష నౌక అక్కడ కుప్పకూలుతుంది. దాని ప్రభావం దోమలపై పడి విపరీతంగా పెరిగి వికృతంగా ప్రవర్తిస్తుంటాయి. దగ్గరలో క్యాంపు వేసుకుని ఉన్న మనుషులపై అవి దాడి చేస్తుంటాయి. వారు ఆ దోమల్ని ఎలా ఎదుర్కొన్నారనేది కథ. ఖర్చు చేసిన బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కలెక్ష...