2070లో ఒకరోజు..

By | November 18, 2012 Leave a Comment

కరణ్ అప్పుడే నిద్రలేచాడు.
మెయిడ్ రోబో (పని మనిషి) కాఫీ తెచ్చి ఇచ్చింది.
ఇంటి గోడలో ఇన్‌బిల్ట్ అయిన టీవీ ఆటోమెటిగ్గా ఆన్ అయింది.
టీవీ 149.. అన్నాడు.

టీవీలోని వాయిస్ రికగ్నైజేషన్‌తో టీవీ ఛానెల్ మారింది.
‘‘ఈ రోజు ఉష్ణోగ్రత 55 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు. రేడియేషన్ ఒక యూనిట్‌కి నానో గ్రే పర్ ఆవర్స్‌గా ఉంది. సేఫ్టీ గార్డ్స్ లేకుండా ఎవరూ బయటికి రావొద్దు..’ టీవీలో వార్తలొస్తున్నాయి.
స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం ఆ రోజు రాత్రి..

మైండ్‌లోని ఆలోచనలన్నీ ఆన్‌లైన్ పర్సనల్ క్లౌడ్ స్టోరేజీలో దాచిపెట్టుకున్నాడు కరణ్.
ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు.
అందుకే ‘ఈ రోజు షెడ్యూల్ ఎంటీ?’ అని మనసులో అనుకున్నాడు.
పర్సనల్ ఇంటరాక్షన్ డెస్క్‌టాప్ సిస్టమ్‌లో మైండ్ రీడర్ సాఫ్ట్‌వేర్ ఆన్ అయింది.
క్లౌడ్ స్టోరేజీ నుంచి కరణ్ మెమరీని బ్యాకప్ తీసుకుని.. లి-ఫై ద్వారా కరణ్‌తో కనెక్ట్ అయి అతని మెమరీని అప్‌గ్రేడ్ చేసింది సిస్టమ్.

ఆ తర్వాత కరణ్ రోటీన్ డైలీ షెడ్యూల్ మొదలైంది.
ఇది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ కాదు. ఆన్‌లైన్‌లో కనిపించే కొన్ని హారబుల్ ఫ్యాక్ట్ ఆధారంగా అల్లిన ఒక ఊహ. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలు, ఇన్నోవేషన్స్ ఆధారంగా కొన్ని వెబ్‌సైట్స్ ఇలాంటి విషయాల గురించి వివరిస్తున్నాయి. కావాలంటే.. వీటి గురించి చదవండి.

లి-ఫై.......
ఒక డివైజ్ నుంచి ఇంకో డివైజ్‌కి డేటాని ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తారు? డేటా కేబుల్ ఆధారంగా. ఇంకా? నిన్నటి వరకు ఇన్‌ఫ్రార్డ్.. మొన్న బ్లూటూత్.. ఈరోజు.. వై-ఫై.

మరి భవిష్యత్తులో? అదే లి-ఫై. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద వాడుతున్న 5 బిలియన్ల మొబైల్ ఫోన్లు ప్రతి నెలా 6 పెటా బైట్ల డేటాని ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాయి. అంటే 6 పక్కన 17 సున్నాల బైట్లు అన్నమాట. ఇప్పుడు వాడుతున్న వై-ఫై (రేడియో తరంగాల వైరెలెస్ కనెక్షన్)కి లేటెస్ట్ వెర్షన్‌గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది చాలా చీప్ అండ్ ఫాస్టెస్ట్ టెక్నాలజీ. ఎడెన్ బర్గ్ యూనివర్సిటీ ఇన్వెంటర్ హరాల్డ్ హాస్ లైట్ ఇంటెన్సిటీ ఆధారంగా రేడియో తరంగాల ప్రసారాన్ని కనిపెట్టాడు. ఇదే ఈ టెక్నాలజీకి మూలం.

ఈ-సెన్స్......
టచ్ స్క్రీన్ ఫోన్ల గురించి ఇప్పుడు ఎవరికైనా తెలుసు. ఫ్లాట్‌గా ఉన్న స్క్రీన్ మీద టచ్ చేస్తే.. ఫంక్షనింగ్ ఉంటుంది. స్పర్శలో ఒక ఫీలింగ్ ఉంటుంది. అది సూదిని టచ్ చేసినప్పుడు ఒకలా.. దూదిని ముట్టుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. ఆ ఫీలింగ్ ఈ టచ్‌స్క్రీన్‌లలో ఉండదు. కానీ భవిష్యత్తులో అలాంటి ఫీలింగ్స్‌ని కలగజేసేందుకు విర్చువల్ టెక్చర్స్‌ని డెవలప్ చేస్తున్నారు. ఇమేజ్‌లో పిక్సెల్స్ ఉంటాయి. వాటిని టిక్సెల్స్‌గా మార్చి ఎలక్ట్రికల్ ఫీల్డ్స్‌లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు.

