రాలిపోయిన తలవెంట్రుకలని నా చిన్నప్పుడు మా నాయనమ్మ గోడ దువ్విట్లో దాచిపెట్టేది. జడసవరాలు అమ్మేవాళ్లు వచ్చినప్పుడు ఆ జుత్తుని వాళ్లకిస్తే పిన్నీసులు, జడరబ్బర్లు ఇచ్చేవారు. ఊడిపోయిన జుత్తుకు అవి కాకపోతే ఇంకేం ఇస్తారు అని చీప్‌గా తీసిపారేయకండి. తలనీలాల వ్యాపారానికి మన రాష్ట్రంలో వందల కోట్ల రూపాయల టర్నోవర్ ఉందని మీకు తెలుసా?
పది ఇరవై ఏళ్ల క్రితం 'మొండబండ' తెగకు చెందినవారు ఊళ్లల్లో జడసవరాలు అమ్ముతూ, జుట్టును కొనుక్కెళ్లడం చాలామందికి తెలుసు. ఇప్పుడు కూడా అలాగే తీసుకెళ్తున్నారా? అని అడిగితే "ఔను. చాలా గ్రామాల్లో ఇప్పటికీ అలా జుట్టుని కొనేవాళ్లున్నారు. కాకపోతే జడసవరాలే కొనేవారు లేక అవి అంతరించి పోయాయి'' అని చెప్పారు వికాస్ హెయిర్ ఎంటర్‌ప్రైజర్స్ యజమాని పొగర్తి శంకర్. ఎనిమిది పుణ్యక్షేత్రాల నుంచి టన్నుల్లో తలనీలాలను సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారాయన.
అనాదిగా ఇదే పని
తమ్ముడు ఆదినారాయణతో కలిసి ఇరవై ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు శంకర్. వారి తాతముత్తాతలు కూడా ఇదే వృత్తిలో కొనసాగారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వెంట్రుకలు సేకరించేవారు. వాటిని సవరాలుగా తయారుచేసి అమ్మేవారు. శంకర్ తల్లిదండ్రులది ఖమ్మం జిల్లా ఖానాపురం. శంకర్ పుట్టకముందే ఆయన తల్లిదండ్రులు సికింద్రాబాద్ పార్సిగుట్టలో స్థిరపడ్డారు. వారిలా అక్కడ స్థిరపడ్డవి రెండొందలకు పైగా కుటుంబాలు ఉన్నాయిప్పుడు. ఆ ప్రాంతానికి జడసవరాల బస్తీగా పేరొచ్చింది. వీరందరిదీ ఇప్పటికీ ఇదే వృత్తి. శంకర్ తండ్రి నలభై సంవత్సరాల క్రితం బేగంబజార్‌లో జడసవరాలు అమ్మే ఒక దుకాణం పెట్టారు. ఇప్పటికీ ఆ దుకాణం ఉంది. అయితే ఇప్పుడు జడసవరాలు మాత్రం అమ్మడం లేదు. కేవలం వెంట్రుకలను కొనే పని మాత్రమే చేస్తున్నారు. "ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి చాలామంది తాము సేకరించిన జట్టును తీసుకొచ్చి మాకు అమ్ముతార''ని చెప్పారు ఆదినారాయణ.
భలే డిమాండ్
ఇళ్లలో సేకరించే జుట్టుతోనే ఇంత వ్యాపారం చేస్తుంటే తిరుపతి, యాదగిరిగుట్టలాంటి పుణ్యక్షేత్రాల్లో చాలామంది తలనీలాలు సమర్పిస్తారు కదా. మరి ఆ జుత్తుని ఏం చేస్తారు? అది ఇంకా పెద్ద వ్యాపారం. సదరు దేవాలయ నిర్వాహకులు తలనీలాల కాంట్రాక్టుకు టెండర్లు పిలుస్తారు. దేవాలయానికున్న ప్రాముఖ్యాన్ని బట్టి కొంత మొత్తాన్ని (లక్షల్లో) ముందే డిపాజిట్ చేయాలి. వేలంపాటలో ఎవరు ఎక్కువ మొత్తానికి పాడితే ఒక సంవత్సరం పాటు ఆ పుణ్యక్షేత్రంలో తలనీలాలు వాళ్ల సొత్తవుతాయి. అలా శంకర్ పదేళ్ల క్రితం ఒక దేవాలయంలో టెండర్ వేసి ఇప్పుడు ఎనిమిది దేవాలయాల్లో కాంట్రాక్టు పొందే స్థాయికి ఎదిగారు. "ఈ టెండర్లకు డిమాండ్ బాగా ఉంటుంది. తిరుపతి, శ్రీశైలంలాంటి పుణ్యక్షేత్రాల్లో కాంట్రాక్టు పొందాలంటే కోట్ల రూపాయలు కట్టాలి. మేం నల్గొండ జిల్లా చెర్వుగట్టు, వేములవాడలాంటి గుళ్లలో 20 నుంచి 30 లక్షల రూపాయలకు టెండర్లు గెలుచుకున్నాం'' అని చెప్పారు శంకర్.
వెంట్రుకల్ని ఏం చేస్తారు?
అన్ని దేవాలయాల్లోనూ రోజూ ఒకేలా తలనీలాలు సమర్పించరు. దీనికీ సీజన్ ఉంటుంది. అంటే సెలవులు, పండగలు, ఉత్సవాలు.. ఇలాంటప్పుడు ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో మామూలే. "రోజువారీ సేకరించిన వెంట్రుకలను అక్కడ మేం నియమించుకున్న సిబ్బంది ఇక్కడికి పంపిస్తారు. వాటిని ముందుగా గ్రేడింగ్ చేస్తాం. మగవారి వెంట్రుకలు పనికిరావు. ఆడవాళ్ల జుట్టుని పొడవునుబట్టి వివిధ రకాలుగా విభజిస్తాం. అవి చిక్కులు పడి ఉంటాయి, కాబట్టి వాటిని యాంక్లర్స్ ద్వారా వీడదీస్తాం. తర్వాత కొన్నింటిని పిడి కిలి నిండా తీసుకుని దారంతో కట్టేస్తాం. పైభాగాన్ని సమానంగా కత్తిరించి డబ్బాలో ప్యాక్ చేస్తాం. ఈ పనులు చేసేందుకు మా దగ్గర 30 మంది పనిచేస్తున్నారు'' అని చెప్పారు ఆదినారాయణ.
విదేశాలకూ ఎగుమతి
ఇలా వెంట్రుకలతో వ్యాపారం చేస్తున్నవారు మన రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. పార్సిగుట్ట జడసవరాల బస్తీ నుంచి ఎక్కువమంది ఖమ్మం, ఏలూరు, చెన్నై, కలకత్తాలకు ఎగుమతి చేస్తున్నారు. వికాస్ హెయిర్ ఎంటర్‌ప్రైజర్స్, ఎల్బీనగర్‌లోని మరికొన్ని ఎంటర్‌ప్రైజర్స్ బ్రెజిల్, రష్యా, అమెరికాలాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. కొన్నప్పుడు కిలో ఐదొందల రూపాయలుండే జుట్టు ప్రాసెస్ చేసి ఎగుమతి చేసేటప్పటికి 13 నుంచి 15 వందల వరకు ధర పలుకుతుంది. శంకర్ సోదరులు సంవత్సరానికి 30 నుంచి 50 టన్నుల వెంట్రుకల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మంచి లాభం వచ్చినపుడు వాళ్లు ఎవరికి తలనీలాలు సమర్పించుకుంటారో!
ఫోటోలు : ఉలుసు బ్రహ్మానందం

Comments