కంప్యూటర్‌లో డేటాని బ్యాకప్ తీసుకోవడం చాలా సులభం. అందుకు డీవీడీలు, పెన్‌డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్ డిస్కులు ఉపయోగపడతాయి. కానీ అవి ఎంతకాలం భద్రంగా ఉంటాయనేది కచ్చితంగా చెప్పలేం. దీనికి ప్రత్యామ్నాయంగా పాపులర్ అవుతున్నదే ఆన్‌లైన్ బ్యాకప్ సర్వీస్. దీంతో ఒక్కసారి కమిట్ అయితే దాని మాట అదే వినదు. మీ ప్రమేయం లేకుండానే మీ డాటాని అనుక్షణం బ్యాకప్ చేస్తూ సేఫ్‌గా ఉంచుతుందన్నమాట. అలాంటి ఆన్‌లైన్ బ్యాకప్ సర్వీసుల గురించే ఈ బిగ్ స్టోరీ. మీ కంప్యూటర్ హార్డ్‌డిస్క్ డేటాతో నిండిపోయింది. ఏం చేస్తారు? ఇమేజ్‌లన్నింటికీ ఒక డీవీడీలోకి, టెక్ట్స్ ఫైల్స్‌నన్నింటినీ ఇంకో డీవీడీలోకి రైట్ చేసి పెడతారు. లేదంటే ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌లో సేవ్ చేసుకుంటారు. గీతలు పడితే సీడీ, డీవీడీ ఓపెన్ కాకపోవచ్చు. వైరస్ సోకితే ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌లో ఫైల్స్ కరప్ట్ అయిపోవచ్చు. సో.. అవి ఎక్కువ కాలం మీ డేటాని భద్రంగా ఉంచలేవనేగా? మరేం చేయాలి? దీనికి పరిష్కారం ఉందిప్పుడు. ఇంటర్నెట్ ఆధారంగా మీ డేటానంతటినీ సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇలాంటి క్లౌడ్ సర్వీస్‌లను ఉచితంగా అందిస్తున్నాయి కొన్ని ఆన్‌లైన్ బ్యాకప్ పోర్టల్స్. మరికొన్ని ఎంతో కొ...