మైండ్ రీడర్.........
ఇది చదువుతూ మీరేం ఆలోచిస్తున్నారో చెప్పాలా? ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇది సాధ్యం కానుంది. ఎఫ్‌ఎంఆర్‌ఐ (ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రిజోనాన్స్ ఇమేజింగ్) స్కానింగ్ ఆధారంగా నిద్రలో మీరేం కలగన్నారో కూడా చెప్పొచ్చు. క్వాంటిటేటివ్ మోడలింగ్‌తో రూపొందిస్తున్న సాఫ్ట్‌వేర్ వల్ల ఇది అందుబాటులోకి రానుంది.

హ్యాండ్‌ఫ్రీ పెన్.....
మన వాయిస్‌ని రికార్డ్ చేసి వాటిని పేపర్‌పై టెక్ట్స్ రూపంలోకి కన్వర్ట్ చేసే సాఫ్ట్‌వేర్లు ఇప్పుడున్నాయి. కానీ, ఇకపై మన మనసులోని ఐడియాల్ని పేపర్ మీద పెట్టే కాన్సెప్ట్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి. మనసులో ఒక బొమ్మ వేయాలనుకున్నాం. ఒక పెన్ ద్వారా ఆల్ట్రాసోనిక్, ఇన్‌ఫ్రార్డ్ టెక్నాలజీతో కంప్యూటర్‌కి కనెక్ట్ చేసి కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్‌లను క్రియేట్ చేయొచ్చు. ఇది పూర్తిగా అమల్లోకొస్తే బొమ్మలిక ప్రొఫెషనల్స్ మాత్రమే వేయక్కర్లేదు.

2070 కల్లా కరణ్ జీవితం అచ్చం ఇలాగే ఉంటుందని చెప్పలేం. కొన్ని పరిశోధనలు ఫెయిల్ కావొచ్చు. కొన్ని పెండింగ్‌లో ఉండొచ్చు. కానీ అవన్నీ నిజమైతే కరణ్‌లాంటి మన జీవితాలన్నీ ఇంచుమించు ఇలాగే ఉండొచ్చు.
---
క్లిక్ ఫర్ ఫ్యూచర్......
భవిష్యత్తులో ఏం జరగబోతోందీ తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్లను క్లిక్ చేయండి. ఫ్యూచర్‌ని కళ్లారా చూడండి.

www.itechfuture.com: ఇందులో ఫ్యూచర్ కాన్సెప్ట్స్, మొబైల్ ఫోన్ల రూపురేఖలు, కొత్త గాడ్జెట్ల అవతారాలు, గ్రీన్ టెక్నాలజీ మీద అవేర్‌నెస్.. ఇలాంటి విషయాలు ఉంటాయి.

www.futuretimeline.net: ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఆధారంగా.. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దీన్ని బట్టే ఈ వెబ్‌సైట్ రూపొందించారు. 2000 నుంచి 2099 వరకు సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతి ఏటా ఎలాంటి మార్పులు సంభవించ నున్నాయో పరిశోధించి రాసిన అంచనాలు ఇందులో ఉంటాయి.

www.newsoffuture.com: భవిష్యత్తులో మీరు ఎలాంటి వార్తలు వింటారు. వాతావరణంలో ఎలాంటి మార్పులుంటాయి? ఆరోగ్య సమస్యలు ఏ మేరకు పెరుగుతాయి? మానవ సంబంధాలు ఇంకా బతికే ఉంటాయా? ఇలాంటి వార్తలన్నీ తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్ క్లిక్ చేయండి.

కాలజ్ఞానం........
మార్స్ మీద క్యూరియాసిటీ పరిశోధనలు చేస్తోంది. అక్కడ జీవం ఉన్నట్లు తేలితే మనిషి కూడా అక్కడ అడుగుపెడతాడు.
హైడ్రోజన్‌తో నడిచే కార్లు అందుబాటులోకి వస్తాయి.
గూగుల్ వాయిస్ సెర్చ్‌ని ప్రవేశపెడుతుంది.
మొబైల్ ఫోన్లు బ్రేస్‌లెట్లుగా మారతాయి. సోలార్ బ్యాటరీలు పెరుగుతాయి.

0 comments: