Skip to main content

Posts

మాకు పట్టెడన్నం కాదు.. గుప్పెడు ప్రేమ కావాలి

'అతడు' సినిమా చూసినప్పటి నుంచి నన్నో మాట వెంటాడుతూనే ఉంది. ఆ సినిమా చివర్లో నాజర్‌ మహేష్‌ బాబుతో ఇలా అంటాడు- 'నాకు ఈ వయసులో కావాల్సినవి జ్ఞాపకాలు. అవి నీ వల్ల చాలానే ఉన్నాయి' అని. అలాంటి జ్ఞాపకాలు నాకూ కావాలి. వాటి కోసం చాలా రోజులు వెతికాను. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. అలా జ్ఞాపకాలు మూటగట్టుకున్నవారి కోసం కూడా గాలించాను. చివరికి దొరికారు. ఒక రోజంతా వారితో గడిపిన అనుభూతి నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. ఆ అనుభవాలనే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ వెళ్లే దారిలో ఇబ్రహీంపట్నం అది. అక్కడి నుంచి నాయినంపల్లి వెళ్లే మార్గంలో వినోభానగర్‌ ఉంది. అక్కడ పచ్చని చెట్ల మధ్య పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది ఓ ఆశ్రమం. జనజీవనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో కనిపిస్తుంది మాతాపితరుల సేవాసదనం. అనాథలుగా మిగిలిన వృద్ధుల పాలిటి అమ్మఒడి అది. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం12.30 గంటలు గణగణా గంట మోగింది. భోజన సమయం అయిందనడానికి అది సంకేతం. ఓ గదిలో మంచంపై లేవలేని స్థితిలో మూలుగుతూ పడుకొని ఉంది ఓ వృద్ధురాలు. ప్లేటులో భోజనం పెట్టుకుని వచ్చి ఆమెని లేపింది ఓ పెద్దావిడ. ఆమె భుజాలు పట్టుక...

ఎంఎన్‌జెలో ఒక రాత్రి (పార్ట్-1)

ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌ ... రాత్రి పదిగంటలు... మెయిన్‌ గేటుకు ఎడమవైపు మూలన చిన్న గుడి ఉంది. అమ్మ వారి ముందు దీపం వెలుగుతోంది. దీపం పక్కనే నాలుగు అగరుబత్తీలు కాలుతున్నాయి. వాటినెవరో అరటిపండుపై గుచ్చారు. పసుపూ, కుంకుమా చల్లారు. గుడి పక్కన ఓ పది పదిహేను బైకులు పార్క్‌ చేసి ఉన్నాయి. "నాలుగైదుసార్లు బయటికి వెళ్తుంటాం. వస్తుంటాం. వెళ్లొచ్చిన ప్రతిసారీ ఐదు రూపాయలివ్వాలా?'' అంటూ పార్కింగ్‌ టోకెన్‌ అడిగిన కుర్రాడితో గొడవ పడుతున్నాడో పెద్దాయన. పార్కింగ్‌ వెనకాల వరండా. ఆ వరండాలో ముగ్గురు పడుకున్నారు. ఇద్దరు కూర్చున్నారు. పడుకున్న వారిలో ఇద్దరికి దుప్పట్లు కూడా లేవు. నేల మీదే పడుకున్నారు. ఒకావిడ స్తంభానికి ఆనుకుని కూర్చుంది. ఆమె ఒళ్లో ఓ చిన్నారి పడుకుంది. కాళ్లు ముడుచుకుని పడుకున్న ఆ పాపని జో కొడుతోంది ఆ తల్లి. చంటిది హాయిగా నిద్రపోతోంది. ఆ అమ్మ మాత్రం శూన్యంలోకి దీనంగా చూస్తోంది. కుడివైపు ప్రహరి వెంబడి ఆంబులెన్స్‌ ఆగిఉంది. ఆంబులెన్స్‌కు, గోడకి మధ్య సందులో ఒకాయన బీడీ కాలుస్తున్నాడు. ఆంబులెన్స్‌ దాటాకా గోడ పక్కన ఇద్దరు కూర్చున్నారు. అందులో మాసిన గడ్డం ఉన్న వ్యక్తి అన్నం పొట్లాం ...

