సీటీలో రోజుకు మూడు గంటల కరెంటు కోత.. గ్రామాల్లో పన్నెండు గంటలు... విద్యుత్‌తో అవసరం లేని లోకాన్ని.. ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించండి. రెండు రోజులు వాన కురిసినా.. రెండు రోజులు ఎండ అంతో ఇంతో కొడుతూనే ఉంది. అందుకే.. జస్ట్ ఎండలో పెడితే ‘ఎనర్జీ’నిచ్చే టెక్నాలజీని ఉపయోగించుకోండి. ఐఫోన్ ఛార్జర్ ఐఫోన్ల కోసం చాలా రకాల సోలార్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ఐఫోన్ 4 కోసం ఉపయోగించే ఛార్జర్. దీన్ని 20 నిమిషాలు సూర్యరశ్మి తగిలే చోట పెడితే 5 నిమిషాల టాక్‌టైమ్‌ని, ఒక గంట స్టాండ్‌బై టైమ్‌ని ఇస్తుంది. దీని రెండు వేల రూపాయలకు పైనే ఉంటుంది. స్యామ్‌సంగ్ బ్లూ ఎర్త్ స్యామ్‌సంగ్ కంపెనీ మూడేళ్ల క్రితమే రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ ఫోన్ ఇది. దీని వెనకాల ఉండే సోలార్ ప్యానెల్స్‌తో ఇది రీఛార్జ్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఉండే మైనస్ ఏంటంటే.. ఫోన్ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే ఈ సోలార్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. ఈ ఫోన్‌లో ఉండే మిగిలిన ఫీచర్లను వాడడం కోసం... అంటే ఫోటోలు, వీడియోలు తీయడం లాంటి వాటికోసం ఈ పవర్ ఉపయోగపడదు. భవిష్యత్తులో పూర్తిగా సోలార్ టెక్నాలజీతో పనిచేసే ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి....