కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు మస్త్ ఉంటాయి... ఇంకొన్నింటి పేర్లు క్రియేటివ్‌గా ఉంటాయి...క్రియేటివిటీలో ఫీల్ ఉంటుంది...అర్థం చేసుకుంటే షాపు బోర్డులోనూ ఫిలాసఫీ ఉంటుంది. అలాంటి పేర్ల మిక్చర్ పొట్లాం.. ఈ మోర్ దాన్ మోర్. I wandered lonely as a cloud That floats on high oer vales and hills, When all at once I saw a crowd, A host, of golden daffodils; (నేను ఒంటరిగా ఒక మేఘంలా తిరిగాను. లోయలు, గుట్టల మీదుగా. అప్పుడు నేనొక సమూహాన్ని చూశాను. అందమైన గోల్డెన్ డాఫొడిల్స్ పువ్వులు అవి) విలియమ్ వర్డ్‌స్మిత్ రాసిన ‘ద డాఫొడిల్స్’ పోయమ్‌లోని మొదటి భాగమిది. ఇంటర్మీడియట్‌లో బట్టీపట్టినట్లు గుర్తు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి యూసుఫ్‌గూడ వెళ్తుంటే వెంకటగిరిలో డాఫోడిల్స్ పేరుతో ఫ్యామిలీ సెలూన్ కనిపిస్తుంది. డాఫొడిల్స్ అంటే మెట్ట తామర పువ్వులు అని అర్థం. పసుపు రంగులో అందంగా ఉంటాయవి. వర్డ్‌స్మిత్‌ని తన్మయ పరిచిన ఆ పువ్వులు సెలూన్ నిర్వాహకులనూ కదిలించి ఉంటాయి. అందుకే డిఫంట్‌గా ఉండాలని ఆ పేరు పెట్టారేమో. చూసే మనసు.. వెతికే కళ్లు ఉండాలిగానీ.. అలాంటి విభిన్నమైన ...