స్లీపింగ్‌ బ్యూటీ

ఔను మేం వెళ్లిపోతున్నాం. ఈ ఊరికి దూరంగా, అయినవాళ్లందరినీ వదిలి. మీరు లేచిపోవడమే అనుకోండి. కానీ ఏం చేయను? వాళ్ల అమ్మానాన్న ఒప్పుకోవడం లేదు. రేపే తనకి నిశ్చితార్థం. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఈ నిర్ణయం. నేను, మనూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా విషయం తెలిశాక మనూని చదువు మాన్పించారు తనవాళ్లు. తర్వాత సొంత ఊరికి తీసుకెళ్లారు. శ్రీళైలంలో రే పు మా పెళ్లి. ఏర్పాట్లు చేయమని భరత్‌ని పంపించా. నిద్రేమో రావట్లేదు. కానీ పడుకోవాలి. పొద్దున్నే మెలకువ వస్తుందో లేదో? --- అలారం మోగింది. ఉలిక్కి పడి లేచా. టైమ్‌ ఎనిమిది గంటలు. మనూ బయలు దేరిందో లేదో? స్నానం చేసి తయారయ్యాక ఫోన్‌ తీశాను. రాత్రే కదా ఛార్జింగ్‌ పెట్టింది. అప్పుడే డెడ్‌ అయిందేంటి? కరెంటు కూడా లేదు. బయటికెళ్లి కాయిన్‌బాక్స్‌ నుంచి ఫోన్‌ చేశాను. మొబైల్‌ స్విచ్డ్‌ ఆఫ్‌. ఏమైంది తనకి? కొంపదీసి ఇంట్లో తెలిసిపోయి ఉంటుందా? లేకపోతే... అలా అయితే ఈ రోజు తన ఎంగేజ్‌మెంట్‌. "ఆటో!... స్టేషన్‌'' మనూకి ఏమై ఉంటుంది. స్టేషన్‌కి వచ్చే వరకు ఫోన్‌ ఆన్‌ చేయొద్దనుకుందా? లేకుంటే ఈ రిస్క్‌ ఎందుకని బావని చేసుకోవడానికి ఒప్పుకుందా? ఛీఛీ.. నేనేంట...

మనసంతా మ...మ్మ.. మాస్‌

జూబ్లీహిల్స్‌ స్కార్లెట్‌ క్లబ్‌... సర్రున ఓ కారు వచ్చి ఆగింది... నలుగురు స్త్రీలు... తలకు పాగాలు.. నుదుట నల్లని తిలకం.. చేతిలో తుపాకులతో అందులోంచి దిగారు... అక్కడి వారంతా వారిని చూసి బందిపోటు దొంగలనుకుని భయపడ్డారు. ఆ హోటల్‌ వారు కూడా కంగారు పడ్డారు. అంతలోనే తేరుకుని ఆరాతీస్తే... ఓ పార్టీకి సరదాగా ఆ గెటప్‌లో వచ్చారని తెలుసుకుని నాలుక కరుచుకున్నారు. 'మామా... కల్లు మామా..' పాట చూశారుగా మాఫిమా గ్యాంగ్‌ పార్టీ ఎలా ఉంటుందో. మాఫియా డాన్లంటే మగాళ్లేనా మహిళలమూ ఏ మాత్రం తీసిపోమని సరదాగా ఆ గెటప్‌లో వచ్చారు వారు. చూశారా? వీరి మనసెంత మ... మ్మ... మాసో. మనసు అచెంచలమైనది. మనదే అయినా అది మనకు చిక్కదు, దొరకదు. కొత్తవి కోరుకోవడం దానికి కొత్తేం కాదు. మోనాటనీ అంటే దానికి మొహం మొత్తుతుంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టు నీడకై పరుగెత్తి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుంది. ఇది ఒకప్పుడు. కాని ఇప్పుడు వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ వెధవైనా తింటాడు ఐస్‌క్రీమ్‌ తినేవాడే రొమాంటిక్‌ ఫెలో అంటారు ఈ తరం వారు. ఔను అర్థరాత్రి అలా రోడ్డు మీద వెళ్తుంటే ఆన్‌ ది వ...

వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ

నేను చాలా తక్కువగా మాట్లాడతానని చాలామంది అంటుంటారు. గొప్ప వాళ్లు ఇలాగే ఉంటారని నాకు నేను సర్తి చెప్పుకునేవాన్ని. అసలు నిజం చెప్పాలంటే నాకు నేనలా ఉండడం నచ్చదు. మానవుడు సంఘజీవి. నలుగురిలో తిరుగుతూ నలుగురు స్నేహితులని వెనుక వేసుకుంటేనే బొద్దిగా లోకజ్ఞానం పెరిగినట్లు అని అర్థమైంది. కాని ఎదుటి వారు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా. అందుకే "వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ''.. సినిమాలో హ.. హ... హసినీ క్యారెక్టర్‌ డిసైడ్‌ చేసేందుకు ఇలా అడుగుతుంది. నిజమే కదా! ఒకరి గురించి తెలుసుకోవాలంటే నాలుగు మాటలు మాట్లాడాల్సిందే మరి. అందుకే ఇలా మొదలెట్టా. 'విభూషణం మౌనం అపండితానాం' అన్నారు పెద్దలు. పాండిత్యం లేని వారు మౌనంగా ఉంటేనే బావుంటుందని దీనర్థం. ఇప్పుడిది అవుటాఫ్‌ డైలాగ్‌. ఎందుకంటే పండితులైనా పామరులైనా ఇప్పుడు గల గలా మాట్లాడాల్సిందే. అలా మాట్లాడగలిగితేనే సమాజంలో నలుగురితో పరిచయాలు. నలుగురిలో గుర్తింపు. మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కానీ, మాట్లాడితే మాత్రం నలుగురు స్నేహితులు తప్పక దొరుకుతారు. వసపిట్టలా... కాలం మారింది. కళ్లతో భావాలు పలికించే వారికి కాలం చెల్లింది. నలుగురి...

ధైర్యమే ఆమె ఆస్తి

తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి... పుట్టాక ఆమె ఏడుపు ఆపేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు ఓ చేదు నిజం... ఆ తర్వాత మాట లూ రావని తెలిశాక వారి మనసులో మరో గరళం. కన్నవారి ఆదరణే కరువైతే... చుట్టూ ఉన్నవారి అభిమానం తనదౌతుందా? అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. కన్నీటి కడలిలో ఈదింది. చివరికి దరికి చేరింది. మౌనమే ఆమె భాష... ధైర్యమే ఆమె ఆస్తి... ఆమే హెలెన్‌ కెల్లర్‌ - 2007 అవార్డును అందుకున్న జానకి. జానకి డెఫ్‌ అండ్‌ డంబే కాదు రఫ్‌ అండ్‌ టఫ్‌ కూడా. తాను అనుకున్నది సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. మాటలు రాకపోతే నేం. మౌనమే ఆమె భాష. ఆమె కన్నులు కూడా మాట్లాడతాయి. ఆ భావాలు అర్థం కాని వారి ముందు ఆమె చేతి వేళ్లు సెల్‌ఫోన్‌పై చకచకా కదిలి సమాధానాలు చెబుతాయి. వినిపించకపోతేనేం ఎదుటి వాళ్ల మనోభావాలను ఇట్టే పట్టేస్తుంది. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అవి తనలాంటి వారెవరికీ ఎదురుకాకూడదనుకుంది. అందుకే బధిరుల కోసం సంస్థకు స్థాపించి వారికి సేవ చేస్తోంది. జానకిది మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట. పుట్టి, పెరిగింది మాత్రం మహారాష్ట్ర పూనేలో. చదువు కూడా అక్కడే. ఇంటర్‌ వరకు చదువుకుంది. తల్లిద...