ఫిబ్రవరి 7న కర్నాటక శాసనసభలో ఏం జరిగింది? సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ ముగ్గురు మంత్రులు.. ! ఒక ‘నగ్న’ సత్యానికి ఇదొక మచ్చుతునక మాత్రమే...సెల్‌ఫోన్ మెమరీ కార్డుల్లో... ఇంటర్‌నెట్ యుఆర్‌ఎల్‌లల్లో... అశ్లీలం ఆనవాళ్లు అనంతం అన్నది ఆఫ్ ది రికార్డ్. గూగుల్ ట్రెండ్స్ చెబుతున్న పచ్చినిజాలివి. గమనిక : మీకు పద్దెనిమిదేళ్లు నిండితేనే ఇది చదవండి.ఇంటర్‌నెట్ పుట్టి ఇరవై ముప్పై ఏళ్లవుతోంది. ఆన్‌లైన్‌లో అశ్లీలం ఆనాటి నుంచీ ఉంది. ఇంటర్‌నెట్‌లో ‘అందుకోసం’ వెతికేవారి సంఖ్య ఈ రెండేళ్లలోనే రెట్టింపయింది. సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ చెబుతున్న లెక్క ఇది. మనదేశంలో ‘పోర్న్’ కోసం ఈ రెండేళ్లలో అంతలా వెతికారని గూగుల్ ట్రెండ్స్ రిపోర్ట్‌లో ఉంది. ‘‘నేను బిగ్‌బాస్‌లో కనిపించిన పుణ్యాన లైంగికత గురించి బహిరంగంగా మాట్లాడే ధైర్యాన్ని చాలామంది భారతీయులు పుణికి పుచ్చుకున్నారు.’’ - సన్నీ లియోన్ కరేన్ మల్హోత్రా అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, సన్నీ లియోన్ అంటే గుర్తుప చాలామందే ఉన్నారు. భారతదేశాన్ని కొంతమేరకు నీలిమయం చేసిన ఘనత ఆమెదే. ఇంటర్‌నెట్‌లో ఆమెకోసం పడిచస్తున్న వారిలో 60 శాతం మంది మన...