రాఘవేంద్రరావు పండ్లు లేకుండా పాట, ఆర్. నారాయణమూర్తి ఎర్రజెండా లేకుండా సినిమా తీయరన్నది ఎంత నిజమో ఈయన ఒకే పాటని 265 భాషల్లో పాడారన్నది కూడా అంతే నిజం. అసలు అన్ని భాషలు ఉన్నాయా? అని డౌటొచ్చింది కదూ. ఉన్నాయి కాబట్టే గిన్నిస్ వారు వరల్డ్ రికార్డు ఇచ్చేశారు. మన ఎఆర్ రెహమాన్ 'మా తుఝే సలామ్' పాటని ప్రపంచదేశాలకు పరిచయం చేసిన ఈ తెలుగోడి పేరు సాయి మనప్రగడ. కాలిఫోర్నియాలో ఉంటున్న సాయి ఇ-మెయిల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. మా నాన్న జానప్రద బ్రహ్మ మనప్రగడ నరసింహమూర్తి, మా అమ్మ రేణుకా దేవి. ఇద్దరూ గాయకులుగా, సంగీత విద్వాంసులుగా పేరున్నవారే. సంగీతం మీద ఆసక్తి నాకు వారి నుంచి వారసత్వంగా వచ్చింది. నాకు జానపద గేయాలంటే చాలా ఇష్టం. అంతరించి పోతున్న జానపదాలని వెలుగులోకి తీసుకురావాలని నేను పరిశోధన చేస్తుండేవాడిని. అందులో భాగంగా మన దేశంలోని చాలా ప్రాంతాలు, ఇతర దేశాలు కూడా తిరిగాను. అలా తిరుగుతున్నప్పుడే మన పాటనొకటి చాలా భాషల్లో పాడాలన్న ఆలోచన వచ్చింది. మా తుఝే సలామ్... నేను ఎంచుకున్న పాట మన దేశ స్తులనే కాదు ఇతర దేశాల వారికి కూడా కన్నతల్లిని, మాతృదేశాన్ని గుర్తు చేయాలనుకున్నాను. మన దేశంలో అలాంటి ...