కొందరు మెల్లగ ఎలాగో అలాగ బతికేద్దామని పట్నం వస్తుంటారు. ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటారు. వెయ్యి, రెండు వేలు పెరిగే జీతం కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటారు. పెరిగే ధరల్ని నిందిస్తూ కూర్చుంటారు. అద్దె ఇంటితో అవస్థ పడుతుంటారు. సొంత ఇంటి కల వారికి కలగానే మిగిలిపోతుంది. కానీ, ఇంకొందరు అలా కాదు. ‘బిజినెస్‌మేన్’ సినిమాలో మహేష్‌బాబులా ఉంటారు. తమ కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. ‘రిచ్ డాడ్’ గురించి మీకు తెలుసా? అమెరికా రచయిత రాబర్ట్ కియోసా ‘రిచ్ డాడ్ - పూర్ డాడ్’ అని ఒక పుస్తకం రాశాడు. ‘పూర్ డాడ్ పొదుపు చేయమని చెప్తే, రిచ్ డాడ్ మదుపు చేయమని చెప్తాడు. పొదుపుకి మదుపుకి ఒక అక్షరమే తేడా. కానీ వాటి లక్షణమే వేరు. దాన్ని అర్థం చేసుకోవడమే బిజినెస్’ అంటారు కియోసాకి. ఉద్యోగం చేసే వాడు కేవలం ఉద్యోగిగానే మిగిలిపోతాడు. ‘బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది’ అని తన కొడుక్కి నూరిపోస్తాడు. ఆ కొడుకూ అలాగే చేస్తాడు. కానీ రిచ్ డాడ్ అలా కాదు. తన కొడుక్కి డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తాడు. ‘డబ్బు వృథాగా ఖర్చు పెట్టకు’ అని ఆయన ఎప్పుడూ చెప్పడు. దాంతో ఆడుకొమ్మంటాడు. అందుకే కొందరు డబ్బుతో ఆడుకొంటు...