వినండి.. వినండి.. తొలి తెలంగాణ రేడియో... విని వినిపించు లైఫ్ అందించు... ఇది చాలా హాట్‌గురూ.. లాంటి ట్యాగ్‌లైన్లు మర్చిపోండి. మన పాట.. మన రేడియో.. గుర్తుంచుకోండి.. ఎందుకంటే... బిల్‌కుల్ తెలంగాణ రేడియో మొదలైంది. ఆన్‌లైన్‌లో సరికొత్త ట్రెండ్‌ని సృష్టించబోతోంది. ఇప్పుడున్న ఎఫ్‌ఎమ్ రేడియో ప్రసారాల పరిధి కొంత వరకే ఉంటుంది. ఆ ఎఫ్‌ఎమ్ స్టేషన్‌కు 50 నుంచి 60 కిలోమీటర్ల రేడియస్‌లోనే ప్రసారాలుంటాయి. ఆ లిమిట్స్ దాటితే ఎఫ్‌ఎమ్ ఇక వినిపించదు. అంటే ఆ రేడియోలు నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితం అన్నమాట. కానీ తెలంగాణ రేడియో అలా కాదు.. ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉన్న ఏ కంప్యూటర్‌లోనైనా ఆ ప్రసారాలు వినొచ్చు. అంటే ప్రంపచ దేశాల్లో ఏ మూలన తెలంగాణ వాళ్లు ఉన్నా.. ఆ రేడియోని వినే అవకాశం ఉంది. గ్లోబల్ ఆన్‌లైన్ రేడియో ఆన్‌లైన్ రేడియో ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటున్న ట్రెండ్. ప్రాంతీయ భాషల్లో రకరకాల రేడియోలు ‘వాయిస్’ పోసుకుంటున్నాయి. తెలంగాణ నేపథ్యంలో ‘మన పాట.. మన రేడియో’ అంటూ ప్రారంభమైంది... తొలి ‘తెలంగాణ రేడియో’. మన దగ్గర ఈ నయా ట్రెండ్‌కి తెర తీసింది వరంగల్‌కు చెందిన రాజ్‌కుమార్. ‘ఎఫ్‌ఎమ్ రేడియో ప్రారంభించ...