Skip to main content

Posts

ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో..

బస్సు ప్రయాణం పుస్తకాలు చదువుకోవడానికి  బావుంటుంది. ఆచార్య హరి శివకుమార్ రాసిన  ఓరుగల్లు అసలు చరిత్ర చదువుతుంటే.. నేను బస్సులో కాదు.. టైమ్ మెషీన్‌లో కాకతీయుల  కాలం నాటికి వెళ్తున్నట్లు అనిపించింది. చారిత్రాత్మకమైన ఓరుగల్లు నగరాన్ని రాజధానిగా చేసుకుని సువిశాలమైన సామ్రాజ్యాన్ని  పరిపాలించిన కాకతీయ చక్రవర్తుల కాలం  చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పం, తేజం, త్యాగం,  చైతన్యంతో చరిత్ర పుటల్లో సుస్థిరమైన, శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారు కాకతీయులు.  ఓరుగల్లు కోటలోని తోరణ స్తంభాలను చూపించి ఇవి ఏ ఊళ్లో ఉన్నాయని అడిగితే ఎవరైనా  చెబుతారు వరంగల్‌లో అని. ఈ తోరణాల  చెంతకే ఈ ప్రయాణం.  మొబైల్‌లో గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే.. 7 నిమిషాలు.. 2.7 కిలోమీటర్స్ అని చూపించింది.  ఆటో బయలుదేరింది. ఇంకెప్పుడు వస్తుందా? అని ఒక ఎగ్జయిట్‌మెంట్. దూరంగా కోట గోడ..రెండు మట్టి గోడల తర్వాత రాతి ప్రాకారాన్ని దాటుతున్నప్పుడు వర్షం సినిమా ఇక్కడే షూట్ చేశారని ఆటోలో ఎవరో మాట్లాడుకుంటున్నారు.  క్రీ.శ. 13వ శతాబ్దంలో గణపతి దేవుడు, ఆయన కుమార్తె ...

నువ్వు - నేను, రుమి

నేను నీ ఫ్యాన్ కాదు. కానీ నీ మక్డీ సినిమా చూశాను. డ్యుయల్ రోల్. నేషనల్ అవార్డ్. ఇగ్బాల్‌తో ఇంటర్నేషనల్ అవార్డ్. ఏం యాక్టింగ్ అది? సాధించావ్. చిన్న వయసులో ఎంతో సాధించావ్. అప్పటి నుంచి నీ మీద ఆసక్తి.  సాధించాల్సింది సాధించిన తర్వాత ఇంకేం మిగిలి ఉంటుందా? అని. ఇంకేం ఉంటుంది? కోల్పోవాల్సింది ఏదో మిగిలి ఉంటుంది. అప్పటి నుంచి నిన్ను ఫాలో అయ్యాను. నువ్వు ఏమవుతావా? అని. అప్పుడు వచ్చావ్. కొత్త బంగారులోకంలో ఎగురుదామనుకున్నావ్. రెండు మూడు సినిమాలే.. అవకాశాలు పోతున్నాయి.. అన్ని దారులూ మూసుకుపోతున్నాయి.. అప్పుడు మళ్లీ చూశాను నువ్వు ఏమవుతావా? అని. అప్పుడు.. నీలో నటిని మాత్రమే కాదు.. మంచి ఫొటోగ్రాఫర్‌ని బయటికి తీశావ్. రుమి ఫొటో ఎగ్జిబిషన్ పెట్టావ్. పర్షియన్ కవి రుమిని పరిచయం చేశావ్. అప్పుడు నీ ఫ్యాన్ అయిపోయాను. నువ్వు అందరిలా పాక్కుంటూ వెళ్లకు.. నీకు రెక్కలున్నాయి.. వాటిని ఎలా యూజ్ చేయాలో నేర్చుకో అంటాడు రుమి. ఆ రెక్కలు నీలో చూశాను. నటిగా అవకాశాలు తగ్గినప్పుడు ఫొటోలే ఆ రెక్కలు అనుకున్నాను. దారులు మూసుకుపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోవచ్చు...  కానీ నీలోన.. లోలోన శూన్యం ఉన్నప్పుడ...

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అవార్డు నా కథ

అపరిచితుడు - నగేష్ బీరెడ్డి మ నుషుల్ని చూడండి! ఎవరి బిజీలో వారున్నారు. సంస్కృతి సంప్రదాయాల్లో సహజత్వాన్ని కోల్పోయి మానవ యంత్రాలుగా తయారవుతున్నారు. కృత్రిమంగా బతికేస్తున్నారు. నాలుగు రాళ్లు సంపాదించేందుకు నానా యాతన పడుతున్నారు. పక్కింటి వారెవరో పట్టించుకునేంత సమయం, తీరిక కూడా దొరకడం లేదు. అన్నట్లు.. నా పేరు శివ. పల్లెటూరులో పుట్టాను. కష్టపడి చదివాను. హైదరాబాద్ లో మంచి ఉద్యోగం సంపాదించాను. కొత్త పేట హుడా కాంప్లెక్స్ లో ఒక ఫ్లాట్ కూడా కొన్నాను. నా భార్య ప్రియా తప్ప నాకంటూ ఎవరూ లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఒప్పుకోక పోతే పెద్దల్ని కాదని వచ్చేశాం. బాగానే బతుకుతున్నాం. బాగా బతకడం అంటే బాగా సంపాదించడం కాదు. నలుగురితో కలవడం.. నవ్వుతూ బతకడం అని నేననుకుంటాను. కానీ మా అపార్ట్ మెంట్ ఇందుకు భిన్నం. ఒకరికొకరు కలుసుకుని మాట్లాడుకునేంత సమయం కూడా చాలామందికి ఉండదు. ఒక్క మా అపార్ట్ మెంట్ ఏంటి.. హైదరాబాద్ లో ఇలాంటి అపార్ట్ మెంట్స్ చాలానే ఉండొచ్చు. అంతెందుకు నెల రోజుల క్రితం మా పక్కింట్లోకి ఓ కొత్త జంట అద్దెకు దిగింది. అతని పేరు వినోద్. ఓ విచిత్రమైన వ్యక్తి. ఎవ్వరితోనూ మాట్లాడడు. పొద్దుననగ...

అవార్డ్ విన్నింగ్ స్టోరీ.. చూడండి..

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి పురస్కారాన్ని కవర్ చేస్తూ 10 టీవీ చేసిన ఒక ప్యాకేజ్. వీడియో చూడడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

నా కథకు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అవార్డు

వంగూరి   ఫౌండేషన్   ఆఫ్   అమెరికా 19 వ   ఉగాది   ఉత్తమ   రచనల   పోటీ విజేతల   ప్రకటన " శ్రీ   జయ   నామ   సంవత్సర   ఉగాది   ( మార్చ్ 3 1, 201 4 )  సందర్భంగా   వంగూరి   ఫౌండేషన్   ఆఫ్   అమెరికా వారు   నిర్వహించిన   1 9   వ   ఉగాది   ఉత్తమ   రచనల   పోటీ   లో   నేను రాసిన ’అపరిచితుడు‘ అనే కథ ఉత్తమ రచనగా ఎంపికయ్యింది . తొలిసారిగా నిర్వహించిన యువతరం విభాగంలో ఈ కథ ఎంపికైంది . త్వరలో ఈ కథ కౌముది . నెట్ అంతర్జాల పత్రిక లోనూ , ఇతరపత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి . 10tv వీడియో ఇక్కడ చూడొచ్చు..  ప్రధాన   విభాగం  –  19   వ   సారి   పోటీ ఉత్తమ   కథానిక   విభాగం   విజేతలు ఎత్తరుగుల ఇల్లు – మధు పెమ్మరాజు , Katy, TX.   ( $ 116   నగదు   పారితోషికం ,  ప్రశంసా   పత్రం ) భార్య విద్యలో బి . ఏ –  కలశపూడి శ్రీనివాస రావు , New York, NY   (...