బ్లాగ్
మిత్రులందరికీ నమస్కారం.
చాలా
రోజుల తర్వాత బ్లాగ్ రాస్తున్నాం.
కొన్ని
అనివార్య కారణాల వల్ల బ్లాగ్
కి దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఈ
సమయంలో ఫేస్ బుక్ మీద తెలుగులో
ఒక పుస్తకం రాశాను.
ముద్రణకు
సిద్ధమైంది.
అతి
త్వరలో మీ ముందుకు వస్తుంది.
దీనికి
సంబంధించి సందేహాలు,
సలహాలకు
ఆహ్వానం.
అమూల్యమైన
అభిప్రాయాలు చెప్పొచ్చు.
తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...
Comments
How many pages the book.
Kalasagar
సర్ నాకు మీ స్వీయ రచన అయిన ఫేస్‌బుక్ గైడ్ ప్రింటెడ్ బుక్ కావాలి.. నేను నిజామాబాద్ లో ఉంటాను.. ఇక్కడ చాలా చోట్ల వెతికాను కానీ మీ పుస్తకం లభించలేదు.. దయచేసి మీ పుస్తకం ఎలా కొనుక్కువలో చెప్పగలరు.. ఆన్‌లైన్ లో e బుక్ మాత్రమే అందుబాటులో ఉంది కానీ నాకు ప్రింట్ బుక్ కావాలి.. మీరు పోస్ట్ లో పంపిన మంచింది..లేకపోతే ఆది ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు.. ధన్యవాదములు..